బాలుడికి పాము కాటు, కనిపించని లక్షణాలు: సరైన చికిత్సతో కాపాడిన పిల్లల వైద్యుడు డాక్టర్ మహేష్
* సాధారణ లక్షణాల కంటే భిన్నమైన సమస్యలు
* మామూలే అనుకున్న తల్లిదండ్రులు
* పరిస్థితి విషమించడంతో కిమ్స్ సవీరాకు తరలింపు
* సరైన చికిత్సతో కాపాడిన పిల్లల వైద్యుడు డాక్టర్ మహేష్
అనంతపురం, జూన్ 22, 2024: సాధారణంగా పాము కాటు వేస్తే నోటి వెంట నురగలు రావడం, నరాలకు సంబంధించిన సమస్యలు బయటపడటం లాంటివి ఉంటాయి. కానీ, ఇలాంటి లక్షణాలేమీ లేకుండా.. మామూలుగా కడుపునొప్పి, వాంతులు మాత్రమే ఉంటే దాన్ని పాము కాటుగా తల్లిదండ్రులే కాదు, సాధారణ వైద్యులు కూడా గుర్తించలేరు. సరిగ్గా ఇలాంటి ఘటనే అనంతపురంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలను పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ ఎ. మహేష్ తెలిపారు.
“12 ఏళ్ల బాలుడు ఊపిరి సరిగా అందని పరిస్థితిలో అనంతపురంలోని కిమ్స్ సవీరా ఆస్పత్రికి తీసుకొచ్చారు. అప్పటికి అతడి ఆక్సిజన్ శాచ్యురేషన్ కేవలం 66% మాత్రమే ఉంది. చెస్ట్ ఎక్స్‌రే తీసి చూస్తే, న్యుమోనియా లక్షణాల లాంటివి కొన్ని కనిపించాయి. కానీ, ఒక రోజు ముందువరకు బాబుకు ఎలాంటి ఇబ్బందీ లేదు. అంటే న్యుమోనియాలో కనిపించే జ్వరం, దగ్గు, జలుబు లాంటివి ఒక్కటి కూడా లేవు. కానీ ఆక్సిజన్ శాచ్యురేషన్ బాగా తక్కువగా ఉండటంతో ముందుగా వెంటిలేటర్ అమర్చి, చికిత్స మొదలుపెట్టాం.
ఆ తర్వాత అసలు ఏం జరిగిందని ఆరా తీశాం. ముందుగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో బాబుకు తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. ఆ తర్వాత వాంతులు కావడం మొదలుపెట్టాయి. తెల్లవారు జామున గంటల సమయంలో గొంతు కూడా నొప్పి అనిపించడంతో స్థానికంగా ఉన్న ఒక ఆస్పత్రికి తీసుకెళ్లారు. లక్షణాలు చూసిన అక్కడి వైద్యులు పేగుల్లో ఏదో సమస్య అయి ఉంటుందని భావించి, అందుకు సంబంధించిన మందులు ఇచ్చారు. తర్వాత కొన్ని గంటల పాటు బాగానే ఉన్న బాబుకు.. ఆ తర్వాత ఊపిరి అందని పరిస్థితి ఏర్పడింది. దాంతో వెంటనే కిమ్స్ సవీరా ఆస్పత్రికి తరలించారు. ఈ లక్షణాలన్నీ చూస్తే తప్పనిసరిగా బాబును పాము కాటేసి ఉంటుందన్న నిర్ధారణకు వచ్చాం. సాధారణంగా పాము కాటు వేస్తే నోటివెంట నురగలు రావడం, నరాలు చచ్చుబడిపోవడం లాంటి కొన్ని లక్షణాలు ఉంటాయి. కానీ, కొన్నిరకాల పాములు కాటు వేస్తే మాత్రం ఇలా ఉండకపోగా.. వేరే లక్షణాలు కనిపిస్తాయి.
పాము కాటు అని నిర్ధారణ కావడంతో బాబుకు ముందుగా పాము విషానికి విరుగుడు అయిన ఏఎస్‌వీ (యాంటీ స్నేక్ వీనం) ఇంజెక్షన్లు ఇచ్చి, దాంతోపాటు కాల్షియం కూడా ఇవ్వడంతో రెండు రోజుల తర్వాత బాబు పూర్తిగా కోలుకున్నాడు. అతడి ఆక్సిజన్ శాచ్యురేషన్ కూడా సాధారణ స్థాయికి రావడంతో వెంటిలేటర్ తొలగించి, రెండు రోజుల్లోనే డిశ్చార్జి చేశాం.
గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు ఎవరైనా కింద పడుకుని, లేవగానే తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ, ఆ తర్వాత ఇతర సమస్యలు కూడా మొదలైతే దాన్ని పాముకాటుగా అనుమానించి, వెంటనే తగిన చికిత్స అందజేయాలి. ఆలస్యం అయ్యేకొద్దీ పరిస్థితి విషమిస్తుంది” అని డాక్టర్ మహేష్ వివరించారు.