'మహిళల రక్షణాయుధం' లఘు చిత్రాన్ని విడుదల చేసిన ఉమెన్ సేఫ్టీ విభాగం ఐజీ!

తెలంగాణ రాష్ట్రంలో మహిళలపై జరిగె నేరాలను అరికట్టేందుకు, వేధింపుల నిరోధానికి పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన షీ-టీమ్ లపై మరింత చైతన్యం చేసేందుకు గాను 'మహిళల రక్షణాయుధం' అనే పేరుతొ రూపొందించిన లఘు చిత్రాన్ని ఉమెన్ సేఫ్టీ విభాగం ఐజీ స్వాతీ లక్రా విడుదల చేశారు. కళాశాల విద్యార్థినులు పోకిరీల నుండి ఎదురయ్యే వేధింపులను ఎలా ఎదుర్కోవాలనే అంశాలతోపాటు కళాశాలలు, ప్రధాన జంన్షన్ల వద్ద షీ టీమ్ బృందాలు మఫ్టీలో నిర్వహించే విధులు, పోకిరీల చేష్టలను సూక్ష్మ కెమెరాలతో చిత్రించి తగు ఆధారాలతో కేసులను నమోదు చేయడం, ఆపద సమయాలలో షీ టీమ్ లు ఏవిదంగా సాయపడతాయి, తదితర వివరాలన్నింటినీ ఈ డాక్యుమెటరీలో చిత్రించారు.

ప్రస్తుతం సమాజంలోని యువత దాదాపు 80 శాతం స్మార్ట్ ఫోన్ లు ఉపయోగిస్తుండడంతో ఈ డాక్యూమెంటరీనీ యువతకు సమర్దవంతంగా చేరవేయడానికిగాను అన్ని సోషల్ మీడియా మాద్యమాలైన పేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్, ఇన్-స్టాగ్రామ్ లలో అప్ లోడ్ చేసినట్లు ఐజీ స్వాతీ లక్రా తెలిపారు.


More Press News