తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో తెలుగు పద్యకావ్యాలు / గేయకావ్యాలలో పోటీలు

Related image

ఉత్తర అమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్యవిభాగం తానా ప్రపంచసాహిత్యవేదిక ఆధ్వర్యంలో తెలుగు పద్యకావ్యాలు / గేయకావ్యాలలో పోటీలు 

తానా-సిరివెన్నెల సాహితీపురస్కారం-2023

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు భాషాభిమానులకు, రచయితలకు శుభవార్త! ప్రముఖకవి, పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి సంస్మరణలో తెలుగు పద్యకావ్యాలు / గేయకావ్యాలలో పోటీలకు ఆహ్వానం పలుకుతున్నాము.

•విజేతకు లక్ష రూపాయల నగదుపురస్కారం 
• కావ్యాలు అందవలసిన చివరితేది: మే 31, 2023 
• ఫలితాల ప్రకటన: జూన్ 30, 2023 లోపు

నియమ నిబంధనలు:  
అంశం: 
1. సమకాలీన సామాజికసమస్యలు-పరిష్కారాలు;  
2. మానవసంబంధాలు-కుటుంబ విలువలు; 
3. ప్రకృతి-పర్యావరణం; 
4. యువతరం-భవిష్యత్తు; 
5. దేశభక్తి-జాతీయవాదం 
అంశాలలో ఏదైనా ఒక అంశం తీసుకుని పద్యకావ్యం లేదా గేయకావ్యంగాని 60 పేజీలకు (A4 సైజులో) మించకుండా ఉండేటట్లుగా రాసి పంపవలసినదిగా మనవి.
 
 సరికొత్తగా వ్రాయబడిన కావ్యాలు మాత్రమే పోటీకి పరిగణింపబడతాయి. 
 ఇప్పటికే ముద్రించబడిన, సామాజిక మాధ్యమాలలో, వెబ్ పత్రికలల్లో ప్రచురితమైన రచనలు ఈ పోటీలకు అర్హం కావు. 
 కేవలం ఈ పోటీకోసం వ్రాసిన స్వీయరచనలను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాము. ఆ మేరకు హామీపత్రం జతచేయడం తప్పనిసరి. 
 పంపే రచనలతోపాటు మీ ఛాయాచిత్రాన్ని, పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, వాట్స్యాప్ నంబర్, ఇమెయిల్ ను జతపరచవలెను. 
 మీరు రాసిన కావ్యాన్ని స్కాన్ చేసి కానీ, తెలుగులో డి.టి.పి చేసి కానీ పంపించండి. 
 డి.టి.పి ప్రతిని ఇమెయిల్ రూపంలో tanasirivennela@gmail.com కు, వాట్స్యాప్ రూపంలో అయితే 1-972-591-1208 కు పంపవలెను. 
 మాకు అందిన కావ్యాలలో - బహుమతి పొందిన కావ్యాన్ని, మేము ఎంపికచేసిన కొన్ని కావ్యాలను ఇ- పుస్తకంగా ప్రచురిస్తాము. 
 మీరు పోటీలకు పంపిన కావ్యాలను తిరిగి మీకు పంపడం సాధ్యం కాదు. రచయితలు మూలప్రతిని తమవద్ద ఉంచుకోవడం మంచిది. 
 న్యాయనిర్ణేతల ఎంపికపై ఉత్తరప్రత్యుత్తరాలకు అవకాశంలేదు. 
 మిగిలిన వివరాలకు తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు – డా. ప్రసాద్ తోటకూర ను 1-817- 300-4747 లో గాని, లేదా prasadthotakura@gmail.com ద్వారా గాని సంప్రదించవచ్చును.

More Press Releases