ప్రొద్దుటూరు, రావినూతల లలో పల్లె ప్రగతి-2 కార్యక్రమంలో పాల్గొన్న  మంత్రి పువ్వాడ

Related image

ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరు గ్రామం మరియు బోనకల్లు మండలం రావినూతల గ్రామంలలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామంలో నిర్మించిన వైకుంఠదామంను ప్రారంభించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు. అనంతరం హరిత తెలంగాణే లక్ష్యం గా మొక్కలు నాటి గ్రామ పంచాయతీలకి ట్రాక్టర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పల్లె ప్రగతి సభలలో మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి అందరి బాధ్యత అన్నారు. ప్రతి ఊరికి వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, నర్సరీ, ట్రాక్టర్ ఉండాల్సిందేనన్నారు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ కనీసం గ్రామానికి వైకుంఠాధామం లేకుండా ఉన్న ఊర్లు అనేకం ఉన్నాయన్నారు. మొదటి విడత పల్లె ప్రగతిలో మిగిలిపోయిన ప్రతి పనినీ ఈ విడతలో పూర్తి చేయాలన్నారు. విద్యుత్ స్తంభాలు, వేలాడుతున్న కరెంట్ వైర్లు సరిచేయలన్నారు. అధికారులు సమన్వయంతో పని చేసి పల్లెప్రగతి విజయవంతానికి కృషి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు గారు, zp సీఈఓ శ్రీమతి ప్రియాంక కర్ణన్, DRDA PD శ్రీమతి ఇందుమతి, SC కార్పొరేషన్ కె సత్యనారాయణ, సర్పంచ్ లు, ఎంపిటిసిలు, జడ్పీటీసీ, జిల్లా ఉన్నతాధికారులు తదితరులు ఉన్నారు..

More Press Releases