వైద్యుల‌కు ఏబీసీలు చాలా ముఖ్యం

Related image

* యాటిట్యూడ్, బిహేవియ‌ర్, క‌మ్యూనికేష‌న్ ఉండాల్సిందే

* మ‌నం ఎన్ని అద్భుతాలు చేసినా రోగుల‌కు చెప్ప‌డం అవ‌స‌రం

* కిమ్స్ ఆస్ప‌త్రిలో నాట్స్ కోర్సును ప్రారంభించిన గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్‌

* ఎడిన్‌బ‌రోలోని రాయ‌ల్ కాలేజి ఆఫ్ స‌ర్జ‌న్స్ నేతృత్వంలో స‌రికొత్త కోర్సు

* శ‌స్త్రచికిత్స ఫ‌లితాలు బాగుండాలంటే సాంకేతిక నైపుణ్యం ఒక్క‌టే చాల‌దు

* త్వ‌ర‌లో దేశ‌వ్యాప్తంగా నాట్స్ మాస్ట‌ర్ క్లాసుల నిర్వ‌హ‌ణ‌

 

హైద‌రాబాద్, సెప్టెంబ‌ర్ 17, 2023: ద రాయ‌ల్ కాలేజి ఆఫ్ స‌ర్జ‌న్స్ ఆఫ్ ఎడిన్‌బ‌రో వారు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న మొట్ట‌మొద‌టి నాన్ టెక్నిక‌ల్ స్కిల్స్ కోర్స్ (నాట్స్)ను తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై సౌంద‌ర‌రాజ‌న్ ఆదివారం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్ప‌త్రిలో ప్రారంభించారు. ద రాయ‌ల్ కాలేజి ఆఫ్ స‌ర్జ‌న్స్ ఆఫ్ ఎడిన్‌బ‌రో అనేది ప్ర‌పంచంలోనే అత్యంత పాత స‌ర్జిక‌ల్ కాలేజి. ఇది ద అసోసియేష‌న్ ఆఫ్ స‌ర్జ‌న్స్ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ)తో భాగ‌స్వామ్యంతో ఈ కార్య‌క్ర‌మాన్ని సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్ప‌త్రిలో నిర్వ‌హిస్తోంది. ఏఎస్ఐ ఆసియా ప‌సిఫిక్ ప్రాంతంలో అతి పెద్ద‌, ప్ర‌పంచంలోనే రెండో అతిపెద్ద స‌ర్జిక‌ల్ అసోసియేష‌న్.

