చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కు అమెరికా నుండి శ్రీ గొలగాని రవికృష్ణ గారు 2 లక్షల రూపాయలు విరాళం

Related image

మెగాస్టార్ చిరంజీవి గారిపై ఎనలేని అభిమానం చూపించే విజయవాడ వాస్తవ్యులు శ్రీ గొలగాని రవి గారు చిరంజీవి గారి బాటలోనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. 

చిరంజీవి గారు పిలుపునిచ్చే ఎటువంటి సేవా కార్యక్రమానికైనా.. ముందుకొచ్చి సహాయపడే మెగా అభిమాని. కరోనా సమయంలో చిరంజీవి ఆక్సీజన్ బ్యాంకుకు కూడా ఎంతో సహాయ సహకారాలు అందించిన మంచి మనసున్న వ్యక్తి.

నేడు శ్రీ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా, వారి  తండ్రిగారైన కీర్తి శేషులు శ్రీ కొణిదెల వెంకట్రావు గారి పేరు మీద నిర్మిస్తున్న ఆసుపత్రి కి తన వంతుగా శ్రీ గొలగాని రవికృష్ణ గారు మొదటి విడతగా రూ 2 లక్షల 'చిరు' సహాయం CCT కీ అందజేసారు. 
సమాజ సేవలో ఎందరికో స్ఫూర్తినిస్తున్న మెగాభిమానుల్లో శ్రీ గొలగాని రవి గారు కూడా భాగం కావడం అభినందించే విషయం.

రవణం స్వామి నాయుడు
అఖిల భారత చిరంజీవి యువత

Chiranjeevi
Tollywood
Golagani Ravikrishna

More Press Releases