సమ్మక్క - సారలమ్మ జాతరకు తెలంగాణ గవర్నర్ ను ఆహ్వానించిన మంత్రి సత్యవతి రాథోడ్!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క - సారలమ్మ జాతరకు రావాలని కోరుతూ పోచంపల్లి చేనేత శాలువా కప్పి, సంప్రదాయ వెండి కుంకుమ భరిణ ఇచ్చి, గిరిజన సంక్షేమ శాఖ రూపొందించిన మేడారం జాతర -2020 ఆహ్వాన పత్రికతో పాటు అత్యంత పవిత్రంగా భావించే మేడారం ప్రసాదం *బంగారాన్ని* తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళి సైకి అందించిన రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ - శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, శాఖ కార్యదర్శి బెన్హర్ మహేష్ దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, ఇతర అధికారులు.
ఆహ్వాన పత్రికను అందించిన తర్వాత మేడారం చరిత్ర, విశిష్టత తెలిపే విధంగా ఆహ్వాన పత్రికను రూపొందించిన తీరును మంత్రి సత్యవతి రాథోడ్ గవర్నర్ కి వివరించారు. సమ్మక్క - సారలమ్మ జాతరలో భక్తుల సౌకర్యార్థం ఈ ఏడాది తీసుకున్న కార్యక్రమాలు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్లాస్టిక్ నివారణ కోసం తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు.