విజయ్ దేవరకొండ బ్లాక్ హాక్స్ ఓపెన్ 24
హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ ఆధ్వర్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అతిపెద్ద అమెచ్యూర్ వాలీబాల్ టోర్నీకి రూపే అధికారిక స్పాన్సర్‌గా కొనసాగుతున్నది.
హైదరాబాద్, ఫిబ్రవరి 8, 2024: రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ ఆధ్వర్యంలో అతిపెద్ద టోర్నీగా జరుగబోతున్న ‘విజయ దేవరకొండ(వీడీ) ఓపెన్ 24 టోర్నమెంట్(ఫైనల్)ను’ ప్రకటించబోతున్నాం.
వీడీ బ్లాక్‌హాక్స్ ఓపెన్‌కు రూపే అధికారిక స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నది. ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్)లో హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ ప్రొఫెషనల్ వాలీబాల్ టీమ్‌గా పోటీపడుతున్నది. అయితే భారత దేశ టాప్ వాలీబాల్ టోర్నీ ద్వారా ప్రతిభ కల్గిన ప్లేయర్లను వెలుగులోకి తీసుకురావడంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ప్లేయర్లను మరింతగా సానబెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఈ సందర్భంగా వీడీ బ్లాక్‌హాక్స్ ఓపెన్‌పై హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ సహ యజమాని విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ప్రైమ్ వాలీబాల్ లీగ్ ప్రయాణంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ కల్గిన ప్లేయర్లను గుర్తించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. రెండు రాష్ట్రాల్లో దాదాపు 16 సిటీల్లో వీడీ బ్లాక్‌హాక్స్ ఓపెన్ 24 టోర్నీ ద్వారా వాలీబాల్‌ను క్షేత్ర స్థాయిలో మరింతగా ప్రమోట్ చేస్తున్నాం. దీనికి తోడు ఆటను మరింత విస్తరించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. గచ్చిబౌలి స్టేడియంలో ఫైనల్లో తలపడే జట్లకు అభినందనలు తెలుపుతున్నాను.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 16 సిటీల నుంచి మొత్తం 307 జట్లు టోర్నీలో పోటీపడబోతున్నాయి. ఇందులో 3,200 మంది ప్లేయర్లు, కోచ్‌లు ఉంటారు. టోర్నీ మొత్తమ్మీద 15000 మంది అభిమానులు ఇందులో భాగమవుతారు. ఈ కింద జిల్లాల నుంచి టోర్నీలో పోటీపడేందుకు ప్లేయర్లను ఆహ్వానిస్తున్నాం.
తెలంగాణ: ఆదిలాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ, కరీంనగర్, వరంగల్.
ఆంధ్రప్రదేశ్: గుంటూరు, విజయవాడ, నెల్లూరు, కడప, రాజమండ్రి, కర్నూల్, విశాఖపట్నం, ఏలూరు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో వీడీ బ్లాక్‌హాక్స్ ఓపెన్ 24 అనేది తొలి టోర్నీ. దీని ద్వారా వాలీబాల్‌ను వేలాది మంది పిల్లలు కెరీర్‌గా ఎంచుకోవడంతో పాటు తమ ప్రతిభను చూపించేందుకు అవకాశం లభిస్తుంది. వాలీబాల్‌ను మరింత క్షేత్రస్థాయిలో విస్తరించడానికి తోడు ప్రతిభ ప్లేయర్లను గుర్తించి వారిని సానబట్టడం అన్న ప్రధాన ఉద్దేశంతో వీడీ బ్లాక్‌హాక్స్ ఓపెన్ 24 టోర్నీని నిర్వహిస్తున్నాం అని హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ ప్రిన్సిపల్ ఓనర్ అభిషేక్‌రెడ్డి పేర్కొన్నారు.
క్షేత్రస్థాయిలో సరైన ప్రతిభను గుర్తిస్తూ వారిని మరింత ప్రోత్సహించేందుకు బ్లాక్‌హాక్స్ నిరంతం ప్రయత్నిస్తుందని అభిషేక్ అన్నారు.
ఈ నెల 10, 11 తేదీల్లో నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చే జట్లను ఉత్సాహపరిచేందుకు అభిమానులను భారీ సంఖ్యలో ఆహ్వానిస్తున్నాం. టోర్నీలో మొత్తంగా రెండు దశల్లో(జిల్లా స్థాయి, చాంపియన్‌షిప్ స్థాయి) జరుగుతుంది. ఇప్పటికే జిల్లా స్థాయి పోటీలు జనవరి 19-21, 26-28, ఫిబ్రవరి 2-4 తేదీల్లో ముగిశాయి. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో 10, 11 తేదీల్లో చాంపియణ్‌షిప్ తుది పోటీలు జరుగుతాయి.
టోర్నీలో పోటీపడి అద్భుత ్రప్రదర్శన కనబరిచిన వారికి బ్లాక్‌హాక్స్ తగిన రీతిలో నగదు ప్రోత్సాహం అందిస్తుంది. చాంపియన్‌షిప్‌లో లెవల్ ప్రైజ్‌మనీ కింద 1 రూపాయాలు, రన్నరప్ జట్టుకు రూ.50,000 అందజేస్తాం. సెమీఫైనల్లో ఓడిన జట్లకు రూ.25000 చొప్పున ఇస్తాం. వీడీ బ్లాక్‌హాక్స్ ఓపెన్ 24 టోర్నీలో గెలిచిన జట్టును హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ టీమ్‌తో శిక్షణ పొందేందుకు ఆహ్వానిస్తాం.
ఈ నెల 11న జరిగే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి హైదరాబాద్ బ్లాక్‌హాక్స్ సహ యజమాని, ప్రముఖ హీరో విజయ్ దేవరకొండ హాజరవుతారు. ఈ సందర్భంగా అభిమానుల కోసం బ్లాక్‌హాక్స్ ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహిస్తాం.