దేశానికి మంచి భవిష్యత్తును అందించడానికి కాలేజ్‌దేఖో, గిన్నిస్ రికార్డ్ హోల్డర్‌ కలసి అడుగులు

Related image

●      భారతదేశ యువతకు మంచి భవిష్యత్తును కల్పించే లక్ష్యంతో సన్‌పెడల్ రైడ్ ద్వారా స్థిరమైన సామర్థ్యం  గురించి అవగాహన కల్పించే డ్రైవ్‌కు కాలేజ్ ధేఖో మద్దతు ఇస్తుంది.
 

●      సన్‌పైడల్ రైడ్‌ చొరవలో భాగంగా గిన్నీస్ బుక్  హోల్డర్ సుశీల్ రెడ్డి ఎలక్ట్రిక్ వాహనంపై కన్యాకుమారి నుంచి శ్రీనగర్‌ వరకు ప్రయాణం.

 
●      కాలేజ్ దేఖో సపోర్ట్‌తో  స్థిరమైన జీవనశైలిని అవలంబించడంపై విద్యార్థులను మోటివేట్ చేసే విధంగా  గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ సుశీల్ రెడ్డి  హైదరాబాద్‌లోని పలు కళాశాలల్లో సెమినార్లు నిర్వహణ.

 
బెంగళూరు: భారతదేశంలోనే అతిపెద్ద ఉన్నత విద్యా మార్గదర్శకత్వం, బలమైన సంస్థగా ఎదిగిన కాలేజ్ దేఖో స్థిరమైన సామర్థ్యం గురించి అవగాహన కల్పించే డ్రైవ్‌కు మద్దతు ఇస్తుంది. విద్యార్థుల మంచి భవిష్యత్తును ఇవ్వాలనే ఈ ప్రయత్నంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్ సుశీల్ రెడ్డికి కాలేజ్  దేఖో మద్దతు ఇస్తోంది. ఎలక్ట్రిక్ వాహనంపై కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు  5000 కిలోమీటర్లు ప్రయాణం సాగిస్తున్నారు. ప్రయాణంలో  దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతో ఆయన మాట్లాడుతున్నారు. అలాగే సుశీల్ రెడ్డి  కొందరు ప్రముఖులను కలుసుకున్నారు. హైదరాబాద్‌లోని ఐఐటీ-హైదరాబాద్, బిట్స్-పిలానీ, ఐఐఐటీ, ఐఐహెచ్‌ఎం వంటి కళాశాలల్లో ఆయన సెమినార్లు నిర్వహించారు. తన అనుభవాన్ని పంచుకోవడం, ఈ-మొబిలిటీ యొక్క ప్రాముఖ్యత, స్థిరమైనదానిని ఎంచుకోవడంపై ఆయన మాట్లాడారు. ఈ క్రమంలో కాలేజ్ దేఖో, సుశీల్ రెడ్డికి పూర్తి సపోర్ట్ అందిస్తుంది.

 
కాలేజ్‌దేఖో 2015లో ప్రపంచవ్యాప్తంగా విశ్వసనీయ విద్యార్థి మార్గదర్శక పర్యావరణ వ్యవస్థను రూపొందించాలనే లక్ష్యంతో ప్రారంభమైంది. అయితే కాలేజ్ దేఖో లక్ష్యం కేవలం యువతకు ఎడ్యుకేషన్‌కు సంబంధించి గైడెన్స్ ఇవ్వడమే కాదు. విద్య, పర్యావరణానికి మేలు చేసే స్థిరమైన విధానాల గురించి అవగాహన కల్పించడం కూడా కాలేజ్ దేఖో ధ్యేయం. భారతదేశానికి మంచి భవిష్యత్తును అందించడానికి విద్య, స్థిరత్వం ముఖ్యమైన స్తంభాలనేది కాలేజ్ దేఖో బలంగా నమ్ముతుంది.ఇందులో భాగంగానే  సన్‌పెడల్ రైడ్‌తో కలసి కాలేజ్ దేఖో విద్యార్థుల్లో పర్యావరణాన్ని మెరుగుపరచడానికి మరియు ఇంధన సంరక్షణను మెరుగుపరచడానికి విద్యార్ధులలో శక్తి సంరక్షణ పద్ధతుల గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలో  విశ్వవిద్యాలయాలు, కళాశాలలు మరియు చిన్న కమ్యూనిటీలలో సౌరశక్తి గురించి ముఖ్యమైన వాస్తవాలను తెలియజేయడం జరిగింది.

