ఓటీటీలో ఆకట్టుకుంటోన్న పూర్ణ 'బ్యాక్ డోర్‌'

Related image

ఓటీటీలో కంటెంట్ ఓరియెంటెడ్, డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో తెరకెక్కే చిత్రాలకు, బోల్డ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంటుంది. హీరోయిన్ పూర్ణ నటించిన బ్యాక్ డోర్ సినిమా గత ఏడాది థియేటర్లోకి వచ్చి మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రేక్షకులను ఈ సినిమా మెప్పిస్తోంది.

ఆర్చిడ్ ఫిల్మ్ స్టూడియోస్ బ్యానర్ మీద బి శ్రీనివాస్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు కర్రి బాలాజీ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రంలో పూర్ణ సరసన కొత్త హీరో తేజ నటించారు. రెండే రెండు పాత్రలతో, ఆడవాళ్ళ మనోభావాల్ని, కుటుంబ విలువల్ని, భార్యాభర్తల సంబంధాల్ని, అక్రమ సంబంధాలు వల్ల వచ్చే నష్టాన్ని ఈ చిత్రంలో చక్కగా చూపించి గొప్ప సందేశం ఇచ్చారు.


రెండు గంటల నిడివి ఈ చిత్రంలో రెండే పాత్రలతో నడిపించడంలో దర్శకుడు తన ప్రతిభ కనబరిచారు. పూర్ణ అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చారు. పూర్ణ పక్కన కొత్తవాడైనా తేజ అద్భుతంగా నటించారు. సినిమాటోగ్రాఫర్ మంచి విజువల్స్ అందించారు. సంగీతం బాగుంది. ఎడిటింగ్ చోట కే ప్రసాద్ తన మార్కుని చూపించారు. ఇలా బ్యాక్ డోర్ సినిమా ఇప్పుడు అన్ని రకాలుగా అమెజాన్ ప్రైమ్‌లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

Poorna
Backdoor
Amazon Prime
OTT
Telugu Movies

More Press Releases