కార్బొనేటెడ్ పానీయాల విభాగంలో 100% రీసైకిల్ PET బాటిళ్లను ప్రారంభించిన కోకా - కోలా ఇండియా
వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడానికి ఒక ప్రధాన అడుగు వేస్తూ, కోకా-కోలా® భారతదేశంలోని అనేక మార్కెట్లలో 250 ml మరియు 750 ml ప్యాక్ పరిమాణాలలో rPETలో ప్రారంభించింది.
న్యూదిల్లీ, 8 అక్టోబర్ 2023: ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ బ్రాండ్ కిన్లీ కి సంబంధించి 100% రీసైకిల్డ్ పీఈటీ (ఆర్‌పీఈటీ)తో తయారు చేసిన ఒక లీటర్ బాటిల్‌ను విడుదల చేసి ఈ విషయంలో భారతదేశంలో మొట్టమొదటి కంపెనీగా అవతరించిన కోకా-కోలా ఇండియా వృత్తాకార ఆర్థిక వ్యవస్థ దిశగా మరో అర్ధవంతమైన అడుగు వేస్తోంది. 250 ml మరియు 750 ml ప్యాక్ పరిమాణాలలో rPETలో కోకా-కోలా ®ను ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ rPET బాటిళ్లను కోకా-కోలా బాట్లింగ్ భాగస్వాములైన మూన్ బెవరేజెస్ లిమిటెడ్, SLMG బెవరేజెస్ లిమిటెడ్ తయారు చేస్తున్నాయి.
rPET బాటిళ్ల విస్తరణ అందరి కోసం సుస్థిరదాయకమైన, పచ్చని భవిష్యత్తును నిర్మించే దిశగా కోకా-కోలా ఇండియా పరివర్తనాత్మక ప్రయాణాన్ని ప్రదర్శిస్తుంది. 100% ఫుడ్-గ్రేడ్ rPET (క్యాప్‌లు మరియు లేబుల్ లను మినహాయించి)తో తయారు చేసిన బాటిల్స్‌కు ఆన్-ప్యాక్ కాల్ టు యాక్షన్ “నన్ను మళ్లీ రీసైకిల్ చేయండి” సందేశం, ప్యాక్‌పై ప్రదర్శించబడే "100% రీసైకిల్ PET బాటిల్"తో వినియోగదారుల అవగాహన ను కూడా పెంచుతుంది.
మూన్ బెవరేజెస్ లిమిటెడ్ (MMG గ్రూప్‌లో భాగం) చైర్మన్ సంజీవ్ అగర్వాల్ rPET ఆవిష్కరణను ప్రశం సించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘PET ప్లాస్టిక్ బాటిల్స్ వాటి మొదటి జీవితాన్ని మించిన విలువను కలిగి ఉన్నాయి. ఫుడ్-గ్రేడ్ rPETతో తయారు చేయబడిన మా కొత్త బాటిల్స్ రీసైకిల్ చేయదగినవి, దీన్ని మరొక బాటిల్‌గా మారవచ్చు. రీసైకిల్ PET భారతదేశం ప్లాస్టిక్ సర్క్యులారిటీని స్వీకరించడానికి సరైన దిశలో ఒక పెద్ద ముందడుగు’’ అని అన్నారు.
ఈ rPET బాటిల్స్ ఫుడ్-గ్రేడ్ రీసైకిల్డ్ పాలిథిలిన్ టెరెఫ్తాలేట్ (PET) నుండి రూపొందించబడ్డాయి. ఫుడ్-గ్రేడ్ రీసైకిల్ మెటీరియల్ కోసం యూఎస్ ఎఫ్ డిఎ, యూరోపియన్ ఫుడ్ సేఫ్టీ అథారిటీ (EFSA) ఆమోదించిన సాంకేతికతల ప్రకారం ప్లాస్టిక్ రీసైకిల్ చేయబడుతుంది మరియు PET బాటిళ్లను ఉత్పత్తి చేయడానికి వర్జిన్ ప్లాస్టిక్ అవసరాన్ని తగ్గిస్తుంది.
rPETలో Coca-Cola®ని ప్రారంభించడంపై, SLMG బేవరేజెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పరితోశ్ లధాని మాట్లాడుతూ, ‘‘మేం భారతదేశంలో కోకా-కోలా మొదటి బాటిల్‌ను ఉత్పత్తి చేశాం. rPET వేరియంట్‌ను ఉ త్పత్తి చేసిన మొదటి బాటిలర్స్ లో ఒకటిగా ఉన్నందుకు గర్విస్తున్నాం. మేం సుస్థిరతకు కట్టుబడి ఉ న్నాం. SLMG అర్ధవంతమైన మార్పును ముందుకు తీసుకెళ్లేందుకు,సుస్థిరమైన భవిష్యత్తును నిర్మించ డానికి ఉత్సాహంగా ఉంది’’ అని అన్నారు.
