మణిపూర్ లోని తెలంగాణ విద్యార్థులను తరలించేందుకు ప్రత్యేక విమాణం ఏర్పాటు

Related image

హైద్రాబాద్, మే 06:: మణిపూర్‌లో నెలకొన్న శాంతిభద్రతల సమస్య నేపథ్యంలో, మణిపూర్ లోని తెలంగాణ విద్యార్థులు, మణిపూర్‌లో నివసిస్తున్న ప్రజల భద్రతకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. మణిపూర్ రాష్ట్రంలోని పరిస్థితిని పర్యవేక్షించడానికి, మణిపూర్‌లోని తెలంగాణ ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడానికి ప్రత్యేక సెల్ తెరవబడింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, తెలంగాణ రాష్ట్రానికి చెందిన సుమారు 250 మంది విద్యార్థులు ఇంఫాల్ మరియు పరిసర ప్రాంతాల్లోని వివిధ విద్యాసంస్థల్లో చదువుతున్నారు. తెలంగాణ విద్యార్థులను
ఇంఫాల్ నుంచి హైదరాబాద్‌కు తక్షణమే ప్రత్యేక విమానంలో తరలించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం 07-05- 2023 ఉదయం ఇంఫాల్ నుండి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానం ఏర్పాటు చేయబడింది.


ఇంఫాల్ నుండి హైదరాబాద్‌కు తెలంగాణ విద్యార్థులు సురక్షితంగా తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మణిపూర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో సంప్రదించి తగు చర్యలు తీసుకుంటున్నారు. మణిపూర్ రాష్ట్రంలోని తెలంగాణా ప్రజలు/విద్యార్థుల భద్రత కోసం మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్పో లీస్ ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు.

More Press Releases