భారతదేశంలో విప్లవాత్మక మార్పులు: జడ్చర్లలో మొట్టమొదటి డయాలసిస్ యూనిట్‌ను ప్రారంభం

Related image

తెలంగాణ, జూన్ 12 , 2023: భారతదేశంలోని ప్రముఖ డయాలసిస్ సర్వీస్ ప్రొవైడర్ల నెట్‌వర్క్మ రియు వినూత్న డయాలసిస్ పరిష్కారాల  సాధనలో అగ్రగామి అయిన నెఫ్రోప్లస్, నేడు తెలంగాణ  రాష్ట్రం జడ్చర్ల జిల్లాలోని శ్రీ వంశీ హాస్పిటల్ సహకారంతో దేశంలోనే మొట్టమొదటిసారిగా 'కంటైనర్డ యాలసిస్'  యూనిట్‌ను ప్రారంభించింది. ఈ వినూత్న మోడల్ మూత్రపిండ సంరక్షణ తీరును  మార్చడానికి బ్రాండ్ యొక్క కృషిని సూచిస్తుంది మరియు  డయాలసిస్ సంరక్షణ కోసం పెరుగుతున్న అవసరాన్ని సైతం సూచిస్తుంది.

ఆసుపత్రులు మరియు ఆరోగ్య కేంద్రాలలో పూర్తిగా పనిచేసే  డయాలసిస్ యూనిట్  కోసం వున్న స్థల పరిమితుల ను దృష్టిలో పెట్టుకుని  ఇది రూపుదిద్దారు. కొత్తగా ఏర్పాటు చేసిన ఈ యూనిట్ తో , ఈ ప్రాంతాల్లోని డయాలసిస్ రోగులు నెఫ్రో ప్లస్  అందించే అత్యాధునిక డయాలసిస్ సేవలను పొందగలరు. 

 ఈ సందర్భంగా  నెఫ్రోప్లస్ వ్యవస్థాపకుడు మరియు సీఈఓ  శ్రీ  విక్రమ్ వుప్పాల  మాట్లాడుతూ  ‘‘భారతదేశంలో మూత్రపిండ సంరక్షణకు మార్గదర్శకుని గా , నెఫ్రోప్లస్ వినూత్న పరిష్కారాల ద్వారా రోగుల సంరక్షణను అభివృద్ధి చేయడానికి అంకితం చేయబడింది. డయాలసిస్రో గులకు చేరువలో ఉండటం, అందుబాటు ధరలలో సేవలను అందించటం  మరియు  అధిక నాణ్యతతో సేవలను అందించటం ద్వారా  డయాలసిస్ సేవల యొక్క సాంప్రదాయ పద్ధతులను విప్లవాత్మకంగా మార్చడం మా  లక్ష్యం. ఈ వినూత్న పరిష్కారాలను భారతదేశంలోని మారుమూల  ప్రదేశాలకు విస్తరించే దృష్ట్యా, బ్రాండ్ యొక్క గ్రీన్‌హార్న్ మార్కెట్‌లలో ఇదే మోడల్‌తో మరో 10 యూనిట్లను స్థాపించాలని మేము ప్రణాళిక చేస్తున్నాము..అని అన్నారు 

 కొత్తగా అభివృద్ధి చేయబడిన కంటైనర్ డయాలసిస్ సేవ ఒక నిర్దిష్ట వ్యవధిలో నలుగురు  రోగులకు సేవలను అందించగలదు . నెఫ్రోప్లస్ తమ  'డయాలసిస్ ఆన్ వీల్స్;డయాలసిస్ ఆన్ కాల్, హాలిడే డయాలసిస్ మరియు మరెన్నో రకాల సేవలకు 'కంటైనర్ డయాలసిస్ని విజయవంతంగా జోడిస్తుంది. . ఈ కార్యక్రమంలో నెఫ్రోప్లస్ సహ వ్యవస్థాపకుడు శ్రీ  కమల్ షా మాట్లాడుతూ  డైయాసిస్ రోగుల  జీవిత ప్రమాణాలను మెరుగుపరచడానికి కృషి చేసే అత్యాధునిక పరిశోధన మరియు అభివృద్ధిని జోడించటానికి  కట్టుబడి ఉన్న ఒక ఉద్వేగభరితమైన సంస్థను నిర్మించాలనే బ్రాండ్ యొక్క లక్ష్యం గురించి వెల్లడించారు.

More Press Releases