లారిక్ కంపెనీ లో 50 లక్క్షలు ఇన్వెస్ట్ చేసిన ఆహా ‘నేను సూపర్ వుమెన్’ ఏంజెల్స్

Related image

మూడు వారాల్లో 9 కంపెనీల్లో రూ.3.9 కోట్ల పెట్టుబడులు పెట్టిన ఏంజెల్స్, మరో ముగ్గురికి మెంటార్ షిప్ -
Hyderabad, 7th August: “ప్రశ్నించనిదే సమాధానం దొరకదు… ప్రయత్నించందే విజయము దక్కదు,” అన్నారు మన బి ఆర్ అంబెడ్కర్. ఆలా ప్రశ్నించి, ప్రయత్నించి మన ముందు స్టార్ మహిళగా నిలిచారు, మన ఆహా వారి 'నేను సూపర్ వుమెన్' యొక్క మహిళా వ్యాపారవేత్తలు. ఎంతో మందిని ఆకర్షించిన ఈ షో మూడో వారంలోకి అడుగుపెడుతుంది. ఈ వారంలో ఏంజెల్స్ 90 లక్షాలు ఇన్వెస్ట్ చేసారు. ఇప్పటికి వరకు మన వుమెన్ స్టార్ట్ అప్ కంపెనీస్ లో ఏంజెల్స్ 3 కోట్ల 90 లక్క్షలు (1 , 2 మరియు 3 వారాలు కలిపి) ఇన్వెస్ట్ చేసారు .
 
లావణ్య సూన్కారి - ఫౌండర్ అఫ్ లారిక్

అమ్మ మొదటి గురువు. ఆలా అమ్మ చూపిన మాటలు విన్నీ, తనదైన దారిని తీర్చిదిద్దుకుంది లావణ్య. 26 ఏళ్లకే ఫార్చ్యూన్ 500 కంపెనీ కి మార్కెటింగ్ హెడ్ గా నిర్వహించి, ప్రస్తుతం 32 ఏళ్ళకి లారిక్ కంపెనీ ని స్థాపించింది. అమ్మ పాలు ఎంత స్వచ్ఛమైందో, లారిక్ యొక్క హెల్త్ సుప్ప్లీమెంట్స్ అంతే స్వచ్చమైనవి అంటుంది ఈ స్టాన్ఫోర్డ్ యూనివెర్సటి న్యూట్రిషన్ స్పెషలిస్ట్. 36 ,౦౦౦ కస్టమర్స్ ఉన్న ఈ కంపెనీ కి అమెరికా నుండి క్లీన్ లేబిల్ సర్టిఫైడ్ బ్రాండ్ అని కూడా పొందింది. ఆలా పొందిన కంపెనీస్ లో భారత దేశంలో మూడు మాత్రమే ఉన్నాయే. అందులో ఒకటి లారిక్. ఇపుడు ఆహా నేను సూపర్ వుమెన్ షో కి 70 లక్క్షలు 2 % వాటా కి అడుగుతూ వచ్చింది లావణ్య. తన పట్టుదల చూసి మెచ్చిన ఏంజెల్స్ రేణుక బొడ్ల మరియు కరణ్ బజాజ్ 50 లక్క్షలు 4 % వాటా అడిగారు. దానికి లావణ్య ఒప్పుకున్నారు.


