ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వచ్చిన వరుణ్ బడోలా నటించిన థ్రిల్లర్ టెలిప్లే 'రాంగ్ టర్న్'

Related image

రంజిత్ కపూర్ రాసిన, ఈ జీ థియేటర్ టెలిప్లే, చట్టపరమైన మరియు నైతిక న్యాయం గురించి చర్చిస్తుంది. ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలోని థియేటర్ ప్రేమికులకు అందుబాటులో ఉంది

ఒక మాక్ ట్రయల్ గురించి 1956లో స్విస్ రచయిత ఫ్రెడరిక్ డ్యూరెన్‌మాట్ రచించిన నవల 'ఎ డేంజరస్ గేమ్' లేదా 'డై పన్నె' స్ఫూర్తితో రంజిత్ కపూర్ హిందీలో 'రాంగ్ టర్న్' రాశారు. ఈ ఉత్కంఠభరితమైన థ్రిల్లర్ ఇప్పుడు తెలుగులో ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా ప్రేక్షకుల కోసం అందుబాటులో ఉంది. వరుణ్ బడోలా పోషించిన అపరిచితుడు అరుణ్ పాత్ర , ఒక తుఫానుతో కూడిన రాత్రిలో ఒక పాత, ఒంటరి ఇంట్లోకి వెళ్ళటం తో ప్రారంభ మవుతుంది. అక్కడ ముగ్గురు రిటైర్డ్ లాయర్లు అసాధారణమైన ఆట ఆడుతుంటారు.  అరుణ్ వారితో చేరి, తన గతం గురించి ఇబ్బంది కరమైన నిజాలను వెల్లడిస్తూ మాక్ ట్రయల్‌ని కొనసాగిస్తాడు. ప్రాసిక్యూటర్ మరియు డిఫెన్స్ లాయర్‌తో విచారణ ప్రారంభమవుతుంది, అయితే ఈ విచారణకు 'న్యాయమూర్తి' అధ్యక్షత వహిస్తారు. చట్టపరమైన మరియు నైతిక న్యాయం మధ్య రేఖను అస్పష్టం చేసే సంఘటనలతో ఇది కొనసాగుతుంది. 

ఇషాన్ త్రివేది దర్శకత్వం వహించిన ఈ టెలిప్లేలో గోవింద్ నామ్‌దేవ్, లలిత్ తివారీ, సునీల్ సిన్హా, లిలిపుట్ ఫరూకీ, సుజానే ముఖర్జీ, అనంగ్షా బిస్వాస్, షాలినీ శర్మ మరియు నీరాజ్ సాహ్ కూడా నటించారు.

 ఎప్పుడు: సెప్టెంబర్ 16, 2023

ఎక్కడ: డిష్ టీవీ & D2H రంగమంచ్ యాక్టివ్ మరియు ఎయిర్‌టెల్ థియేటర్ (కన్నడ మరియు తెలుగులో)

More Press Releases