విద్యాధరపురం స్టేడియంలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర పోటీల పరిశీలన

పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రద్యుమ్న ఐఏఎస్, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐఏఎస్


 విద్యాధరపురం స్టేడియంలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర పోటీలను శుక్రవారం ఉదయం పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రెటరీ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ ప్రద్యుమ్న ఐఏఎస్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐఏఎస్ పరిశీలించారు.

 ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర  పోటీలు క్రీడాకారులలో ఉన్న నైపుణ్యం వెలికి తీసేందుకు ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయని, జరుగుతున్న ఐదు విభాగాలలో క్రీడాకారులు తమ ప్రతిభను చాటి చెప్పాలని, పశ్చిమ నియోజకవర్గంలో స్టేడియం నిర్మాణ అనేది క్రీడాకారుల ఆశని, అభివృద్ధి చెందుతున్న విజయవాడలో ప్రత్యేకించి పశ్చిమ నియోజకవర్గంలో విద్యాధరపురం లో నిర్మాణం అవుతున్న స్టేడియం అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం అని, క్రీడాకారులకు అవసరమయ్యే అన్ని క్రీడలకు అనుగుణంగా  ఈ స్టేడియంలో నిర్మాణం అవుతున్నాయని, ప్రస్తుతం ఆడుదాం ఆంధ్ర పోటీల్లో నిర్వహణ కూడా ఇక్కడ జరుగుతుందని, క్రీడాకారులు ఎంతో ఆసక్తితో పోటీలో పాల్గొంటున్నారని అన్నారు. పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాస్ క్రికెట్ ఆడి క్రీడాకారులకు ప్రోత్సాహం అందించి ఆడుదాం ఆంధ్ర పోటీలలో విజేతలుగా నిలవాలని అన్నారు.


 ప్రిన్సిపల్ సెక్రెటరీ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ ప్రద్యుమ్న ఐఏఎస్ ఆడుదాం ఆంధ్ర పోటీల నిర్వహణను పరిశీలించి ఎనీ మ్యాచ్లు జరగాలి, ఎన్ని మ్యాచ్లు అయ్యాయి అని పరిశీలించారు. క్రీడ మైదానంలో దిగి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు క్రికెట్ ఆడారు. క్రీడాకారులతో ఆడుదాం ఆంధ్ర పోటీల గురించి వివరించి వారిలో క్రీడా స్ఫూర్తిని నింపి  ఆడుదాం ఆంధ్ర పోటీలలో సచివాలయం పరిధిలో గెలిస్తే మండలం స్థాయిలో పోటీ ఉంటుందని మండలం స్థాయిలో గెలిస్తే నియోజకవర్గం స్థాయిలో ఉంటుందని ఆ తర్వాత జిల్లా స్థాయిలో చివరిగా రాష్ట్రస్థాయిలో పోటీలు నిర్వహించనున్నారని క్రీడాకారులకు వివరించి పోటీల్లో గెలిచేందుకు అభినందనలు తెలిపారు

  విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐఏఎస్  విద్యాధరపురం స్టేడియంలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర పోటీల నిర్వహణ పనితీరును పరిశీలించి ప్రతిదీ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందా లేదా నిరంతరంగా నివేదికను సచివాలయం సిబ్బంది సమర్పిస్తున్నారా లేదా అని పరిశీలించారు. ప్రతిరోజు ఎన్ని మ్యాచ్లు జరుగుతున్నాయి అప్పటికి ఎన్ని అయ్యాయి ఇంకా ఎన్ని జరగాల్సినవి ఉన్నాయి క్రీడాకారులు సిద్ధంగా ఉన్నారా లేదా సిబ్బంది క్రీడాకారులను పర్యవేక్షిస్తున్నారా లేదా అని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాధరపురం స్టేడియంలో జరుగుతున్న ఆడుదాం ఆంధ్ర పోటీలలో క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నారని రానున్న రోజుల్లో విద్యాధరపురం  స్టేడియం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని విద్యాధరపురం స్టేడియంలో ఇండోర్ మరియు అవుట్డోర్ క్రీడలకు సంబంధించిన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తున్నారని, పరిసర ప్రాంత ప్రజలకు క్రీడల్లో నైపుణ్యం పెంచేందుకు ఇదొక ప్రధాన కేంద్రంగా మారబోతున్నదని,  ప్రజలు దీని సద్వినియోగించుకోవాలని అన్నారు. ఆడుదాం ఆంధ్ర పోటీలు  విద్యాధరపురం స్టేడియంలో జరుగుతున్న నేపథ్యంలో పరిసర ప్రాంత ప్రజలు పాల్గొనవచ్చు లేదా ఆడుతున్న క్రీడాకారులను ప్రోత్సహించవచ్చని అని అన్నారు.


 ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం శాసనసభలు వెలంపల్లి శ్రీనివాస్, ప్రిన్సిపల్ సెక్రెటరీ యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం అండ్ కల్చర్ ప్రద్యుమ్న ఐఏఎస్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐఏఎస్ తో పాటు డీఎస్ఓ అజీజ్, విజయవాడ నగరపాలక సంస్థ  అడిషనల్ కమిషనర్లు కె. శకుంతల, కె. వీ సత్యవతి,  చీఫ్ ఇంజనీర్ ఎం. ప్రభాకర్ రావు, చీఫ్ సిటీ ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ సిటీ ప్లానర్ జుబిన్ సిరన్ రాయ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, వార్డ్ సెక్రటరీలు, గ్రౌండ్ ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.

More Press News