తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించనున్న తెలుగు టాలన్స్

Related image

హైదరాబాద్, ఏప్రిల్ 22, 2023: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఫ్రాంచైజీ తెలుగు టాలన్స్ ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ (పిహెచ్‌ఎల్)లో ప్రవేశిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. వాలీబాల్, బ్యాడ్మింటన్, గోల్ఫ్, ఇతర క్రీడా జట్లతో సహా వివిధ స్పోర్ట్స్ లీగ్‌లలో పాల్గొనేందుకు పేరుగాంచిన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ క్రీడా ఆంట్రెప్రెయనెర్ అభిషేక్ రెడ్డి కనకనాల యాజమాన్యంలోని జట్టు పీహెచ్ఎల్  ప్రారంభ ఎడిషన్‌లో పోటీ పడుతుంది.

ఏప్రిల్ 23, 2023న ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో జరగనున్న ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ వేలంలో టాలన్స్ పటిష్టమైన జట్టును ఏర్పాటు చేయాలని చూస్తోంది. ప్రతి జట్టు 11 మంది భారతీయ ఆటగాళ్లు మరియు 3 అంతర్జాతీయ ఆటగాళ్లతో కూడిన జట్టును ఎంపిక చేస్తుంది.

తెలుగు టాలన్స్ టీమ్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా, అభిషేక్ రెడ్డి క్రీడను ప్రోత్సహించడం, ప్రతిభా వంతులై న అథ్లెట్లు తమ నైపుణ్యాలను పెద్ద వేదికపై ప్రదర్శించడానికి అవకాశం అందించడం లక్ష్యంగా పెట్టుకు న్నారు. అదే సమయంలో భారతదేశంలోని క్రీడా పర్యావరణ వ్యవస్థ అభివృద్ధికి ఆయన మద్దతుగా నిలు స్తారు.  అభిషేక్ తన విభిన్న స్పోర్ట్స్ పోర్ట్‌ ఫోలియోను విస్తరించడానికి, ముఖ్యంగా భారతదేశంలో హ్యాండ్‌ బాల్ కమ్యూనిటీ అభివృద్ధికి దోహదపడుతున్నారు. దీనితో, అభిషేక్ వాలీబాల్, బ్యాడ్మింటన్,  గోల్ఫ్ స్పో ర్ట్స్ లీగ్‌లలో తన మునుపటి క్రీడా పెట్టుబడులకు జోడింపును చేస్తున్నారు.

 ‘‘హ్యాండ్‌బాల్ ప్రపంచంలోకి ప్రవేశించడం, ఈ అద్భుతమైన అథ్లెట్లకు మద్దతు ఇవ్వడం నాకు చాలా ఆనం దంగా ఉంది’’ అని అభిషేక్ రెడ్డి కంకణాల అన్నారు. ‘‘హ్యాండ్‌బాల్ ఒక ఉత్తేజకరమైన, ఆకర్షణీయమైన క్రీడ. ఇది ముఖ్యంగా భారతదేశంలో జనాదరణ పొందేందుకు అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని నేను నమ్ముతున్నాను. ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్‌లో అత్యున్నత స్థాయిలో పోటీపడేలా తెలుగు టాలన్‌లను అభివృద్ధి చేయడానికి, జాతీయంగా, అంతర్జాతీయంగా హ్యాండ్‌బాల్ కమ్యూనిటీకి గర్వం, సాఫల్యం అందిం చేలా కొత్త భావనలను తీసుకురావడానికి నేను కట్టుబడి ఉన్నాను’’ అని అన్నారు.

ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్ ప్రారంభ సీజన్ జూన్ 8న ప్రారంభమై జూన్ 25, 2023 వరకు కొనసాగుతుంది. వయొకాం 18 (viacom18) నెట్‌వర్క్‌ లో, జియో సినిమా, స్పోర్ట్స్ 18-1 (HD & SD) మరియు స్పోర్ట్స్ 18 ఖేల్‌లో ప్రసారం కానున్నది. .

More Press Releases