సద్దుల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న సి.ఎస్.శాంతి కుమారి

Related image

హైదరాబాద్, అక్టోబర్ 22 :: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు డా. బీఆర్ అంబేద్కర్తె లంగాణా సచివాలయం ఎదురుగాఉన్న తెలంగాణా అమరుల స్మారక కేంద్రం వద్ద నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకలకు హాజరై మహిళలతో కలసి బతుకమ్మ పండగలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రర్యటక శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, ఆర్థిక శాఖ కార్యదర్శి టీ.కె. శ్రీదేవి లు కూడా ఈ బతుకమ్మ వేడుకలకు హాజరయ్యారు. ముందుగా బతుకమ్మలను పూజలు నిర్వహించిన అనంతరం ఈ సద్దుల బతుకమ్మకు ఊరేంగింపు గా పెద్ద ఎత్తున వచ్చిన మహిళలతో కలసి సి.ఎస్. శాంతి కుమారి, కార్యదర్శులు శైలజ రామయ్యర్, శ్రీదేవి లు బతుకమ్మ ఆడారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలు, జీహెచ్ఎంసీ లు ఉమ్మడిగా ఈ బతుకమ్మ ఉత్సవాలకు ఏర్పాట్లు చేశాయి.
           


Saddula Bathukamma
CS Shanti Kumari
Telangana

More Press Releases