సీతా కళ్యాణ వైభోగమే చివరి షెడ్యూల్ ప్రారంభం

Related image

సుమన్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్న సినిమా 'సీతా కళ్యాణ వైభోగమే'. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో  రాచాల యుగంధర్ నిర్మిస్తున్నారు.

ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు క్లాప్ ఇచ్చిన ఈ సినిమాను భారీ యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో తెరకెక్కిస్తున్నారు. టైటిల్‌లో పాజిటివ్‌ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఇటీవలే గోవాలో ప్రముఖ కొరియోగ్రాఫర్ భాను మాస్టర్ నేతృత్వంలో దాదాపు 250 మంది డ్యాన్సర్లతో ఒక పాటను చిత్రీకరించారు.

చక్కటి ఫ్యామిలీ ఫిల్మ్ గా, తెలంగాణ వైభవానికి అద్దం పట్టేలా ప్రొడ్యూసర్ రాచాల యుగంధర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ పోచంపల్లి పరిసర ప్రాంతాలలో మొదలైంది. నల్లమల అటవీ ప్రాంతంలో ప్రముఖ ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ నేతృత్వంలో  100 మంది ఫైటర్లతో భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

శరవేగంగా షూటింగ్ జరపుకుంటున్న ఈ సినిమాను దసరాకి రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది..

గగన్ విహారి విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నాగినీడు, శివాజీ రాజా, ప్రభావతి, రచ్చరవి ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఈసినిమాకు  సంగీతం చరణ్ అర్జున్, కెమెరామెన్ ప్రవీణ్ వనమాలి, ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రాఫర్లు భాను మాస్టర్, పోలకి విజయ్.

Seetha Kalyana Vaibhogame
Tollywood

More Press Releases