కోకా కోలా కంపెనీ ఇప్పుడు 40కి పైగా మార్కెట్‌లలో 100% rPET బాటిళ్లను అందిస్తోంది. ఇది 2030 నాటికి 50% రీసైకిల్ కంటెంట్‌తో బాటిళ్లను తయారు చేయాలనే ‘వరల్డ్ వితవుట్ వేస్ట్’ అనే తన లక్ష్యానికి కంపెనీని చేరువ చేస్తుంది. 2018లో ప్రకటించబడిన సుస్థిరదాయక ప్యాకేజింగ్ ప్లాట్‌ఫామ్ అనేది 2030 నాటికి కంపెనీ ప్రపంచవ్యాప్తంగా విక్రయించే ప్రతి ఒక్కదానికీ సమానమైన బాటిల్ లేదా డబ్బాను రీసైకిల్ చేయడం, 2025 నాటికి తన ప్యాకేజింగ్‌లో 100% రీసైకిల్ అయ్యేలా చేయడాన్ని కూడా కలిగి ఉంది.
కోకా-కోలా ఇండియా, సౌత్ వెస్ట్ ఏషియా టెక్నికల్ అండ్ ఇన్నోవేషన్ వైస్ ప్రెసిడెంట్ ఎన్రిక్ అకెర్‌మాన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘వ్యర్థాలు, కార్బన్ ఉద్గారాలను తగ్గించడానికి మేం మా ప్యాకేజింగ్ కు సంబం ధించి వృత్తాకార ఆర్థిక వ్యవస్థను నడపాలని కోరుకుంటున్నాం. మేం రీసైకిల్ కంటెంట్‌ను పెంచడా నికి కృషి చేస్తున్నాం. మా వరల్డ్ వితౌట్ వేస్ట్ ఇనిషియేటివ్ ద్వారా మా ప్యాకేజింగ్, రీఫిల్ చేయగల బాటిళ్ల విని యోగాన్ని విస్తరించడం, రీసైక్లింగ్ కోసం ప్యాకేజింగ్‌ను సేకరించడంపౌ పని చేస్తున్నాం. మేం ప్యాకేజింగ్ కో సం కొత్త పరిష్కారాల కోసం కూడా పరిశోధన చేస్తాం. మూన్ బెవరేజెస్, SLMG బెవరేజెస్ ద్వారా ఈ విస్త రణ సుస్థిరదాయకత కోకా-కోలా ఇండియా పట్ల స్థిరమైన నిబద్ధతను, మరింత సుస్థిరదాయకమైన భవి ష్యత్తును రూపొందించడానికి తనకు గల అంకితభావాన్ని నొక్కి చెబుతుంది’’ అని అన్నారు.
ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ఫుడ్ ప్యాకేజింగ్‌లో రీసైకిల్ చేసిన PET వినియోగాన్ని ఆమో దించింది. అదేవిధంగా, భారత ప్రభుత్వం, పర్యావరణం, అటవీ, శీతోష్ణస్థితి మార్పుల మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఆహార, పానీయాల ప్యాకేజింగ్‌లో రీసైకిల్ చేయబడిన ప్లాస్టిక్‌ల విని యోగాన్ని సులభతరం చేయడానికి తగిన నిబంధనలు, ప్రమాణాలను ప్రారంభించాయి.
కోక-కోలా వినియోగదారులు తమ ఖాళీ PET బాటిళ్లను సౌకర్యవంతంగా ఉంచిన డ్రాప్-ఆఫ్ పాయింట్‌ల వద్ద లేదా రివర్స్ వెండింగ్ మెషీన్‌ల (RVMలు) వద్ద రీసైక్లింగ్ కు ఇచ్చే సౌలభ్యం కల్పిస్తోంది. ఈ సంవత్స రం ప్రారంభంలో వినియోగదారుల నుండి నేరుగా PET బాటిళ్లను సేకరించడంపై దృష్టి సారిస్తూ, జెప్టోతో 'రిటర్న్ అండ్ రీసైకిల్' కార్యక్రమాన్ని కోకా-కోలా ఇండియా ప్రారంభించింది. ఇది 100% ట్రేసబిలిటీతో PET బాటిళ్లను సేకరించే వ్యవస్థీకృత ప్రక్రియను ఏర్పాటు చేయడంలో కూడా సహాయపడుతుంది. భారతదేశం కోసం ప్రత్యేకంగా, కోకా-కోలా 250 ml PET బాటిల్ కోసం ASSP (ఆఫర్డబుల్ స్మాల్ స్పార్క్లింగ్ ప్యాక్)ని పరిచయం చేసింది. స్పార్క్లింగ్ ఉత్పత్తులకు సంబంధించి PET బాటిల్స్ ఉత్పత్తిలో ప్లాస్టిక్ వినియోగాన్ని 40 శాతం వరకు తగ్గించడానికి ASSP అనేది కోకా-కోలా ప్రొప్రైటరీ వినూత్న సాంకేతికత ఉపయోగించబడు తుంది.
2022 డిసెంబర్ లో కోకా-కోలా బంగ్లాదేశ్ 100% rPET బాటిళ్లను విడుదల చేసింది. ఇది నైరుతి ఆసియాలో (SWA) ఒక-లీటర్ ప్యాకేజీలలో కిన్లీ వాటర్ బాటిళ్లను ప్రవేశపెట్టిన మొదటి మార్కెట్‌గా నిలిచింది