మాధురి ఆకెళ్ళ - ఫౌండర్సె అఫ్ సెకండ్ ఇన్నింగ్స్

అమ్మ ఒడి, గుడి కన్నా చాల ప్రశాంతతను ఇస్తుంది. కానీ, అలాంటి తలితండ్రులని మనం ఒంటరిగా ఇంట్లో వదిలిసే బయటికి వెళ్లిపోతాం. అలాంటి వాళ్ళ ఒంటరి తనని దూరం చేయడానికి వచ్చిందే - ఈ సెకండ్ ఇన్నింగ్స్. మాధురి గారి ఈ సెకండ్ ఇన్నింగ్స్ కంపెనీ లో ప్రొద్దున 9 ఇంటి నుంచి సాయంత్రం 5 గంటల వరకు , మరియు ఒక్క రోజు నుండి ఆరు మాసాలు వరకు వీరి దగ్గర ఉండచ్చు. ఇది వృద్ధాశ్రమం కాదు. ఒక డే కేర్ సెంటర్ ఇది. ఇక్కడ యోగ, ఇండోర్ గేమ్స్, మొబిలిటీ థెరపీ మరియు వృద్ధుల యొక్క హొబ్బిఎస్ ని కూడా వీలు చూసుకుంటారు. ఆలా మరోసారి వృధాప్యం లో అమ్మ వోడి ని చవిచూపిస్తున సెకండ్ ఇన్నింగ్స్ మాధురి గారు 40 లక్క్షలు 20 % వాటాకు అడగగా, Dr సింధూర నారాయణ 20 లక్క్షలు 15 % వాటా ఆఫర్ చేయగా, డీల్ ని ఇరువురు ఒప్పుకున్నారు.


ప్రత్యూష - ఫౌండర్ అఫ్ గ్రెయిల్ మేకర్స్ ఇన్నోవేషన్స్

"సర్వేంద్రి యానాం నయనం ప్రధానం" అన్నారు పెద్దలు. అందుకే 26 ఏళ్ళ ప్రత్యూష గ్రెయిల్ మేకర్స్ ఇన్నోవేషన్స్ తోటి మన ముందుకు వచ్చారు. చిన్నపుడు డిస్లెక్సియా తో ఆమె బాధపడ్డారు. ఆలా తనలా బాధ పడే వారికీ చేయూతగా నిలవాలి అని ఎల్ వి ప్రసాద్ కంటి ఆసుపత్రి లో వాలంటీర్ గా పనిచేసారు. అపుడే విజువల్ ఇంపైరెడ్ అయినా ఐశ్వర్య పరిచయమైంది. వారి స్నేహం నుండి వచ్చిన కంపెనీ గ్రెయిల్ మేకర్స్. ప్రత్యూష రెండు ప్రొడక్ట్స్ చేసారు - విసిఒన్ నానీ (చిన్నపిల్లలా కోసం) మరియు స్పేస్ ఫెల్ట్ (పెద్దవాళ్ళ కోసం). స్పేస్ ఫెల్ట్ ద్వారా, ఒక క్యూ ర్ కోడ్ ని స్కాన్ చేస్తే ఆ రూమ్ లో లేదా ఒక ప్రోడక్ట్ గురించి వివరాలు వస్తాయి. ప్రత్యూష, నేను సూపర్ ఉమెన్ షో కి వచ్చి 50 లక్క్షలు 5 % వాటా కు కోరగా, ఏంజెల్ సింధూర నారాయణ 20 లక్క్షలు 20 % వాటాలు కు ఒప్పుకున్నారు.


నిష్క అగర్వాల్ - ఫౌండర్ అఫ్ సెప్టెంబర్ షూస్:

పెళ్లి రెండు జీవితాలనే కాదు, రెండు కుటుంబాలని కూడా ఒకటి చేస్తాయి. అలాంటి ఒక సంబరానికి ఎంతో షాపింగ్ జరుగుతుంది. కానీ చెప్పుల షాపింగ్? మనం వేసుకున్న చెప్పులు డాన్స్ చేస్తూ విరిగిపోతే? అలాంటివి జరగకుండా, మన వెయిట్ మరియు మనకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకొనే వెడ్డింగ్ ఫుట్ వేర్- సెప్టెంబర్ షూస్. ఇలాంటి ఒక ప్రోడక్ట్ భారత దేశంలోనే మొట్ట మొదటి సారి చేయబడుతోంది. నిష్క ఈ షో లో 50 లక్క్షలు 15 % వాటికి కోరగా, ఏంజెల్స్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మెంటార్ షిప్ అందించడానికి ఒప్పుకున్నారు. ఏంజెల్స్ సింధూర నారాయణ మరియు కరణ్ బజాజ్ మెంటార్ షిప్ ఇస్తానని చెప్పగా, నిష్క దానికి ఒప్పుకున్నారు.

More Press Releases