ప్రతిష్టాత్మకమైన జెసిఐ అక్రిడిటేషన్‌ను పొందిన మారతహళ్లి, బెంగుళూరులోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్

బెంగళూరు, జూన్ 18, 2024: భారతదేశంలోని పిల్లల మరియు మహిళల సంరక్షణ కోసం  ప్రసిద్ధ చెందిన ఆరోగ్య సంరక్షణ సదుపాయం, రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మరియు బర్త్‌రైట్ బై రెయిన్‌బో హాస్పిటల్స్, ప్రతిష్టాత్మకమైన జాయింట్ కమిషన్ ఇంటర్నేషనల్ (జెసిఐ), నుండి గౌరవనీయమైన 'గోల్డ్ సీల్ ఆఫ్ క్వాలిటీ అప్రూవల్' ను   మారతహళ్లి, బెంగళూరులోని తమ ఆసుపత్రి కోసం అందుకున్నట్లు సంతోషంగా వెల్లడించింది .

రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ మరియు బర్త్‌రైట్ బై రెయిన్‌బో, మారతహళ్లి, బెంగళూరు సాధించిన అక్రిడిటేషన్,  సంస్థ  లోపల  ఆసుపత్రి నిర్వహణ మరియు చికిత్స మార్గదర్శకాల యొక్క కఠినమైన ప్రమాణాల అమలు పట్ల దాని నిబద్ధతను హైలైట్ చేస్తుంది, రోగుల సంరక్షణలో ఉన్నత స్థాయి ప్రమాణాలను సులభతరం చేస్తుంది. ఈ ఘనత సాధించటానికి మొత్తం ఆసుపత్రి బృందం నుండి గణనీయమైన తోడ్పాటు , అంకితభావం అవసరం, ఎందుకంటే ఇది జెసిఐ నిర్దేశించినట్లుగా 14 అధ్యాయాలు మరియు 1200 కంటే ఎక్కువ కొలవగల అంశాలతో కూడిన సమగ్ర చెక్‌లిస్ట్‌ లో మెరుగైన ప్రమాణాలను అనుసరించాల్సి ఉంటుంది. 

"రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌  వద్ద  ఈ ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడం అసాధారణమైన ఆరోగ్య సంరక్షణను అందించడంలో మా నిరంతర అంకితభావానికి నిదర్శనం. ఇది మా బృందం యొక్క ఐక్యత, సమ్మిళిత బలం మరియు నిబద్ధత, అలాగే మా ఆరోగ్య సంరక్షణ నిపుణులు అందించే సున్నితమైన సంరక్షణను ప్రదర్శిస్తుంది. భద్రత మరియు నాణ్యత యొక్క గొప్ప ప్రమాణాలు అనుసరణ పట్ల పూర్తి నిబద్దత ప్రదర్శించటంతో పాటుగా మా రోగులలో ప్రతి ఒక్కరికి ప్రపంచ స్థాయి వైద్య సంరక్షణ అందుతుందని హామీ ఇస్తున్నాము " అని డాక్టర్ రమేష్ కంచర్ల, రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అన్నారు. 

ఈ గుర్తించదగిన సాధనకు ప్రతిస్పందనగా, బెంగళూరులోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్ & రీజినల్ బిజినెస్ హెడ్ శ్రీ నిత్యానంద్ పి  మాట్లాడుతూ  "అత్యున్నతమైన క్లినికల్ నైపుణ్యాన్ని అందించాలనే మా దీర్ఘకాల నిబద్ధత ఆసుపత్రిలోని ప్రతి సభ్యునికి ఈ ముఖ్యమైన మైలురాయి చేరుకునేందుకు  దారితీసింది. ఈ విజయం మా వైద్యులు, నర్సులు మరియు సిబ్బంది అందించిన ప్రేమతో  కూడిన సంరక్షణతో పాటు మా ఐక్యత, సమిష్టి కృషి మరియు అంకితభావాన్ని వెల్లడిస్తుంది.  నాణ్యత మరియు భద్రత యొక్క అంతర్జాతీయ ప్రమాణాలు  నిర్వహించటం తో పాటుగా  మా రోగులకు అసాధారణమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి మేము ప్రతిజ్ఞ చేస్తున్నాము " అని అన్నారు. 

అత్యుత్తమ శిశువైద్య సంరక్షణను అందించడమే మా లక్ష్యం, మరియు ఒక బృందంగా, మేము ప్రారంభం నుండి అంచనాలకు మించి  వెళ్లడానికి అవిశ్రాంతంగా పనిచేస్తూనే వున్నాము. సంయుక్తంగా , మా అపారమైన జ్ఞానం, ఉత్తమ అభ్యాసాలను అనుసరించటం , భద్రతపై అధికంగా దృష్టి సారించటం , అత్యంత నైపుణ్యం కలిగిన వైద్య మరియు పారామెడిక్ సిబ్బందిని ఉపయోగించడం మరియు నిరూపిత  ఆధారిత చికిత్స ప్రోటోకాల్‌లు దీనిని సాధించడానికి మాకు అనుమతినిచ్చాయి. రోగుల సంరక్షణ పట్ల మా నిబద్ధత తాజా జెసిఐ అక్రిడిటేషన్ ద్వారా ధృవీకరించబడింది, ఇది మా పూర్తి విధానాన్ని కూడా నొక్కి చెబుతుంది. జెసిఐ అక్రిడిటేషన్ కోసం క్లినికల్ నాణ్యత మరియు రోగి భద్రతకు గణనీయమైన నిబద్ధత అవసరం, కాబట్టి దానిని సాధించడం అంత తేలికైన పని కాదు. మా ఆసుపత్రికి, ఈ అక్రిడిటేషన్ నిరంతర నాణ్యతా మెరుగుదల కోసం మా కొనసాగుతున్న ప్రయత్నంలో కీలకమైన మలుపు" అని  డాక్టర్ రక్షయ్ శెట్టి, సీనియర్ కన్సల్టెంట్ ,  పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ మరియు జనరల్ పీడియాట్రిక్స్‌ , రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్, మారతహళ్లి, బెంగళూరు అన్నారు.   

