LG ఎలక్ట్రానిక్స్ ఇండియా యొక్క 'కరీన్ రోష్ని' కార్యక్రమం: దక్షిణ భారతదేశం కోసం 4000 శస్త్రచికిత్సలు ప్రణాళిక చేయబడ్డాయి

Related image

భారతదేశంలోని ఆరు స్వచ్ఛంద ఆసుపత్రులతో భాగస్వామ్యం చేసుకున్న , LG భారతదేశం అంతటా కంటిశుక్లం శస్త్రచికిత్సల ద్వారా 14,500 మందికి సహాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.


12 అక్టోబర్ 2023: ప్రపంచ దృష్టి దినోత్సవానికి ముందు, LG ఎలక్ట్రానిక్స్ ఇండియా తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) ప్రయత్నం "కరీన్ రోష్ని: లైట్ ఫర్ ఎవ్రీ సైట్," యొక్క తదుపరి దశను సగర్వంగా ప్రారంభించింది.   సమగ్ర కంటి సంరక్షణ మరియు శస్త్రచికిత్సల ద్వారా జీవితాలను మార్చే లక్ష్యంతో ప్రారంభించిన కార్యక్రమం "కరీన్ రోష్ని: లైట్ ఫర్ ఎవ్రీ సైట్," ఈ సంవత్సరం కార్యక్రమం , దాని ప్రభావాన్ని విస్తరించడానికి లక్ష్యం చేసుకుంది. భారతదేశం అంతటా మొత్తం 14,500 కంటిశుక్లం శస్త్రచికిత్సలకు మద్దతు ఇవ్వడానికి LG ఇండియా ఆరు కొత్త భాగస్వాములతో భాగస్వామ్యం చేసుకున్నందున  ప్రోగ్రామ్ యొక్క విస్తృతి గణనీయంగా పెరిగింది.


కరీన్ రోష్ని ( "KAREIN ROSHNI")  పతాకం  క్రింద, LG ఇండియా తమిళనాడులోని కోయంబత్తూర్‌లోని గౌరవనీయమైన ఆసుపత్రి అయిన శంకర ఐ ఫౌండేషన్ (శ్రీ కంచి కామకోటి మెడికల్ ట్రస్ట్ యొక్క యూనిట్)తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంది, తద్వారా కంటి సంరక్షణ సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో మరియు నివారించగల అంధత్వం తొలగించడంలో దాని నిబద్ధతను పటిష్టం చేసింది. ఈ తరహా  భాగస్వామ్యాలు  ద్వారా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 4000 శస్త్రచికిత్సలు జరుగుతాయని అంచనా వేయబడింది.


ఇంకా, ఈ కార్యక్రమం కంటి సంరక్షణ గురించి సమగ్ర అవగాహన ప్రచారాన్ని కలిగి ఉంటుంది, ఇది వ్యక్తులకు తమ  దృశ్య ఆరోగ్యానికి బాధ్యత వహించేలా అవగాహన కల్పిస్తుంది మరియు వారికి తగిన అధికారం ఇస్తుంది. కంటి సంరక్షణ అవగాహనను ప్రోత్సహించడం ద్వారా, LG నివారించదగిన అంధత్వాన్ని నివారించడానికి మరియు భారతదేశం అంతటా అసంఖ్యాకంగా వ్యక్తుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ప్రయత్నిస్తుంది.


ఈ కార్యక్రమం పై , LG ఎలక్ట్రానిక్స్ ఇండియా, ఎండి , హొంగ్ జూ జెన్ మాట్లాడుతూ, "LG  వద్ద , మా నిబద్ధత ఆవిష్కరణలకు మించినది - ఇది జీవితాలను ప్రకాశవంతం చేయడం గురించి  ఉంటుంది . మా ప్రతిష్టాత్మక కార్యక్రమం కరీన్ రోష్ని కి లభించిన అద్భుతమైన ప్రతిస్పందనపై ఆధారపడి  మేము దీనిని మరింత భారీ స్థాయికి తీసుకు వెళ్ళడానికి  మేము సంతోషిస్తున్నాము. ఈ కార్యక్రమంతో, మేము కేవలం దృష్టి ని అందించటం మాత్రమే కాకుండా, తక్కువ ప్రాధాన్యత కలిగిన సమాజానికి అవగాహన, ఎంపికలు మరియు అవకాశాలను కూడా అందిస్తున్నాము. గత 25 సంవత్సరాలుగా , మేము నిరంతరం జీవితాలను మెరుగు పరుస్తున్నాము మరియు మా “కరీన్ రోష్ని- లైట్ ఫర్ ఎవ్రీ సైట్” CSR కార్యక్రమం  ఆ మార్గంలో మరో ముందడుగు. ఈ ఉదాత్తమైన పనిలో మాతో చేరినందుకు మా భాగస్వామ్య  ఆసుపత్రులకు మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము." అని అన్నారు


కరీన్ రోష్ని LG ఇండియా యొక్క ప్రతిష్టాత్మక CSR ప్రాజెక్ట్‌లలో ఒకటి. ఈ కార్యక్రమం కింద, ఈ సంవత్సరం LG ఇండియా 6 చారిటబుల్  ఆసుపత్రుల ద్వారా భారతదేశ వ్యాప్తంగా  14,500 కంటిశుక్లం శస్త్రచికిత్సలకు మద్దతునిస్తామని  ప్రతిజ్ఞ చేసింది. LG ఎలక్ట్రానిక్స్ ఇండియా "కరీన్ రోష్ని: లైట్ ఫర్ ఎవ్రీ సైట్" వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా సామాజిక బాధ్యతను ఉన్నతంగా  కొనసాగిస్తున్నందున, అందరికీ ప్రకాశవంతమైన, మరింత కలుపుకొని మరియు ఆరోగ్యకరమైన భవిష్యత్తును సృష్టించేందుకు కంపెనీ తన అంకితభావాన్ని పునరుద్ఘాటించనుంది.

More Press Releases