ఈ అద్భుత‌మైన ఒక రోజు కోర్సు తీసుకునేందుకు దేశ‌వ్యాప్తంగా ప‌లు ప్రాంతాల నుంచి వ‌చ్చిన దాదాపు 250 మందికి పైగా స‌ర్జ‌న్లు, స‌ర్జిక‌ల్ ట్రైనీల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై మాట్లాడుతూ, ముందుగా ఏఎస్ఐ అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ ర‌ఘురామ్‌ను మ‌న‌స్ఫూర్తిగా అభినందించారు. “ప్ర‌ధాన‌మంత్రి మోదీ పుట్టిన‌రోజు, తెలంగాణ విమోచ‌న దినం, ఇక్క‌డ కిమ్స్ ఆస్ప‌త్రిలో స‌ర్జ‌న్ల‌కు ఎంతో ఉప‌యుక్త‌మైన కంటిన్యువస్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ (సీఎంఈ) కార్య‌క్ర‌మం ఉన్నాయి. ఈరోజు అంతా బిజీగా గ‌డిచింది. అయినా డాక్ట‌ర్ ర‌ఘురామ్ నాకు ఫోన్ చేసి ఈ విష‌యం చెప్పారు. నాకు ఎంత హ‌డావుడిగా ఉన్నా, ఈ కార్య‌క్ర‌మం నా మ‌న‌సుకు బాగా ద‌గ్గ‌ర‌ది కావ‌డంతో కాద‌న‌లేక‌పోయాను. ఇక్క‌డ‌కు రావ‌డం నా బాధ్య‌త అనుకున్నాను. కిమ్స్ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ భాస్క‌ర‌రావు అంటే నాకు ఎంతో ఆరాధ‌నాభావం ఉంటుంది. కిమ్స్ లోగో కూడా చాలా సందేశాత్మ‌కంగా ఉంటుంది. ఎప్పుడు చూసినా ఇది ఎంతో బాగుంటుంది. సంతోషంతో ముందుకు దూకుతున్న‌ట్లు ఇది క‌నిపిస్తుంది. ఆర్‌సీఎస్ ఎడ్‌కు ఒక మ‌హిళ నేతృత్వం వ‌హిస్తుండ‌టం ఎంతో సంతోషంగా ఉంది. అందుకు ఆమెను అభినందించ‌డంతో పాటు, మ‌రింత‌మంది మ‌హిళ‌లు భ‌విష్య‌త్తులో ముందుకు రావాల‌ని ఆశిస్తున్నాను. డాక్ట‌ర్ ర‌ఘురామ్ నిబ‌ద్ధ‌త చాలా బాగుంటుంది. బ్రెస్ట్ కేన్సర్ అవ‌గాహ‌న గురించి ఒక‌సారి ఆయ‌న నా వ‌ద్ద‌కు వ‌చ్చారు. రాజ్‌భ‌వ‌న్‌ను గులాబి రంగు లైట్ల‌తో వెలిగించాల‌ని ఆయ‌న కోరారు. ఒక డాక్ట‌ర్‌గా నేను అర్థం చేసుకుని, వెంట‌నే ఆ ప‌ని చేశాను. దేశంలో ఇలా గులాబిరంగుతో అలంక‌రించిన ఏకైక రాజ్‌భ‌వ‌న్ మ‌న‌దే. ఇది కేవ‌లం కేన్స‌ర్ అవ‌గాహ‌న కోస‌మే చేశాము. కేవ‌లం స‌ర్జ‌న్లు మాత్ర‌మే కాక‌.. థియేట‌ర్లో ఉండే అంద‌రికీ మ‌నం చేసే అంశాల‌పై అవ‌గాహ‌న ఉండాల‌ని, అందుకే ఈ కార్య‌క్ర‌మం పెట్టామ‌ని డాక్ట‌ర్ భాస్క‌ర‌రావు చెప్పారు. నేను గ‌తంలో రామ‌చంద్ర మెడిక‌ల్ కాలేజిలో పనిచేసేట‌ప్పుడు.. ఒక వీఐపీ చేరారు. ఆయ‌న విష‌యం ఏదీ బ‌య‌ట‌కు పొక్క‌కూడ‌ద‌ని చాలా ర‌హ‌స్యంగా ఉంచారు. అక్క‌డ అంద‌రూ దాన్ని చాలా జాగ్ర‌త్త‌గా కాపాడారు. కానీ, దుర‌దృష్ట‌వ‌శాత్తు అక్క‌డ చేసిన ప్రొసీజ‌ర్ అంతా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అక్క‌డ నేల తుడిచే వ్య‌క్తి డ‌స్ట్ బిన్‌లో ఉన్న వ‌స్తువుల‌న్నీ చూసి, దాన్ని బ‌ట్టి ఏం చేశారో అంచ‌నా వేసుకుని చెప్పేసింది. యాటిట్యూడ్, బిహేవియ‌ర్, క‌మ్యూనికేష‌న్.. ఏబీసీ.. ఈ మూడూ చాలా ముఖ్యం. ఒక‌సారి ఎమ‌ర్జెన్సీలో ఒక వ్య‌క్తి గుండెపోటుతో వ‌చ్చారు. ఆయ‌న‌కు చికిత్స చేసి, ప్రాణాలు కాపాడాము. మ‌ర్నాటి ఉద‌యం ఆస్ప‌త్రి సూప‌రింటెండెంట్‌తో క‌లిసి రౌండ్స్‌కు వెళ్లిన‌ప్పుడు ఎలా ఉంద‌ని అడిగితే, ఆయ‌న ఏమాత్రం సంతృప్తి లేద‌న్నారు. ఎందుకని అడిగితే.. ఉద‌యం నుంచి తాను మోష‌న్‌కు వెళ్ల‌లేద‌ని, ఎందుకిలా జ‌రుగుతోంద‌ని అన్నారు. ప్రాణాలు కాపాడార‌న్న విష‌యం వ‌దిలేసి, ఉద‌యం మోష‌న్ కాలేద‌నే బాధ‌ప‌డుతున్నాడు. రాత్రంతా డాక్ట‌ర్లు నిద్ర‌పోకుండా అత‌డిని కాపాడినా.. ఆ విష‌యం అత‌డికి తెలియ‌లేదు. ఇలాంటి శిక్ష‌ణ ద్వారా క‌మ్యూనికేష‌న్ నైపుణ్యాలు కూడా వైద్యుల‌కు మెరుగ‌వుతాయి.

