జర్మనీలో ఎన్టీఆర్ శత జయంతి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

Related image

తెలుగు సినీరంగంలో ధ్రువతారగా వెలుగొంది, రాజకీయంలో తిరుగులేని నాయకుడుగా, అశేష ప్రజల మనస్సుల్లో ఆరాధ్యదైవంగా నిలిచిన విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ డా. పద్మశ్రీ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి శతజయంతి వేడుకలు జర్మనీ లోని ఫ్రాంక్ఫర్ట్ నగరం నందు మే 20 తారీఖున ఎన్నారై టీడీపీ జర్మనీ ఆధ్వర్యంలో అట్టహాసంగా జరుగబోతున్నాయి.
 
తెలుగుదేశం పార్టీ జర్మనీ విభాగం 2018 నుంచి ప్రతి సంవత్సరం తారకరాముని జన్మదిన వేడుకలను జర్మనీ లో నివసిస్తున్న తెలుగువారితో మినీ మహానాడు గా ఘనంగా జరుపుకుంటారు.
 
ఈసారి కూడా శతజయంతి ని మునిపెన్నడూ లేని విధంగా జరపాలి అని తెలుగుదేశం జర్మనీ విభాగపు ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నిర్ణయించారు.
 
రాబోయే సంవత్సరంలో ఎన్నికలలో భాగంగా తెలుగుదేశం పార్టీకి తమవంతు సహాయంగా ఎలా  ఉపయోగపడాలో తీర్మానాల ద్వారా చర్చించనున్నారు.  తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు ఈ కార్యక్రమానికి హాజరయి తమ సందేశాలను పంచుకుంటారు అని కమిటీ సభ్యులు తెలిపారు.
 
జర్మనీలో నివసిస్తున్న ప్రతి తెలుగువాడు మినీ మహానాడుకి హాజరయి ఆ మహనీయునికి ఘననివాళులు అర్పించవలసినదిగా కోరారు.
 
Content Produced by: Indian Clicks, LLC

Germany
NRI
Telugudesam
NTR
Mini Mahanadu

More Press Releases