నిహారిక కొణిదెల, వితిక షెరు చేతుల మీదుగా ప్రారంభమైన ‘నైరా సిల్క్’

Related image

మెగాడాటర్ నిహారిక, వితిక షెరు ఈ మధ్య ఎక్కువగా కలిసి కనిపిస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి జిమ్‌లో వర్కౌట్లు చేస్తుంటారు. అలా ఈ ఇద్దరూ జిమ్ మేట్స్, క్లోజ్ ఫ్రెండ్స్‌లా మారిపోయారు. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి కాంచీపురం వారి నైరా సిల్క్‌ను ప్రారంభించారు.

కాంచీపురం వారి నైరా సిల్క్‌ రెండో బ్రాంచ్‌ ప్రారంభోత్సవం గురువారం మాదాపూర్‌లో నిహారిక, వితిక షెరు చేతుల మీదుగా  జరిగింది. ఇక ఇక్కడ టాప్ డిజైనర్స్ చేసిన కంచి పట్టు చీరలు, ఒక గ్రాము జరీ, రెండు గ్రాముల జరీ చీరలు దొరుకుతాయి.

మొదటి బ్రాంచ్ కూకట్ పల్లిలో ఉంది. నేరుగా కాంచీపురం నుంచి కాకతీయ హిల్స్‌కు ఇప్పుడు కంచిపట్టు చీరలు వస్తున్నాయి. ఈ ప్రారంభోత్సవ వేడుకలో నిహారిక, వితిక షెరులు సందడి చేశారు.

Naira Silks
Niharika Konidela
Vithika Sheru
Hyderabad

More Press Releases