ఆహా నేను సూపర్ వుమెన్ షో లో 'సూపర్ వుమెన్ ఫండ్' ను ప్రకటించిన తెలంగాణ ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజన్ మరియు వి హబ్ సీఈఓ దీప్తి రావుల
- ఇప్పటి వరకు మొత్తం 4 కోట్ల 75 లక్క్షలు ఇన్వెస్ట్ చేసిన ఏంజెల్స్ -
Hyderabad, 10th August: గత మూడు వారాలుగా తెలుగు మహిళలని ఎంతో ఉతేజపరుస్తున షో ఆహా వారి నేను సూపర్ వుమెన్. వంటింటి మాటలు ఇపుడు మొత్తం ఇపుడు ఈక్విటీ మరియు పర్సంటేజీ మాటలుగా మార్చిన ఘనత ఆహా కు మాత్రమే దక్కింది. అందుకే తెలంగాణ గవర్నమెంట్ నుంచి ప్రిన్సిపాల్ సెక్రటరీ జయేష్ రంజాన్ మరియు వి హబ్ సీఈఓ దీప్తి రావుల కలిసి 'సూపర్ వుమెన్ ఫండ్' అని ప్రకటించారు. ఆ ఎపిసోడ్ ఈ శుక్ర మరియు శనివారం రాత్రి 7 గంటలకు ఆహా లో ప్రసారం కానుంది.
జయేష్ రంజాన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్స్ (ITE&C) మరియు పరిశ్రమలు & వాణిజ్య విభాగాలు ప్రిన్సిపాల్ సెక్రటరీ మాట్లాడుతూ, "ఆహా వారితో కలిసి ఈ షో చేయడం ఎంతో ఆనందగా ఉంది. అందుకే మా వంతు సాయంగా మేము ఈ 'సూపర్ వుమెన్ ఫండ్' ని అందరికి అందుబాటులోకి తేబోతున్నాం. ఏ వుమెన్ ఇంటర్ప్రెన్యూర్స్ కి అయితే ప్రతిభ ఉండి ఇన్వెస్ట్మెంట్ దక్కలేదో, వారికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే, ఏంజెల్స్ ఇన్వెస్ట్ చేసిన, ఇంకా స్కేలాబిలిటీ కోసం డబ్బు అవసరమైన వాళ్ళకి కూడా ఈ ఫండ్ ద్వారా మేము మద్దతు ఇస్తాము. వి హబ్ వారు ఈ ఫండ్ ని ఎలా మరియు ఎక్కడ ఉపయోగించాలి అనే ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే, ప్రభుత్వం ఎపుడు కూడా మహిళా వ్యాపారవేత్తలకు తోడుగా నిలుస్తుంది అని ఈ షో ద్వారా నేను మరోసారి అందరికి తెలియజేస్తున్నాను.”
ఆహా ‘నేను సూపర్ ఉమెన్ - ఇది మహిళల బిజినెస్ డ్రీమ్స్‌కి డోర్ బెల్. ఈ షోల భాగంగా ఈ స్టేజ్ మీదకి మహిళలు వచ్చి వాళ్ల బిజినెస్ ఐడియాలను ప్రెజెంట్ చేస్తారు. వాళ్ల ఐడియాలను ఎంకరేజ్ చేస్తూ వాళ్ల బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేయడానికి ఏంజెల్స్ కూడా ఉంటారు. అయితే ఈ ఆహా షోలో ఏంజెల్స్ హేమాహేమీలే వచ్చారు. సింధూర నారాయణ (నారాయణ గ్రూప్ డైరెక్టర్), శ్రీధర్ గాధి (క్వాంటెలా ఐఎన్‌సీ ఫౌండర్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్), దీప దొడ్ల (దొడ్ల డెయిరీ ప్రమోటర్), సుధాకర్ రెడ్డి (అభి బస్ ఫౌండర్, ఫ్రెష్ బస్- ఫౌండర్, సీఈఓ), రేణుక బొడ్ల (సిల్వర్ నీడిల్ వెంచర్స్- వెంచర్ పార్ట్‌నర్), రోహిత్ చెన్నమనేని (డార్విన్ బాక్స్ కో-ఫౌండర్), కరణ్ బజాజ్ (ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా)