అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి జాతర విజయవంతానికి కృషి చేయాలి: తెలంగాణ సీఎస్

శాఖల వారీగా చేపట్టిన పనులు, కలిపించిన సౌకర్యాలు, కేటాయించిన విధులపై తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ డీజీపీ కే.మహేందర్ రెడ్డితో కలిసి మేడారం ఆలయ ఆవరణలో జిల్లా యంత్రాంగంతో సమీక్షించారు. అంతకు ముందు ఆయన హెలిప్యాడ్ వద్ద నుండి జంపన్న వాగు నుండి  ఏర్పాట్లను పరిశీలిస్తూ గద్దెల వద్దకు చేరుకున్నారు.

చీఫ్ సెక్రెటరీ  మాట్లాడుతూ..

  • అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి జాతర విజయవంతానికి కృషి చేయాలి

  • సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండాలి

  • జాతరలో అన్ని పనులు నిర్ణిత గడువులోగా పుర్తి చేశారు

  • జాతర విజయవంతానికి వేసిన ప్రణాలికను అమలుపర్చాలి

  • అధికారుల నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి

  • పారదర్శకంగా, బాధ్యతాహితంగా అధికారులు విధులు నిర్వహించాలి

  • ప్రభుత్వం జాతరను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది

  • రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి రోజు జాతర ఏర్పాట్లు , భక్తుల ఫ్లో పై సమీక్షిస్తున్నారు

  • ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు తలెత్తకుండా ఉన్నతాధికారులు మేడారం వచ్చి రోజు వారీ క్షేత్రస్థాయిలో సమీక్షించేందుకు  ముఖ్యమంత్రి  హైద్రాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ను కేటాయించారు

  • ముఖ్యమంత్రి జాతర కు ఇస్తున్న ప్రాముఖ్యత ను గమనించాలి

  • ప్రతి భక్తుడికి తల్లుల దర్శనం సజావుగా జరగాలి.. మంచి జ్ఞాపకాలతో భక్తులు మేడారం నుండి వెళ్లేలా చూడాలి

మేడారం జాతరకు వచ్చే భక్తులకు గమనిక:

  • జాతరకు వచ్చే భక్తులు వారి యొక్క వాహనాలతో ఇతర వాహనాలను ఓవర్ టెక్ చేయరాదు

  • పోలీసులు సూచించిన మార్గాల మీదుగా మాత్రమే వాహనాలను నడపాలి

  • వాహనాలను అనుమతి లేని చోట పార్కింగ్ చేయకుండా, సూచించిన చోట మాత్రమే పార్కింగ్ చేయగలరు లేదా మీ వాహనాలు పోలీస్ అధికారుల కంట్రోల్ కి తరలించబడును

  • జంపన్న వాగు స్నాన ఘట్టాల వద్ద ఇతర భక్తులకు ఇబ్బంది కల్గించకుండా వ్యవహరించాలి

  • అమ్మవార్ల దర్శనానికి నిర్దేశించిన Q-లైన్లలో మాత్రమే వచ్చి దర్శనం చేసుకోవాలి. తద్వారా మీ దర్శనం సులభతరం అవుతుంది

  • పోలిసుల నిఘాలో, కంట్రోల్ CC టీవీ ఫుటేజ్ పర్యవేక్షాణ ద్వారా మీ చర్యలను ఎప్పటికపుడు మానిటరింగ్ చేయబడును. కావున భక్తులంతా జాగ్రత్తగా మెలిగి సహకరించగలరుములుగు ASP
    P.సాయి చైతన్య IPS.


More Press News