నేను ప్రాక్టీసు లేక రాజ‌కీయాల్లోకి రాలేదు. గైన‌కాల‌జీతో పాటు ఫీట‌ల్ థెర‌పీలో కూడా శిక్ష‌ణ పొందాను. దేశంలోనే ఆ శిక్ష‌ణ పొందిన రెండో డాక్ట‌ర్‌ని నేను. నాకు రెండు క్లినిక్‌లు ఉండేవి, 10 ఆస్ప‌త్రుల‌కు క‌న్స‌ల్టెంట్‌గా వెళ్లేదాన్ని. రాత్రి ఒంటిగంట‌కు క్లినిక్ మూసేదాన్ని. కానీ రాజ‌కీయాల‌పై ఆస‌క్తి ఉండ‌టంతో ఫిజిషియ‌న్ నుంచి పొలిటీషియ‌న్ అయ్యాను. మ‌నం సాంకేతికంగా చాలా అద్భుతాలు సృష్టించినా, దాన్ని రోగికి స‌రిగా అర్థ‌మ‌య్యేలా చెప్ప‌లేక‌పోతే ప్ర‌యోజ‌నం ఉండ‌దు. మా భ‌ర్త నెఫ్రాల‌జిస్టు. ఆయ‌న రోగుల‌తో చాలా వివ‌రంగా మాట్లాడ‌తారు. నెఫ్రాల‌జిస్టులు పిల్ల‌ల పుట్టిన‌రోజులు, త‌మ పెళ్లిరోజులు కూడా వ‌దిలేస్తారు గానీ.. కిడ్నీ మార్చిన త‌ర్వాత రోగి నుంచి వ‌చ్చే మొద‌టి మూత్రం చుక్క చూసి ఎంతో ఆనంద‌ప‌డ‌తారు.

మ‌నం ఏం చేసినా పేషెంట్ల కోస‌మే అవుతుంది. గ‌వ‌ర్న‌ర్‌గా నేను ప్ర‌జ‌ల కోసం చేస్తాను. వాళ్లు సంతృప్తి చెంద‌క‌పోతే మ‌నం చేసిన ప‌నికి ఫ‌లితం ఉండ‌దు. విదేశాల నుంచి, దేశంలో క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు అన్నిచోట్ల నుంచి వ‌చ్చి ఇందులో పాల్గొన్నారు. కిమ్స్ ఆస్ప‌త్రి ఎప్పుడూ వైద్య అవ‌గాహ‌న విష‌యంలో ముందంజ‌లో ఉంటుంది. డాక్ట‌ర్ ర‌ఘురామ్‌ని, ఏఎస్ఐని కూడా ఈ విష‌యంలో చాలా అభినందించాలి. దీనివ‌ల్ల స‌ర్జ‌న్ల‌తో పాటు రోగుల‌కు, దేశానికి కూడా ఎంత‌గానో ప్ర‌యోజ‌నం ఉంటుంది. ఈ ప్రతిష్టాత్మక కోర్సును తెలంగాణలో నిర్వహించినందుకు మిస్ క్లేర్ మెక్ నాట్, యూకేకు చెందిన ఇత‌ర అధ్యాపకులను అభినందిస్తున్నాను” అని త‌మిళిసై చెప్పారు.

