ప్రపంచంలోని మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఇ-లైబ్రరీ యాప్ ట్రాన్సెండ్ ( Transcend) తో ఆధ్యాత్మికతను విప్లవాత్మకంగా మారుస్తున్న ఇస్కాన్

Related image

·      అనువాదాలతో సహా 20000 సంస్కృత శ్లోక పద్యాలు వల్లించారు , 8000 గంటల ఆడియో మరియు 600 కు పైగా  ఇ పుస్తకాలు వంటి వన్నీ 11 భాషల్లో అందుబాటులో ఉన్నాయి.

·      ఒక సారి కొనుగోలు చేస్తే 8000 గంటల ఆడియోబుక్‌లు మరియు 600 కాంప్లిమెంటరీ ఇ-బుక్స్‌ను జీవితకాలం పొందవచ్చు 

ఆగస్ట్ , 2023:  మానసిక వికాసానికి, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం  పుస్తకాలు ఒక అనివార్య మాధ్యమం. ఇస్కాన్ యొక్క పబ్లిషింగ్ విభాగం భక్తివేదాంత బుక్ ట్రస్ట్ ఈ రోజు వారి వినూత్న యాప్ “ట్రాన్సెండ్” (Transcend) ని విడుదల చేసింది, ఇది ప్రపంచంలోనే ఆడియో మరియు ఇ-బుక్స్ రెండింటినీ ఒకే చోట అందించే మొట్ట మొదటి ఇ-లైబ్రరీ యాప్.

ఆడియోబుక్‌ల అభిమాని అయినా లేదా ఈ-బుక్స్ ( eBooks ) చదవడానికి ఇష్టపడినా, ట్రాన్సెండ్  మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. వినియోగదారులు కేవలం కొన్ని ట్యాప్‌లతో ఆడియో మరియు ఈ-బుక్ ఫార్మాట్‌ల మధ్య ఎలాంటి ఇబ్బందులు లేకుండా మారవచ్చు, తద్వారా తమ అవసరాలకు సరిగ్గా  సరిపోయే విధంగా తమకు ఇష్టమైన పుస్తకాలనూ ఆస్వాదించే అవకాశమూ అందిస్తుంది. 

శ్రీల ప్రభుపాద పుస్తకాలలోని 2.7 లక్షల పేజీలకు పైగా విస్తరించి ఉన్న మొత్తం 5.6 కోట్ల పదాలు 8000 గంటల ఆడియో మరియు 600 ఇ-బుక్స్‌లుగా మార్చబడ్డాయి.



ఈ యాప్ ఆండ్రాయిడ్  మరియు iOS ప్లాట్‌ఫారమ్‌లలో ,  వెబ్ యాప్‌లో కూడా అందుబాటులో ఉంది. వివరణాత్మక సమాచారం మరియు డెమో ట్యుటోరియల్‌లు పూర్తి  ఆలోచనాత్మకంగా www.transcendstore.com లో అందించబడ్డాయి. ఈ-  యాప్ ఒక సారి కొనుగోలు తో  జీవితకాల యాక్సెస్‌ ను  మరియు 600 ఇ-పుస్తకాలను ఉచితంగా అందిస్తుంది.

అత్యంత శక్తివంతమైన  భద్రతా కార్యాచరణతో ఈ యాప్ అభివృద్ధి చేయబడింది మరియు వినియోగదారులకు సౌకర్యవంతమైన  ఇంటర్‌ఫేస్‌ను ఇది  అందిస్తుంది. ఫ్లాష్‌కార్డ్‌లు, సులభంగా షేర్ చేసుకునే అవకాశం మరియు ఈ -బుక్‌ల కోసం మాత్రమే కాకుండా యాప్ డిజైన్‌లో విలీనం చేయబడిన ఆడియో బుక్ నేరేషన్‌  బుక్‌మార్క్ ఎంపిక యొక్క గుర్తించదగిన ఫీచర్ సహా అనేక సంచలనాత్మక ఫీచర్లు ఉన్నాయి.

ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో  ఈ యాప్ వెనుక వున్న  తమ లక్ష్యాలను   భక్తివేదాంత బుక్ ట్రస్ట్  , ట్రస్టీ మరియు సీఓఓ , శ్రీ ఆనంద తీర్థ దాసు పంచుకుంటూ  "ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న లేదా స్వీయ-ఆవిష్కరణ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభించాలనుకునే ఆధ్యాత్మిక అన్వేషకులందరి కోసం ట్రాన్సెండ్ యాప్ రూపొందించబడింది. నేడు ప్రజలు రోజువారీ రాకపోకలు మరియు ఇంటి ప్రాపంచిక పనులలో చాలా గంటలు గడుపుతున్నారు. ఈ యాప్ ప్రజలు తమ ప్రయాణాన్ని మరియు రోజువారీ పనుల సమయాన్ని దైవంతో కనెక్ట్ అయ్యే అవకాశంగా మార్చుకోవడంలో సహాయపడుతుంది.  త్వరలోనే వివిధ విదేశీ భాషలు కూడా జోడించబడతాయి..." అని అన్నారు. 


ఆడియోబుక్ మరియు కంటెంట్ ప్రస్తుతం  11 భాషలలో అందుబాటులో ఉన్నాయి. రాబోయే నెలల్లో మరిన్ని ప్రాంతీయ భాషలు జోడించబడతాయి.

బ్లాక్‌చెయిన్స్ మైనింగ్ మరియు క్రిప్టో ఔత్సాహికులను సైతం  ఈ  ప్లాట్‌ఫారమ్ నిర్మిస్తున్నప్పుడు పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఇది లేయర్ 2 లెవల్  పాలిగాన్  బ్లాక్‌చెయిన్‌ను ఉపయోగించటం ద్వారా  క్రిప్టో వినియోగదారులు సైతం BBT పుస్తకాలను మరియు పెయింటింగ్‌లు కొనుగోలు చేయగలరనే భరోసా అందిస్తుంది.  వారికి నూతన తరపు సాంకేతికతతో నడిచే ప్లాట్‌ఫారమ్‌ను అందజేస్తాయని నిర్ధారించటం వల్ల  ట్రాన్సెండ్ తో మాత్రమే కాదు  వారు తమ  లోపల ఉన్న దైవంతో కూడా కనెక్ట్ అవ్వగలరు.


భక్తివేదాంత బుక్ ట్రస్ట్ గురించి:

భక్తివేదాంత బుక్ ట్రస్ట్ (BBT) అనేది భక్తి-యోగ  సంస్కృతి  మరియు వ్యక్తిత్వ వేదాంతం  మరియు  తత్వశాస్త్రం, వేదాంతశాస్త్రం మరియు సంస్కృతి పై  పురాతన మరియు క్లాసిక్ వైష్ణవ గ్రంథాలు, ఇతిహాసాలు మరియు సమకాలీన రచనల యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద ప్రచురణకర్త. ఇది 1972లో   దైవానుగ్రహ సంభూతులు  A. C. భక్తివేదాంత స్వామి ప్రభుపాదచే స్థాపించబడింది. దీని ప్రచురణలలో అసలైన గ్రంథ రచనలు ఉన్నాయి, ప్రస్తుతం 87 భాషల్లోకి అనువదించబడ్డాయి, మరిన్ని భాషలు క్రమంగా జోడించబడుతున్నాయి మరియు ఈ సంప్రదాయ గ్రంథాలను చర్చించే మరియు వివరించే పుస్తకాలూ  ఉన్నాయి. డిజిటల్ ఆడియో, వీడియో మరియు మల్టీమీడియా ప్రదర్శనలను కూడా BBT  ప్రచురిస్తుంది.

More Press Releases