 
భారతదేశానికి మంచి భవిష్యత్తును అందించడానికి ఈ గొప్ప చొరవ గురించి కాలేజ్ దేఖో సీఈవో, సహ వ్యవస్థాపకుడు రుచిర్ అరోరా మాట్లాడారు. ఈ సందర్భంగా "కాలేజ్ దేఖో ఎల్లప్పుడూ మార్గదర్శకత్వంలో, సాధికారతలో ముందుంది. మంచి భవిష్యత్తు కోసం యువతను సిద్ధం చేయాలి. పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిరత, విద్యతో పాటు తర్వాత తరాన్ని ప్రభావితం చేసే రెండు కీలక అంశాలు. సుశీల్‌తో భాగస్వామ్యం దేశంలోని మన యువతలో పునరుత్పాదక శక్తిని మరియు స్థిరమైన ట్రాన్స్‌పోర్ట్‌ను ఉపయోగించుకునే విలువను పెంపొందించడానికి మాకు సహాయపడుతుంది. అదనంగా, EVలు మరియు గ్రీన్ టెక్నాలజీని స్వీకరించడం వల్ల ఈ రంగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగావకాశాల కోసం మార్గాలు పతాయి. మేము మా విద్యార్థులకు దీనికి సంబంధించిన కోర్సుల స్వభావం గురించి తెలియజేయడానికి, ఆ ఉద్యోగాల కోసం అవసరమైన నైపుణ్యాలను అభివృద్ధి చేయడంలో వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తాం." అని రుచిర్ అరోరా చెప్పారు.

 
ఈ సందర్భంగా సుశీల్ రెడ్డి తన స్పందన తెలియజేశారు.హైదరాబాద్‌లోని విద్యార్థుల నుంచి సానుకూల స్పందన రావడంతో సుశీల్ రెడ్డి మాట్లాడుతూ “సన్‌పెడల్ రైడ్ కోసం మరొక ప్రయాణాన్ని ప్రారంభించేందుకు, స్థిరమైన జీవన సందేశాన్ని వ్యాప్తి చేయడానికి నేను సంతోషిస్తున్నాను. పర్యావరణ అసలతుల్యత అనేది నిజమైన సమస్య, మనకు వీలైనంత ఎక్కువ మందికి అవగాహన కల్పించడానికి కాలేజ్‌దేఖో వంటి ఆలోచనాపరులైన భాగస్వాములను కలిగి ఉన్నందుకు మేము ఆనందపడుతున్నాం. మేము కాలేజ్ దేఖో యొక్క ప్రజాదరణను ప్రభావితం చేయడం, దాని గురించి అవగాహన పెంచడానికి దేశవ్యాప్తంగా విద్యార్థులను చేరుకోవడం లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశం కోసం పర్యావరణ పరిరక్షణ, మెరుగైన భవిష్యత్తుకు శక్తినిచ్చే ఈ గొప్ప మిషన్‌లో మాతో చేరమని వారిని మరింత ప్రోత్సహించండి." అని సుశీల్ రెడ్డి అన్నారు.

 
కాగా సుశీల్ రెడ్డి మార్చి 13న కన్యాకుమారి నుంచి ప్రయాణం ప్రారంభించి హైదరాబాద్ చేరుకున్నారు దారిలో పలు చోట్ల విద్యార్థులతో సమయం గడిపారు.అతని తదుపరి గమ్యం నాసిక్.

More Press Releases