ఈ సంద‌ర్భంగా కిమ్స్ ఆస్ప‌త్రి ఛైర్మ‌న్, మేనేజింగ్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ బి.భాస్క‌ర‌రావు మాట్లాడుతూ, “భారతదేశం నలుమూలల నుంచి వచ్చిన సర్జన్లను నేను సాదరంగా స్వాగతిస్తున్నాను. కిమ్స్ ఆస్ప‌త్రిలోనే మొట్ట‌మొదటి నాట్స్ పరిచయ కోర్సును నిర్వహించడం మాకు గర్వంగా ఉంది. కిమ్స్ ఆస్ప‌త్రిని ఆర్‌సీఎస్ ఎడ్ ప్రపంచపటంలో ఉంచినందుకు డాక్టర్ రఘురామ్ కు అభినందనలు, ధన్యవాదాలు. కిమ్స్ ఆస్ప‌త్రిలో ఆయ‌న ఆర్‌సీఎస్ ఎడ్  తరఫున దశాబ్ద కాలంగా కోర్సులు నిర్వహించారని, 2000 మందికి పైగా సర్జన్లు యూకే వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఎఫ్ఆర్ సీఎస్, ఎంఆర్ సీఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ఆ కోర్సులు దోహదపడ్డాయ‌ని నాకు తెలుసు. కిమ్స్ ఆస్ప‌త్రి ఇంటర్ కాలేజియేట్ ఫైనల్ ఎమ్ఆర్‌సీఎస్ పరీక్షలకు కూడా కేంద్రంగా ఉంది. ఈ విష‌యంలో డాక్టర్ రఘురామ్ పోషించిన క్రియాశీలక పాత్రకు ధన్యవాదాలు” అని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా అసోసియేష‌న్ ఆఫ్ స‌ర్జ‌న్స్ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అంత‌ర్జాతీయ వ్య‌వ‌హారాల క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ పి.ర‌ఘురామ్ మాట్లాడుతూ, “2020లో నేను ఏఎస్ఐ అధ్య‌క్షుడిగా ఉన్న సమయంలో అత్యంత ఉపయోగకరమైన ఈ కోర్సును భారతదేశానికి తీసుకురావాలన్నది నా కల. కానీ కొవిడ్ మహమ్మారి ఆ క‌ల‌ను చెడగొట్టింది. నా సొంత ఊళ్లోనే తొలి కోర్సును నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. శస్త్రచికిత్స తర్వాత ఉత్తమ ఫలితాలు రావాలంటే, సాంకేతిక నైపుణ్యాలు మాత్రమే సరిపోవు. పేలవమైన కమ్యూనికేషన్ అనేది శస్త్రచికిత్స సమయంలో తప్పులకు కారణమయ్యే ఒక సాధారణ, కానీ చాలామంది విస్మ‌రించే అంశం. రోగులను సరిగ్గా ఎంపిక చేయడంలో వైఫల్యం; రోగనిరోధక యాంటీబయాటిక్ ఇవ్వడం మర్చిపోవడం; సరైన సైట్‌ని మార్క్ చేయడంలో విఫలం కావడం; ఇలాంటి స‌మ‌స్య‌ల‌న్నీ కూడా శ‌స్త్రచికిత్స చేయ‌డం లాగే చాలా ముఖ్య‌మైన‌వి. నిజానికి శ‌స్త్రచికిత్స ఫ‌లితాల‌ను నిర్ణ‌యించేవి ఇవే. ఆప‌రేష‌న్ థియేట‌ర్‌లో ఇలాంటి ముఖ్య‌మైన అంశాల‌న్నీ ఈ కోర్సులో క‌వ‌ర్ అవుతాయి. ఈ ప‌రిచ‌య‌ కోర్సుతో దేశంలో శస్త్రచికిత్స రంగానికి పెద్దపీట వేయాల

More Press Releases