50వ వసంతంలోకి అడుగుపెడుతున్న రాజమౌళి: ఐఎండీబీలో జక్కన్న టాప్ 10 చిత్రాలు ఇవే

Related image

2001లో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెం.1 సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి  దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అనతికాలంలోనే మగధీర, ఈగ, బాహుబలి: ది బిగినింగ్ వంటి బాక్సాఫీస్ మైలురాళ్లతో పాన్ ఇండియా స్థాయిలో గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాకుండా 2016లో రాజమౌళి కళారంగానికి చేసిన సేవలకుగాను భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. మహేష్ బాబు కథానాయకుడిగా  తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా పౌరాణిక చిత్రం 'ఎస్ ఎస్ ఎంబీ29' తో మరోసారి జక్కన్న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 



ఐఎండీబీలో రాజమౌళి టాప్ 10  సినిమాలు 

1)  బాహుబలి 2: ది కంక్లూజన్ - 8.2 

2)  బాహుబలి: ది బిగినింగ్ - 8.0 

3)  ఆర్ఆర్ఆర్ - 7.8 

4)  ఈగ - 7.7 

5)  విక్రమార్కుడు - 7.7 

6)  మగధీర - 7.7 

7)  ఛత్రపతి - 7.6 

8)  మర్యాద రామన్న - 7.4 

9)  ఛాలెంజ్ - 7.4 

10)  సింహాద్రి - 7.3 

More Press Releases