హైదరాబాద్ కు చెందిన టెక్ స్టార్టప్ క్విక్సీ దుబాయ్ లో అడుగుపెట్టింది... సీడ్ గ్రూప్ తో భాగస్వామ్యం

Related image

హైదరాబాద్‌, 05 ఏప్రిల్‌ 2023 : షేక్‌ సయీద్‌ బిన్‌ అహ్మద్‌ అల్‌ మక్తూమ్‌ ప్రైవేట్‌ ఆఫీస్‌ కంపెనీ సీడ్‌ గ్రూప్‌ ఇప్పుడు  ఇండియా కేంద్రంగా కలిగిన నో–కోడ్‌  లో–కోడ్‌ ప్లాట్‌ఫామ్‌ క్విక్సీతో వ్యూహాత్మక భాగస్వామ్యం చేసుకున్నట్లు వెల్లడించింది.  ఈ భాగస్వామ్యం ద్వారా యుఏఈ మరియు మిడిల్‌ ఈస్ట్‌లో ఎంటర్‌ప్రైజ్‌ సొల్యూషన్‌ నిర్మాణాన్ని సరళీకృతం చేయడం లక్ష్యంగా చేసుకున్నారు.

హైదరాబాద్‌  కేంద్రంగా కలిగిన స్టార్టప్‌ వినూత్నమైన నో కోడ్‌, లో–కోడ్‌ విధానంతో వ్యాపారాలు తగిన పరిష్కారాలను , అప్లికేషన్‌లను ఎలాంటి కోడ్‌ రాయకుండా 10 రెట్ల వేగంతో నిర్మించుకోవడంలో  సహాయపడుతుంది. ఈ సంస్థ, గత కొద్ది కాలంగా ఎన్నో వ్యాపార సంస్ధలకు సహాయపడటంతో పాటుగా మారుతున్న ప్రస్తుత వ్యాపార వాతావరణంలో  మరింత ధృడంగా అవి మారేందుకు, వేగవంతంగా మార్కెట్‌కు వచ్చేందుకు వర్క్‌ ఫ్లో సామర్ధ్యం మెరుగుపరచడం, అతి తక్కువ డెవలప్‌మెంట్‌ వ్యయాలు, ఆవిష్కరణలను మెరుగుపరచడం, ఐటీ మరియు వ్యాపార వినియోగ భాగస్వామ్యాలను స్వీకరించడం చేస్తుంది.

వ్యూహాత్మక భాగస్వామిగా , సీడ్‌ గ్రూప్‌ ఇప్పుడు క్విక్సీతో కలిసి పనిచేయడంతో పాటుగా సరైన ఆడియన్స్‌కు చేరువవుతూనే ప్రభుత్వం, ప్రైవేట్‌ రంగంలో అగ్రగామి విధాన నిర్ణేతలను చేరుకోవడం,  దుబాయ్‌లో సాంకేతిక ఆవిష్కరణ ల్యాండ్‌స్కేప్‌ను బలోపేతం చేయడంలో తోడ్పాటునందించడం చేస్తుంది.

సీడ్‌ గ్రూప్‌ మరియు ప్రైవేట్‌ ఆఫీస్‌ ఆఫ్‌ షేక్‌ సయీద్‌ బిన్‌ అహ్మద్‌ అల్‌ మక్తూమ్‌ సీఈఓ  హిషమ్‌ అల్‌ గర్గ్‌ మాట్లాడుతూ ‘‘ఎన్నో రకాలుగా ఇది అతి ముఖ్యమైన భాగస్వామ్యం.  ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం, క్విక్సీ తమ వినూత్నమైన నో కోడ్‌, లో కోడ్‌ ప్లాట్‌ఫామ్‌ను ఈ ప్రాంతంలోని వ్యాపారాలకు తీసుకురావడానికి అనుమతిస్తుంది.  అంతేకాకుండా , ఇది  ఆన్‌లైన్‌ సేవలను సులభంగా మరియు సౌకర్యవంతంగా అందించడం ద్వారా వినూత్నమైన కార్పోరేట్‌ ల్యాండ్‌స్కేప్‌ను శక్తివంతం చేయడంలోనూ సహాయపడుతుంది.  క్విక్సీ సేవలు, సంస్థలను మరింత సమర్థవంతంగా మరియు  ప్రభావవంతంగా చేసే ప్రక్రియలు  మరియు వర్క్‌ఫ్లోలను క్రమబద్ధీకరించడానికి రూపొందించబడ్డాయి. ఈ భాగస్వామ్యం యొక్క సంభావ్యతను మరియు అవి మా వినియోగదారులకు అందించే ప్రయోజనాలను ఆసక్తిగా పరిశీలించడానికి ఎదురుచూస్తున్నాము’’ అని అన్నారు.

