ఎన్ని జన్మలు ఎత్తినా అభిమానుల రుణం తీర్చుకోలేను.. ‘కాలింగ్ సహస్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుడిగాలి సుధీర్
బుల్లి తెరపై సుడిగాలి సుధీర్‌కి ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. బుల్లితెరపై సూపర్ స్టార్‌గా ఫేమస్ అయిన సుధీర్ నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్స్ పతాకాలపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ సరసన డాలీషా హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు జేడీ చక్రవర్తి, దర్శకుడు దశరథ్, బొమ్మరిల్లు భాస్కర్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. ‘నాకు మంచి పాత్రను, సవాల్‌తో కూడుకున్న పాత్రను ఇచ్చిన అరుణ్ గారికి థాంక్స్. నాలోని ఇంకో కోణాన్ని చూపించే పాత్ర వచ్చింది. డాలీషాతో పని చేయడం ఆనందంగా ఉంది. ఆమె నటిస్తూ ఉంటే ఎంతో కాంపిటేటివ్‌గా అనిపిస్తుంది. మా సినిమాను ఎలా ప్రమోట్ చేయాలా? అనుకుంటున్న టైంలోనే బెక్కెం వేణుగోపాల్ గారు సాయం చేశారు. మంచి థియేటర్లలో సినిమాను రిలీజ్ చేసేలా హెల్ప్ చేశారు. గెటప్ శ్రీను అనే వాడు.. వేణు అన్న దగ్గరికి వెళ్లమని చెప్పకపోతే.. మల్లెమాల టీం, జబర్దస్త్ లేకపోతే.. మీ అభిమానం నాకు దక్కేది కాదు. వాళ్ల వల్లే మీ అభిమానం దొరికింది. మీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎన్ని జన్మలు ఎత్తినా ఆ రుణం తీర్చుకోలేను. గాలోడు సినిమా అభిమానుల వల్లే హిట్ అయింది.. ఇప్పుడు మంచి చిత్రాలు ఇస్తే ఇంకా ప్రేమిస్తారు అని నా శ్రేయోభిలాషులు సలహాలు ఇచ్చారు. ఇకపై కొత్త కంటెంట్, మంచి సినిమాలు తీస్తాను. కొత్త సినిమా, కొత్త ప్రయత్నం చేశాం. మీకు నచ్చితే పది మందికి చెప్పండి. 30వ తేదీ అందరూ ఓటు వేయండి.. 1వ తేదీ మా సినిమాను చూడండి’ అని అన్నారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘కాలింగ్ సహస్ర సినిమాను నేను చూశాను. నాకు చాలా బాగా నచ్చింది. అందుకే సపోర్ట్ చేసేందుకు ముందుకు వచ్చాను. డిసెంబర్ 1న రాబోతోన్నామని డేట్ వేశాం. మా సినిమాను నమ్మి భరత్ గారు ముందుకు వచ్చి ఆంధ్రాలోని అన్ని ఏరియాలను కొన్నారు. అలా అన్ని ఏరియాలు వెంటనే బిజినెస్ అయింది. మంచి థియేటర్లు దొరికాయి. డైరెక్టర్ అరుణ్ ఈ సినిమాను అద్భుతంగా మలిచాడు. అన్ని అంశాలు కలగలపి తీశాడు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. డిసెంబర్ 1న మా సినిమాను చూసి మమ్మల్ని గెలిపిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు. విజేష్ తయాల్ మాట్లాడుతూ.. ‘సినిమా చేస్తున్నాను అంటే చాలా ధైర్యం చేస్తున్నారు అని అన్నారు. మంచి కథను ఎంచుకుంటే, సుధీర్ గారి లాంటి వారు ఉంటే సులభంగా సక్సెస్ వస్తుందని నేను నమ్మాను. సపోర్ట్ చేయడానికి వచ్చిన నేను.. టీం కష్టపడే తత్త్వాన్ని చూసి నిర్మాతగా మారాను. మా సినిమాను ప్రేక్షకులు ఆదరించండి’ అని అన్నారు. వెంకటేశ్వర్లు కాటూరి మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్‌కు వచ్చిన అతిథులందరికీ థాంక్స్. మా సుధీర్ గారి అభిమానులు, యాంకర్ సుమ గారికి ధన్యవాదాలు. అరుణ్ విక్కిరాల కథ చెప్పడంతో మాకు నచ్చింది. మాతో పాటు మా బాల్యమిత్రడు చిరంజీవి గారు కలిశారు. సుధీర్ గారిని హీరోగా అనుకున్నాం. చివరకు మా ప్రాజెక్ట్‌లో విజేష్ గారు వచ్చారు. మంచి సినిమా అని బడ్జెట్ ఎక్కువైనా పర్లేదని ఆయన ముందుకు వచ్చారు. సినిమా చాలా బాగా వచ్చింది. డిసెంబర్ 1న మా చిత్రం రాబోతోంది. అందరూ ఆదరించండి’ అని అన్నారు. దర్శకుడు దశరథ్ మాట్లాడుతూ.. ‘అరుణ్ విక్కిరాలకు సినిమా మీద చాలా ప్యాషన్ ఉంది. సుధీర్ చక్కగా నటించారు. హీరోయిన్ డాలీషా అందంగా ఉన్నారు. డిసెంబర్ 1న ఈ చిత్రం రాబోతోంది.పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. బొమ్మరిల్లు భాస్కర్ మాట్లాడుతూ.. ‘సుధీర్ చాలా మంచి మనిషి. డిసెంబర్ 1న ఈ చిత్రం రాబోతోంది. ఈ మూవీని సుధీర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా అందరూ విచ్చేసి చూడండి’ అని అన్నారు. నందినీ రెడ్డి మాట్లాడుతూ.. ‘అరుణ్ గారికి ఇది డెబ్యూ. మంచి కంటెంట్‌తో వచ్చే చిత్రాలకు విజయాలు దక్కుతున్నాయి. వేణు గారి బలగం, గెటప్ శ్రీను పొలిమేర 2 బ్లాక్ బస్టర్ అయ్యాయి. సుధీర్ గారు డిఫరెంట్ కంటెంట్ ఎంచుకుంటున్నారు. ఆయన సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు. అరుణ్ విక్కిరాల మాట్లాడుతూ.. ‘ఈవెంట్‌కు వచ్చిన గెస్టులకు థాంక్స్. నా డైరెక్షన్ టీం లేకుంటే ఈ సినిమా వచ్చేది కాదు. నా టెక్నికల్ టీం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. మా వదిన నాలో ఉన్న శక్తిని, బలాన్ని గుర్తించి నన్ను ఎదిగేలా, ఎగిరేలా చేశారు. మా వదిన నాకు తల్లిలాంటిది. జేడీ చక్రవర్తి అన్న వల్లే అమ్మ విలువ తెలుసుకున్నాను. మా నిర్మాత విజయ్ వల్లే ఈ సినిమా ఈ స్థాయిలో వచ్చింది.మా ఇంకో నిర్మాత చిరంజీవి గారు యూఎస్‌లో ఉంటారు. రాజశేఖర్ గారిదే షాడో మీడియా. ఆయన షాడోలో ఉండి టాలెంట్‌ను బయటకు తీసుకొస్తానని అంటారు.సుధీర్ గారు, డాలీషా నాకు చాలా ఇంపార్టెంట్ వ్యక్తులు. మొదట్లో సుధీర్ గారికి అనుమానం ఉండేది. కానీ ఆయన చేసిన ఫస్ట్ టేక్‌నే ఓకే చేశాను. ఆయన డెడికేషన్‌కు అభిమానిని అయ్యాను. రావణాసురుడిని సంహరించాకే రాముడు దేవుడయ్యాడు. సందర్భం వచ్చే వరకు ప్రతీ ఒక్కరూ సామాన్యులే. ఈ లైన్‌ను ఆధారం చేసుకునే ఈ మూవీని తీశాం. కెమెరామెన్ శశికిరణ్ గారు అద్భుతమైన విజువల్స్ అందించారు. డిసెంబర్ 1న ఈ చిత్రం రాబోతోంది. ప్రేక్షకులందరికీ ఈ సినిమా నచ్చుతుంది. ఈ సినిమా రిలీజ్ విషయంలో బెక్కెం వేణుగోపాల్ గారు చాలా సాయమందిస్తున్నారు. జేడీ అన్నకు ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే అవుతుంది. శివ బాలాజీ గారు ఇప్పుడు న్యూజిలాండ్‌లో కన్నప్ప షూట్‌లో ఉన్నారు. ఈ సినిమాకు ఆయన మెయిన్ పిల్లర్. ఈ సినిమాను అందరూ థియేటర్లో డిసెంబర్ 1న చూడండి’ అని అన్నారు. జేడీ చక్రవర్తి మాట్లాడుతూ.. ‘సుధీర్ చాలా మొహమాటస్తుడు. చాలా మంచి వ్యక్తి. అరుణ్ విక్కిరాల చాలా పర్‌ఫెక్షనిస్ట్. చాలా డెడికేటెడ్ పర్సన్. ఆల్రెడీ గ్లింప్స్‌లో డాలీషాను చూశాను అద్భుతంగా అనిపించింది. అరుణ్ పర్‌ఫెక్షన్‌కు అమ్మాయిలు ఉండరు. కానీ సినిమాలు ఉంటాయి (నవ్వుతూ). డిసెంబర్ 1న ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమాను అందరూ వీక్షించండ’ని అన్నారు. డాలీషా మాట్లాడుతూ.. ‘నాకు అవకాశం ఇచ్చిన నిర్మాత విజయ్, రాజశేఖర్, వెంకటేష్ సర్‌కు థాంక్స్. గెస్టులుగా వచ్చిన జేడీ గారికి థాంక్స్. ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మూడేళ్లుగా ఈ సినిమా కోసం పని చేస్తూనే ఉన్నాం. కరోనా వల్ల ఈ ప్రాజెక్ట్ లేట్ అవుతూ వచ్చింది. అయినా మా టీం అంతా ఎంతో పాజిటివిటీతో ఉన్నాం. బలగం వేణు మాట్లాడుతూ.. ‘మా సుధీర్ ఏం చేసినా కూడా అభిమానులు అండగా ఉంటారు. సపోర్ట్ చేస్తూనే ఉంటారు. మా సుధీర్‌ను అందరూ పొగిడేస్తున్నారు. దిష్టి తగులుతుంది. సుధీర్ చుట్టూ ఫుల్ పాజిటివిటీ ఉంటుంది. ఫస్ట్ సినిమాకు డైరెక్టర్ ఎంత టెన్షన్ పడతాడో నాకు. అరుణ్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టబోతోన్నాడు. మా సుధీర్ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు. విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘సుధీర్ గారి జర్నీ ఎందరికీ స్పూర్తినిచ్చేలా ఉంటుంది. ఇంతలా అభిమానాన్ని సంపాదించుకోవడం మామూలు విషయం కాదు. ఆ సహస్ర ఎవరో తెలుసుకోవాలని ఉంది. నేను కూడా డిసెంబర్ 1న సినిమాను చూస్తాను. ఈ సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.