“అంతర్జాతీయ రోగి భద్రతా లక్ష్యాలు మన రోజువారీ పద్ధతులు మరియు సంస్కృతిలో పొందుపరచబడ్డాయి. ఈ లక్ష్యాలు రోగి భద్రత మరియు సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడానికి మేము దృష్టి సారించే క్లిష్టమైన ప్రాంతాలను సూచిస్తాయి.

జెసిఐ  నాణ్యతా ప్రమాణాలను అనుసరించటానికి  నర్సింగ్, ఫార్మసీ, ఫెసిలిటీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, లాబొరేటరీ, రేడియాలజీ, మెడికల్ రికార్డ్స్ మొదలైన వివిధ విభాగాలలో ప్రామాణిక నిర్వహణ  విధానాలను పర్యవేక్షించడానికి వివిధ ఆడిట్‌లు కాలానుగుణంగా జరుగుతాయి. ఆసుపత్రిలో నాణ్యత మరియు రోగి భద్రతా ప్రమాణాలు రాజీపడకుండా ఉన్నాయని  నిరంతరం నిర్ధారించడానికి క్లినికల్ మరియు నాన్-క్లినికల్ ప్రాంతాలలో తరచుగా ఆపరేషన్‌లు మరియు నాణ్యత బృందంచే ఫెసిలిటీ రౌండ్‌లు చేయబడతాయి. ప్రామాణిక చికిత్స ప్రోటోకాల్‌లను నిర్ధారించడానికి క్లినికల్ కేర్ మార్గాలు అమలు చేయబడ్డాయి.

మా లక్ష్యానికి అనుగుణంగా ఉంటూ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు వైద్యపరమైన నైపుణ్యం సహాయంతో తల్లి మరియు బిడ్డలకు సాధ్యమైనంత ఉత్తమమైన సంరక్షణను అందించడం కోసం మేము తీవ్రంగా శ్రమిస్తున్నాము ; అభివృద్ధి చెందిన దేశాలలోని ప్రముఖ ఆసుపత్రులలో దేనితోనైనా సమానంగా అంతర్జాతీయ స్థాయి సంరక్షణ ప్రమాణాలను సాధించగలమని మేము విశ్వసిస్తున్నాము” అని  డాక్టర్ సమర్పిత దత్తా చౌదరి, క్లస్టర్ హెడ్ - మెడికల్ డైరెక్టర్, రెయిన్‌బో చిల్డ్రన్స్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగళూరు అన్నారు . 

జెసిఐ  ప్రపంచవ్యాప్తంగా సహకరిస్తుంది, ఆరోగ్య సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడానికి మరియు కేర్ యాక్సెసిబిలిటీ, పేషెంట్ మూల్యాంకనం, మందుల నిర్వహణ, నాణ్యత మెరుగుదల మరియు మరిన్నింటితో సహా వివిధ డొమైన్‌లలో రోగి భద్రతను నిర్ధారించడానికి అమూల్యమైన నైపుణ్యాన్ని అందిస్తోంది. ఎంపిక చేసిన సంస్థ కోసం ప్రత్యేకించబడిన ప్రతిష్టాత్మకమైన  జెసిఐ గుర్తింపు,  రోగి భద్రత, ప్రోటోకాల్‌లు మరియు పాలనలో రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ యొక్క శ్రేష్ఠతను క్షుణ్ణమైన మూల్యాంకన ప్రక్రియను అనుసరించి గుర్తించింది.

రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ రెండు దశాబ్దాలకు పైగా అనుభవాన్ని కూడగట్టుకోవటం తో పాటుగా క్లినికల్ మరియు నాన్-క్లినికల్ ఆపరేషన్‌లలో నైపుణ్యం కోసం అంకితభావంతో కీర్తిని పెంపొందించుకుంది.  అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన విధానాలు మరియు విధానాలకు దగ్గరగా  నాణ్యత మరియు భద్రత యొక్క కఠినమైన ప్రమాణాలను రోగుల సేవల పరంగా సంస్థ నిర్వహిస్తుంది. అంతేకాకుండా , జెసిఐ  ద్వారా వివరించబడిన భద్రతా ప్రమాణాలకు కట్టుబడి , ఆసుపత్రి తమ మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ భద్రతా మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యూహాత్మకంగా నిర్మించింది.  

     

More Press News