మానసిక ఆరోగ్యతోనే ఊల్లాసమైన జీవితం

Related image

డా.చరణ్ తేజ కోగంటి

కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్

కిమ్స్ హాస్పిటల్స్, కొండాపూర్.

 
ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తారు. వరల్డ్ ఫౌండేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ సెట్ చేసిన 2023 థీమ్, 'మానసిక ఆరోగ్యం సార్వత్రిక మానవ హక్కు'. మళ్ళీ చదవండి! ఇందులో మానసిక ఆరోగ్య ప్రమాదాల నుండి రక్షించబడే హక్కు, అందుబాటులో ఉండే, ఆమోదయోగ్యమైన మరియు మంచి నాణ్యమైన సంరక్షణ హక్కు మరియు సమాజంలో స్వేచ్ఛ, స్వాతంత్ర్యం మరియు చేర్చుకునే హక్కు ఉన్నాయి.

 
ప్రపంచవ్యాప్తంగా 26.4 కోట్లమంది డిప్రెషన్ తో బాధపడుతున్నారు. ఇక యాంగ్జయిటీ డిజార్డర్ల గురించయితే చెప్పనక్కర్లేదు. మానసిక సమస్యలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. అయితే ఇప్పటికీ మన సమాజంలో శారీరక అనారోగ్యాల పట్ల ఉన్నంత అవగాహన, శ్రద్ధ మానసిక అనారోగ్యాల పట్ల ఉండటం లేదు. మెంటల్ హెల్త్ విషయంలో ఎన్నో రకాల అపోహలు మన చుట్టూ ఉన్నాయి. అలాంటి కొన్ని అపోహలను, వాటివెనక ఉన్న వాస్తవాలను గురించి తెలుసుకుందాం.

చాలామంది... మానసిక సమస్యలు మానసికంగా బలహీనంగా ఉన్నవారికే వస్తాయని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. మానసిక శక్తికి మానసిక అనారోగ్యాలకు సంబంధం లేదు. జన్యుపరమైన కారణాలు, పుట్టిపెరిగిన వాతావరణం, జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలు... ఇలా పలురకాల అంశాలు మానసిక సమస్యలకు దారితీస్తాయి. 

 
చిన్నపిల్లల్లో, యువతలో మానసిక సమస్యలు ఉండవనే అభిప్రాయం కూడా చాలామందిలో ఉంటుంది. కానీ ఇది కూడా అపోహే... నిజం కాదు. వయసుతో సంబంధం లేకుండా ఎవరిలో అయినా మానసిక సమస్యలు వచ్చే అవకాశం వస్తుంటాయని కొంతమంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. మానసిక సమస్యలకు ఆధ్యాత్మిక నమ్మకాలకు సంబంధం లేదు. అలాగే విల్ పవర్ లేకపోవటం వలన మానసిక అనారోగ్యాలు వస్తాయనటంలో కూడా నిజం లేదు. పలురకాల వైద్యపరమైన సంక్లిష్టమైన అంశాలు మానసిక సమస్యలకు కారణమవుతుంటాయి.

 
అసలు మానసిక అనారోగ్యాలకు చికిత్సే లేదని, వాటికి గురయినవారు జీవితాంతం వాటిని భరిస్తూనే ఉండాలనే అపోహ కూడా చాలామందిలో ఉంటోంది. కానీ ఇది నిజం కాదు. మానసిక సమస్యలకు తప్పకుండా చక్కని చికిత్సలున్నాయి. సరైన చికిత్స, శ్రద్ధ, అండదండలు ఉంటే మానసిక అనారోగ్యాలనుండి బయటపడటం లేదా వాటిని నియంత్రణలో ఉంచుకుంటూ సాధారణ జీవితాన్ని గడపటం సాధ్యమవుతుంది.  

More Press Releases