చేనేత ప్రదర్శనలు జిల్లాస్థాయిలో ఏర్పాటు: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

Related image

చేనేత ప్రదర్శనలు జిల్లాస్థాయిలో ఏర్పాటు: రాష్ట్ర చేనేత, జౌళి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి

చేనేత ప్రదర్శనలు జిల్లాస్థాయిలో ఏర్పాటు చేసి వినియోగదారులను ఆకర్షించినప్పుడే కార్మికులకు మరింత మేలు చేకూరుతుందని ఏపీ రాష్ట్ర చేనేత, జౌళి, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నారు. జనాభాలో గణనీయమైన శాతం కలిగిన చేనేతలకు తగిన ఉపాధిని చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్ మెంట్ సంస్థ ఆవరణలో ఏర్పాటుచేసిన జాతీయ చేనేత ప్రదర్శన - 2020ను మంత్రి మేకపాటి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తప్పనిసరిగా చేనేత వస్త్రాలను ధరించినప్పుడే చేనేత కార్మికులందరికీ ఉపాధి లభిస్తుందని వివరించారు. ప్రస్తుతం చేనేత వస్త్రాలు ఈ కామర్స్ విపణిలో సైతం అందుబాటులో ఉన్నాయని, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలతో చేనేత జోలి శాఖ ఒప్పందం తీసుకుందని వివరించారు. ప్రస్తుత ప్రదర్శన ప్రారంభం అయిన తొలిరోజే విజయవాడ నగర వాసుల నుండి మంచి స్పందన లభించడం ముదావహం అన్నారు. చేనేత జోలి శాఖ సంచాలకులు హిమాంషు శుక్లా మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా గుర్తింపు గడించిన హస్త కళలను ఈ ప్రదర్శన ద్వారా నగరవాసులకు అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు.

విక్రయదారులు మంచి రాయితీని కూడా అందిస్తున్నారని దానిని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ సాధారణంగా విభిన్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడి ప్రత్యేకతలను తెలుసుకొని ఆయా ప్రాంతాలను సందర్శిస్తూ ఉంటామని, కానీ ఇక్కడ దేశములోని అన్ని ప్రాంతాల వస్త్రసంపద అందుబాటులో ఉండటం ప్రత్యేకతను సంతరించుకుందని వివరించారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళి శాఖ ఉప సంచాలకులు నాగేశ్వరరావు, శ్రీకాంత్ ప్రభాకర్, వీవర్స్ సర్వీస్ సెంటర్ నుండి జోగారావ్, జిఎం రమేష్, లేపాక్షి జిఎం లక్ష్మినాథ్ తదితరులు పాల్గొన్నారు.

Mekapati Goutham Reddy
YSRCP
Andhra Pradesh

More Press Releases