ఇర్వింగ్ TX లోని మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వద్ద గాంధీజీ జన్మదిన వేడుకలు

Related image

డాలస్, టెక్సాస్ (అక్టోబర్ 2): డాలస్ (అర్వింగ్) నగరంలో నెలకొనిఉన్న అమెరికాదేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ స్మారకస్థలి వద్ద మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ అధ్వర్యంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలకు జాతిపిత మహాత్మాగాంధీకి వందలాది మంది ప్రవాస భారతీయులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని పుష్పాంజలి ఘటించారు.

మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సాస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర ముఖ్యఅతిథిగా హాజరైన కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా (హుస్టన్) శ్రీ డి.సి మంజునాథ్ మరియ విశిష్టఅతిథిగా హాజరైన ఎన్నో సంవత్సరాలుగా సామజికసేవ చేస్తున్న వాషింగ్టన్ డి.సి నివాసి ఐన రవి పులి కి ఆహ్వానం పలికారు. అహింస, సత్యాగ్రహమే ఆయుధాలుగా మహాత్మాగాంధీ భరతమాత దాస్య శృంఖలాలను విడిపించడంలో తన జీవితాన్నే త్యాగం చేశారని డా. తోటకూర అన్నారు.

కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా (హుస్టన్) శ్రీ డి.సి మంజునాథ్ ముఖ్య అతిథిగా హాజరై స్వాతంత్ర్య సముపార్జనలో గాంధీజీ కృషిని కొనియాడారు. అమెరికా – భారతదేశాల మధ్య ప్రస్తుత సంబంధాలు చాలా బలంగా ఉన్నాయన్నారు. కోవిడ్ విపత్కర పరిస్థితులలో అమెరికాలో చిక్కుకున్న భారతీయులను వెనక్కి త్రిప్పిపంపడంలో రవి ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన తీరు, చేసిన సేవ వెలకట్టలేనివని ప్రశంసిస్తూ కాన్సల్ జెనరల్ మంజునాథ్ రవి పులిని సన్మానించారు. ఈ వేడుకలలో పాల్గొన్న అతిథులు శాంతికి సంకేతంగా తెల్లటి పావురాలను పిల్లల కేరింతల మధ్య ఆకాశంలోకి వదిలారు. తెల్లటి దుస్తులు ధరించిన పిల్లలు, యువతీ యువకులు, పెద్దలు ‘గాంధీ శాంతియాత్రలో’ ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యులు రావు కల్వల, మురళి వెన్నం, దినేష్ హూడా, కమల్ కౌశిక్, షబ్నం మొద్గిల్, శైలేష్ షా, ఉర్మిత్ సింగ్, సుష్మా మల్హోత్రా మొదలైన నాయకులు పాల్గొన్నారు.

Dallas
USA
Mahatma Gandhi Memorial Plaza
Irving TX
NRI
Prasad Thotakura

More Press Releases