టాటా ఐపీఎల్‌లో అగ్రగామిగా నిలువబోయే రెండు టీమ్‌లను ఎంచుకున్న స్టార్‌స్పోర్ట్స్‌ తెలుగు నిపుణులు

Related image

లీగ్‌ దశలో అగ్రగాములుగా నిలువబోయే రెండు టీమ్‌లుగా ఆర్‌ఆర్‌ (రాజస్తాన్‌ రాయల్స్‌) మరియు ఆర్‌సీబీ (రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు) నిలువనున్నాయని , పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానాలలో పీబీకెఎస్‌ మరియు కెకెఆర్‌ నిలువనున్నాయని తెలుగు కామెంటేటర్‌ వేణుగోపాల్‌ రావు అంచనా వేశారు. ఈ ఆంధ్రప్రదేశ్‌ మాజీ క్రికెటర్‌ తన దృష్టిలో రుతురాజ్‌ గైక్వాడ్‌ ఆరెంజ్‌ క్యాప్‌ అందుకుంటే , యజువేంద్ర చాహల్‌ పర్పుల్‌ క్యాప్‌ విజేతలుగా నిలుస్తారన్నారు.

అశీష్‌ రెడ్డి సైతం ఆర్‌ ఆర్‌ మరియు ఆర్‌సీబీలు లీగ్‌ దశలో అగ్రగామి రెండు జట్లుగా నిలువనున్నాయంటూనే డీసీ మరియు పీబీకెఎస్‌లు అట్టడుగు స్ధానంలో నిలిచే అవకాశాలున్నాయన్నారు. ఈ ఆంధ్రప్రదేశ్‌ మాజీ క్రికెటర్‌ గతంలో దక్కన్‌ చార్జర్స్‌ మరియు అనంతర కాలంలో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ తరపున ఐపీఎల్‌లో ఆడటం విశేషం. ఇతను ఈ ఐపీఎల్‌ సీజన్‌లో విరాట్‌ కోహ్లీ ఆరెంజ్‌ క్యాప్‌ అందుకుంటే, యజువేంద్ర చాహల్‌ పర్పుల్‌ క్యాప్‌ గెలుచుకునే అవకాశాలున్నాయన్నారు.

      కళ్యాణ్‌ కృష్ణన్‌ అంచనాల ప్రకారం జీటీ మరియు ఎస్‌ఆర్‌హెచ్‌లు లీగ్‌ దశలో అగ్రగామి రెండు జట్లుగా నిలువనున్నాయి. ఈ జాబితాలో అట్టడుగు స్ధానాల్లో ఎంఐ, కెకెఆర్‌ నిలిచే అవకాశాలున్నాయన్నారు. ఆరెంజ్‌ క్యాప్‌ కోసం ఇతను శుభ్‌మన్‌ గిల్‌ను ఎంపిక చేస్తే, యజువేంద్ర చాహల్‌ తన దృష్టిలో పర్పుల్‌ క్యాప్‌ అందుకుంటాడని భావిస్తున్నానన్నారు.

     టి.సుమన్‌ మాట్లాడుతూ టాటా ఐపీఎల్‌ 2023 లీగ్‌ దశలో ఆర్‌ఆర్‌ మరియు ఎస్‌ఆర్‌హెచ్‌లు నిలువనున్నాయని అంచనా వేశారు. ఈ జాబితాలో అట్టడుగు స్థానాల్లో కెకెఆర్‌ మరియు పీబీకెఎస్‌ నిలిచే అవకాశాలున్నాయని అంచనా వేశారు. సుమన్‌ అంచనా ప్రకారం ఆరెంజ్‌ క్యాప్‌ను శుభ్‌మన్‌ గిల్‌ అందుకుంటే, పర్పుల్‌ క్యాప్‌ను యజువేంద్ర చాహల్‌ అందుకోవచ్చు.

     

More Press Releases