రోడ్ల మీద వర్షపు నీరు ఉండకుండ చర్యలు
విజయవాడ నగరపాలక సంస్థ
తేదీ.05-12-2023.
రోడ్ల మీద వర్షపు నీరు ఉండకుండ చర్యలు
ముంపు ప్రాంత ప్రజలకు ఒక్కో సర్కిల్ కు ౩ పునరావాస కేంద్రాలు
నగర కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, మంగళవారం ఉదయం కండ్రిక జంక్షన్ నుండి నూజివీడు రోడ్డు వైపు వెళ్ళు మేజర్ ఔట్ ఫాల్ డ్రైన్ ను పరిశీలించారు.మిచౌంగ్ తుఫాన్ సందర్భంగా పెరుగుతున్న వర్షతాపను దృశ్య నగరంలోని ఔట్ఫాల్ డ్రైన్లో ఎటువంటి చెత్త పేరు పోకుండా సాఫీగా నీళ్లు ప్రవహించేలా చర్యలు తీసుకో వాలనే ఉద్దేశంతో మంగళవారం ఉదయం విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ కండ్రిక జంక్షన్ నుండి నూజివీడు రోడ్డు వైపు వెళ్ళే మేజర్ అవుట్ ఫాల్ డ్రైన్ ను జె.సి.బి ద్వార పరిసుభ్రపరిచే పనితీరును పరిశీలించారు.
ఈ సందర్భంగా కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ఆ ప్రాంతంలో వెంచర్స్ ఎక్కువగా ఉన్నాయని, వెంచర్స్ ఉన్నవాళ్లు కల్వర్టులు ఏమీ కటకపోవడంతో గార్బేజ్ ఎక్కువగా పేరుకుపోయిందని అన్నారు, పుల్లేటి కాలువ మరియు ఈఎస్ఐ జంక్షన్ వద్దా తుఫాను ప్రభావం వల్ల వర్షపు నీరు ఎక్కువగా కాలువలో ఉండి పోవడం వలన ఈఎస్ఐ జంక్షన్ దగ్గర ఉన్న కాలువలోని నీళ్లు రోడ్డుపైకి రాకుండా ఆయిల్ ఇంజిన్స్ పెట్టి వర్షపు నీరు రోడ్డుపైన రాకుండా ఉండేటట్టు చూడమన్నారు. ఆయిల్ ఇంజన్స్ పెట్టడం ద్వారా డ్రైన్ లోని నీరును త్వరగా కలవలోకి పంపిస్తుంది కాబట్టి అవసరమైన ప్రదేశాలలో ఆయిల్ ఇంజిన్స్ పెట్టి రోడ్డు మీదికి వర్షపు నీరు రాకుండా ఉండేటట్టు చూడమని అధికారులకు అదేశాలు ఇచ్చారు.
ముంపు మరియు కొండ ప్రాంతంలో నివసిస్తున్న నివాసులకు ముంపు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారికి పునరావసం కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్క సర్కిల్ కి మూడు స్కూలు కేటాయించాము అని అన్నారు. ప్రజలు వాళ్ళ వాలంటీర్ లేదా వీఆర్వో ద్వారా పాఠశాలలో కలిపించి పునరావాసం కేంద్రాల గురించి తెలుసుకోవచ్చు అని అన్నారు.
తుఫాను దృశ్య విజయవాడ నగర వాసులకు ఎటువంటి ప్రమాదాలు తలెత్తకూడదనే ఉద్దేశంతో విజయవాడ నగరపాలక సంస్థ ఎక్కడ నీటి నిలువలు ఉండకూడదని, ఉన్న డ్రైనులో నీటి ప్రవాహం సాఫీగా ప్రవహించేలా 9 సెంటర్లలో 9 జెసిబిలు ఏర్పాటు చేశామని, అవసరమైన ప్రతి చోట పంపింగ్ మోటార్స్ ని ఏర్పాటు చేశామని అన్నారు.
తుఫాను తీవ్రత తగ్గేంత వరకు ప్రజలని ఇంటి నుంచి బయటకు రావద్దని ప్రత్యేకించి అవుట్ఫాల్ట్ డ్రైనేజీలు ఉన్నచోట పిల్లల్ని పంపించకూడదని తమ చిన్నారులను జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని కోరారు. తుఫాన్ తీవ్రత తగ్గినంతవరకు త్రాగే నీరును కూడా కాచి వడబోసి తగలని, ఎటువంటి అనారోగ్యాల పాలవ్వకూడదని ఆరోగ్యo పట్ల శ్రద్ధ వహించాలని కమిషనర్ కోరారు.
ఈ పర్యటనలో కమిషనర్ తో పాటు చీఫ్ ఇంజనీర్ యం ప్రభాకర్ రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-2 శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్-౩ i/c ప్రవీణ్ శర్మ, జోనల్ కమిషనర్ మల్లాద్రి, డి.ఇ యేసు బాబు పాల్గొన్నారు.
పబ్లిక్ రిలేషన్స్ అధికారి
విజయవాడ నగరపాలక సంస్థ