ఏడు నెలల బాబుకు గుండెలో రంధ్రం: కర్నూలునే తొలిసారిగా ఇంత చిన్నవయసులో ఓపెన్ హార్ట్ సర్జరీ
* 2వేల మందిలో ఒక్కరికే వచ్చే అరుదైన డీఓఆర్‌వీ సమస్య
* కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో శస్త్రచికిత్సత విజయవంతం
* ఆరోగ్య శ్రీలో ఉచితంగా శస్త్రచికిత్స
కర్నూలు, జూన్ 22, 2024: చిన్నపిల్లలకు గుండెలో రంధ్రం పడటం (ఏఎస్‌డీ లేదా వీఎస్‌డీ) లాంటివి కొంత ఎక్కువగానే చూస్తుంటాం. ప్రతి వెయ్యి మంది పిల్లల్లో ముగ్గురి నుంచి నలుగురికి ఇలా జరుగుతుంటుంది. కానీ, గుండెలో పెద్ద రంధ్రం (12 మిల్లీమీటర్లు) పడటంతో పాటు రక్తనాళాల కనెక్షన్లు సరిగా లేకపోవడం అనే డీఓఆర్‌వీ సమస్య అత్యంత అరుదుగానే వస్తుంది. ప్రతి 2 వేల మంది పిల్లల్లో ఒక్కరికి మాత్రమే ఇలా సంభవించే అవకాశం ఉంటుంది. ఇలాంటి అరుదైన సమస్య ఉన్న ఏడు నెలల బాబుకు కర్నూలులోని కిమ్స్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేసి, నయం చేశారు. కర్నూలు జిల్లాలోనే ఇంత చిన్న వయసు పిల్లలకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన ప్రముఖ చిన్నపిల్లల గుండె వైద్యనిపుణులు డాక్టర్. మహమ్మద్ ఫారూఖ్ తెలిపారు.
“కర్నూలు జిల్లా పత్తికొండ ప్రాంతానికి చెందిన దంపతులు. వీరు నిత్య వ్యవసాయ కూలీలు మొదటి సంతానంగా మగ పిల్లవాడు పుట్టాడు. కొంత కాలం వరకు బాగానే ఉన్నా, ఇటీవల బాబుకు బాగా ఆయాసం వస్తోంది. దాంతో పలువురు వైద్యులకు చూపించగా, గుండె సమస్య ఉందని చెప్పారు. దాంతో కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక్కడ పరీక్షించగా, బాబుకు తీవ్రమైన గుండె సమస్య ఉన్నట్లు తేలింది. దాన్ని డీఓఆర్‌వీ అంటారు. వైద్య పరిభాషలో మాల్ ఎలైన్డ్ కోనోవెంట్రిక్యులర్ వీఎస్‌డీ అంటారు. అంటే గుండెలో పెద్ద రంధ్రంతో పాటు గుండె రక్తనాళాలు సరిగా అనుసంధానం కాకపోవడం. దాంతో బాబుకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి, వీటన్నింటినీ సరిచేయాలని నిర్ణయించాం. కన్సల్టెంట్ కార్డియోథొరాసిక్, వాస్క్యులర్ సర్జన్ డాక్టర్ భరత్ సిద్ధార్థ, కన్సల్టెంట్ పీడియాట్రిక్ కార్డియాక్ అనెస్థెటిస్ట్ డాక్టర్ వలజ జోష్న, పెర్‌ఫ్యూజనిస్ట్ జీవీ రమేష్ రెడ్డిలతో కూడిన బృందం దాదాపు మూడు గంటల పాటు శ్రమించి మొత్తం సరిచేసింది.
అనంతరం పీడియాట్రిక్ కార్డియాక్ ఐసీయూలో కూడా బాబును కంటికి రెప్పలా కాపాడుకున్నాం. శస్త్రచికిత్స చేసిన 6 గంటల తర్వాత వెంటిలేటర్ కూడా తొలగించాం. అప్పటికి బాబు సాధారణంగా శ్వాస తీసుకోగలుగుతున్నాడు. శస్త్రచికిత్స జరిగిన రెండు రోజుల తర్వాత ఐసీయూ నుంచి మామూలు గదికి తరలించాం. అన్నీ బాగున్నాయనుకున్న తర్వాత డిశ్చార్జి చేశాం. ఇప్పుడు బాబు పూర్తి ఆరోగ్యంతో ఉండి, కొంత బరువు కూడా పెరిగాడు. చురుగ్గా ఆడుకుంటున్నాడు. ఎలాంటి ఇబ్బందీ లేకపోవడంతో తల్లిదండ్రులతో పాటు వైద్య బృందం కూడా ఎంతగానో సంతోషించారు. ఆరోగ్య శ్రీలో ఉచితంగా ఈ శస్త్రచికిత్స జరిగిందని ” అని డాక్టర్ మహమ్మద్ ఫారూఖ్ వివరించారు.