సందర్శకులతో కిటకిట లాడుతున్న 125 అడుగుల ఎత్తైన డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహ ప్రాంతం

Related image

హైదరాబాద్, ఏప్రిల్ 15 : హైదరాబాద్ నెక్లెస్ రోడ్ పీవీ మార్గ్ లో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతిపెద్ద 125 అడుగుల డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని చూసేందుకు గాను భారీ సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. అంబేద్కర్ జయంతి రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించిన ఈ అతిపెద్ద విగ్రహాన్ని సందర్శించేందుకు హైదరాబాద్ నగరంతోపాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రంలోని ప్రజలు నేడు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. 

ఈ విగ్రహం లోపలి భాగంలో అంబేద్కర్ జీవిత విశేషాలు, రచనలు తెలిపే గ్రంధాలయం తదితర పనులు ఇంకా కోన సాగుతున్నందున సందర్శకులను ఎవరినీ లోపలి అనుమతించడంలేదు. దీనితో, బయటినుండే ఈ విగ్రహాన్ని చూసి తరిస్తున్నారు.

   

 ఈ విగ్రహాన్ని మలచిన తీరుకు ముగ్దులవుతున్నారు. ఇక ఈ సందర్శకులైతే ఫోటోలు, సెల్ఫీలతో సందడి చేస్తున్నారు. రాష్ట్రంలోని నలుమూలలనుండి పెద్ద ఎత్తున వివిధ సంఘాలు తమ ప్రతినిధి బృందంతో ఈ విగ్రహాన్ని చూసేందుకై తమ స్వంత రవాణా సదుపాయాలతో వస్తున్నారు. ముఖ్యంగా తమ కుటుంబ సభ్యులతో వచ్చి ప్రత్యేకంగా ఫోటోలు దిగుతున్నారు.
---------------------------------------------------------------------------------
శ్రీయుత కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్వా రిచే జారీ చేయనైనది.

More Press Releases