తెలంగాణలో జోరుగా జియో ట్రూ5జీ విస్తరణ

Related image

హైదరాబాద్, 13 ఏప్రిల్ 2023: రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను తెలంగాణ లోని మరో 14 నగరాల్లో లాంఛనంగా ప్రారంభించింది. కొత్తగా జియో 5జీ సేవలు కామారెడ్డి, మిర్యాలగూడ, పాల్వంచ, గద్వాల, ఆర్మూర్, సిరిసిల్ల, భువనగిరి, బోధన్, వనపర్తి, బెల్లంపల్లి, కాగజ్ నగర్, పెద్దపల్లి, కోరుట్ల, మందమర్రి నగరాల్లో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాయి.

తెలంగాణ వ్యాప్తంగా, ఇప్పటికే 19 నగరాల్లో…. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, రామగుండం, మంచిర్యాల, సిద్ధిపేట, సంగారెడ్డి, జగిత్యాల, కొత్తగూడెం, కోదాడ, తాండూర్, జహీరాబాద్, నిర్మల్, సూర్యాపేటలో రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. కొత్తగా ప్రారంభించిన 14 నగరాలతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33 నగరాల్లో జియో వినియోగదారులు 5జీ సేవ‌ల‌ను పొందవచ్చు.  ఈ ఏడాది చివరి నాటికి తెలంగాణ లోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి.

జియో ట్రూ 5జి సేవల ప్రారంభంతో తెలంగాణ ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ ను పొందడమే కాకుండా, ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటి మరియు ఎస్ఎమ్ఇ వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలకు తలుపులు తెరుస్తుంది.  జియో ట్రూ 5జి పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది. చిట్ట‌చివ‌రి అడుగు వ‌ర‌కు ప్రభుత్వ పథకాల అమలు సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.

ఈ సందర్భంగా జియో తెలంగాణ సీఈఓ కే సీ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ లో జియో ట్రూ 5జీని మరో 8 నగరాలకు విస్తరించడం పట్ల సంతోషంగా ఉంది. జియో ట్రూ 5జీ నెట్ వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుంది. జియో ఇంజనీర్లు ప్రతి భారతీయుడికి ట్రూ -5 జి ప్రయోజనాలను అందించడానికి 24 గంటలు పనిచేస్తున్నారు. అందువ‌ల్ల ఈ గ‌ణ‌నీయ‌మైన మార్పుకు ఉన్న శ‌క్తి, దాని అపార ప్ర‌యోజ‌నాల‌ను మ‌న దేశంలోని ప్ర‌తి పౌరుడు అనుభవించగలడు.  తెలంగాణ ను డిజిటలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన రాష్ట్ర ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము” అన్నారు. 

ఈ 14 నగరాల్లో జియో వినియోగదారులకు జియో వెల్కం ఆఫర్ ఆహ్వానం అందుతుంది. దీనిద్వారా వారు అదనపు ఖర్చు లేకుండా 1 జిబిపిఎస్ వేగంతో అపరిమిత డేటాను పొందవచ్చు. 

More Press Releases