ఈ మార్కెట్‌ పట్ల క్విక్సీ లక్ష్యం మరియు దీనిని  సాధ్యం చేసేందుకు చేసుకున్న వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి క్విక్సీ సీఈఓ–ఫౌండర్‌ శ్రీ గౌతమ్‌ నిమ్మగడ్డ మాట్లాడుతూ ‘‘ గత రెండు దశాబ్దాలుగా మిడిల్‌ ఈస్ట్‌ ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను సైతం అధిగమిస్తూ ఆవిష్కరణలు మరియు ఆధునిక సాంకేతికత  కోసం కేంద్రంగా నిలుస్తుంది. మరీ ముఖ్యంగా ఈ విప్లవానికి దుబాయ్‌ అత్యంత కీలకంగా మారింది. క్విక్సీ యొక్క మార్కెట్‌ అధ్యయనాలు వెల్లడించే దాని ప్రకారం, ఈ ప్రాంతంలోని  ముందుచూపు ఆలోచనలు కలిగిన నాయకత్వ బృందం అసలైన డిజిటల్‌ వ్యాపార పర్యావరణ వ్యవస్ధను నడిపిస్తుంది మరియు క్విక్సీ వద్ద మేము వ్యాపారాలు పూర్తిగా మరియు వాస్తవంగా డిజిటల్‌గా మారడంలో  కీలకపాత్ర  పోషించాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. మా తరువాత దశ వృద్ధికి నేతృత్వం వహించేందుకు  దుబాయ్‌ అత్యంత అనువైన ప్రాంతమని మేము నమ్ముతున్నాము.  సీడ్‌ గ్రూప్‌ యొక్క విస్తృత స్ధాయి వ్యాపార అనుభవం తో పాటుగా మార్కెట్‌కు సాంకేతిక కంపెనీలను సమర్థవంతంగా పరిచయం చేసిన మహోన్నత చరిత్ర  కూడా తోడు కావడంతో, వారు ఈ ప్రాంతంలో క్విక్సీ స్థాపన మరియు వృద్ధిని వేగవంతం చేయగలరని మేము విశ్వసిస్తున్నాము’’ అని అన్నారు.

పరిశ్రమలో ఆజ్ఞేయవాద వేదిక క్విక్సీ. తద్వారా పరిశ్రమ తమ సాంకేతికతను ఉపయోగించుకుని  ఎలాంటి ఫంక్షన్‌ అయినా డిజిటలైజ్‌ చేయడానికి తోడ్పడుతుంది. క్విక్సీ ఇప్పుడు 15కు పైగా పరిశ్రమలతో కలిసి పనిచేస్తుంది. అవి తమ విధులను అతి చురుకైన మరియు అత్యంత ఖర్చుతో కూడుకున్న రీతిలో డిజిటలైజ్‌  చేయడానికి  విప్లవాత్మక సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. ఈ కంపెనీ ప్రభుత్వ మరియు ప్రైవేట్‌ కంపెనీలతో కలిసి చేసిన తమ కార్యకలాపాలతో గుర్తించబడింది. వారి వ్యాపార  ప్రక్రియలను సరళీకృతం చేయడంలోనూ వీరికి సహాయం చేస్తుంది. విజువల్‌ ఇంటర్‌ఫేజ్‌తో సాఫ్ట్‌వేర్‌ సృష్టించడంలో సహాయపడే  అతి సరళమైన డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ డిజైన్‌ను ఈ ప్లాట్‌ఫామ్‌ అమలు చేస్తుంది.

సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, ఆతిథ్యం మరియు టెలికమ్యూనికేషన్‌ ల్యాండ్‌ స్కేప్‌లో ఓ ప్రముఖ సంస్థగా సీడ్‌ గ్రూప్‌ గుర్తింపు పొందింది. గత 16 సంవత్సరాలుగా, గల్ఫ్‌ కో ఆపరేషన్‌ కౌన్సిల్‌ దేశాలలో స్థిరమైన మార్కెట్‌ ప్రవేశం మరియు ఉనికిని వేగవంతం చేయడానికి విభిన్న ప్రాంతాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రముఖ ప్రపంచ కంపెనీలతో విజయవంతమైన వ్యూహాత్మక పొత్తులను ఏర్చరిచింది.

More Press Releases