అమెజాన్‌, ఆహాలో ఆకట్టుకుంటోన్న ఆది సాయి కుమార్ 'CSI సనాతన్‌'

Related image

లవ్‌లీ హీరో ఆది సాయి కుమార్‌ వరుసగా సినిమాలు చేస్తూ ఆడియెన్స్‌ను మెప్పిస్తూ వస్తున్నారు. వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంటున్న ఆది సాయి కుమార్ ఏడాదికి మూడు నాలుగు చిత్రాలతో ఆడియెన్స్ ముందుకు వస్తున్నాడు. ఈ క్రమంలోనే 'CSI సనాతన్‌' అంటూ ఆది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. థియేటర్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోనూ సత్తా చాటుతోంది.

భవానీ మీడియా సంస్థ ద్వారా ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌, ఆహా వంటి ఓటీటీ యాప్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. ఆది సాయి కుమార్ యాక్షన్స్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఓటీటీ ప్రేక్షకులను సైతం ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ మధ్య ఆయన సినిమాలు ఓటీటీలో ఎక్కువగా ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే.

విభిన్న జానర్లలో సినిమాలు చేస్తూ ఆడియెన్స్‌ను ఎప్పటికప్పుడు మెస్మరైజ్ చేస్తున్నారు ఆది సాయి కుమార్. CSI సనాతన్‌ సినిమాతో ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆదికి జోడీగా మిషా నారంగ్‌ హీరోయిన్‌గా నటించగా.. నందిని రాయ్, ఖయ్యుం, రవి ప్రకాష్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. 

ఈ చిత్రంలో ఆది క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటీవ్‌ ఆఫిసర్‌గా అద్భుతమైన నటనను కనబరిచారు. అనీష్ సోలోమన్‌ సంగీతం, గంగనమోని శేఖర్‌ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ అయ్యాయి. చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అజయ్‌ శ్రీనివాస్‌ నిర్మించగా..శివశంకర్‌ దేవ్‌ దర్శకత్వం వహించారు.

Watch CSI Sanatan on Amazon Prime

CSI Sanathan
Adi Saikumar
Tollywood
Amazon
Aha

More Press Releases