అందరికి సంపూర్ణ ఆరోగ్యమే... తెలంగాణ ప్రభుత్వ సంకల్పం

Related image

• ప్రజల ముంగిటకే ప్రాధమిక వైద్యం....
• కంటి వెలుగు కార్యక్రమంలో ఇప్పటి వరకు 63 లక్షల 82 వేల మందికి కంటి పరీక్షలు చేసారు. 11లక్షల 40 వేల మందికి రీడింగ్ గ్లాసెస్ ఉచితంగా అందించారు.
ప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత :
సర్వజనుల ఆరోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు కంటి వెలుగు పథకాన్ని తెచ్చింది. ఈపథకాన్ని జనవరి 19 నుంచి జూన్ 15 వరకు 100 రోజుల కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పలు శాఖల అధికారులతో కలిసి శిబిరాల నిర్వహణకు ముందుగానే ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు ప్రణాళికలతో, నిరంతర పర్యవేక్షణ, రోజువారి సమీక్షలు, విశ్లేషణ, వీడియో కాన్ఫరెన్స్, సమావేశాలతో ఎప్పటికప్పుడు లోటుపాట్లు సవరించుకుంటూ కంటి వెలుగు కార్యక్రమాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు.

    
అందత్వరహిత తెలంగాణ లక్ష్యంగా నిర్వహించిన ‘‘కంటి వెలుగు’కార్యక్రమం కింద ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 63లక్షల 82 వేల 201 మందికి కంటి పరీక్షలు చేసి దృష్టి లోపం ఉన్న 11 లక్షల 40 వేల మందికి ఉచితంగా కళ్లద్దాలు, మెడిసిన్స్ఇ వ్వడం జరిగింది. ప్రభుత్వ వైద్యంతో పేద మధ్యతరగతి కుటుంబాలకు వేలాది రూపాయలు ఆదా అవుతున్నాయి. దగ్గరిచూపు సమస్యలే అధికం...... అన్ని జిల్లాలో అత్యధికంగా దగ్గరిచూపు కనిపించక ఇబ్బందిపడే వారే అధికంగా ఉన్నట్లు శిబిరాలలో నమోదవుతున్న లెక్కలు చెబుతున్నాయి. 40 ఏళ్ల వయస్సు పైబడిన చాలామందికి దగ్గర చూపు కనిపించడం లేదని శిబిరానికి వస్తున్నారు. ఇలాంటి వారికి తక్షణమే రీడింగ్ గ్లాసెస్ అందజేస్తున్నారు. ఇవి కాకుండా కంటి సమస్యలతో వస్తున్న చాలా మందికి చుక్కల మందులతో పాటు విటమిన్ ఏ, డీ, బీకాంప్లెక్స్టా బ్లెట్లు పంపిణీ చేస్తున్నారు. 50 ఏళ్లు పైబడిన వారు అత్యధికంగా మోతబిందు (కాటరాక్ట్) సమస్యతో బాధపడుతున్నారు. శస్త్ర చికిత్స అవసరమైన వారికి చికిత్స చేసే సమయాన్ని చరవాణి ద్వారా సమాచారం చేరవేస్తున్నామని వైద్య సిబ్బంది చెబుతున్నారు. ఇదివరకే శస్త్ర చికిత్స పూర్తయి ఇతర సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యులు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ముందుచూపుతో అందరికి అభివృద్ధి, సంక్షేమఫలాలు అందించుటకు ప్రభుత్వం చేస్తున్న కృషి మంచి ఫలితాలను ఇస్తున్నది. అదే స్ఫూర్తితో ఆరోగ్య కుటుంబ సంక్షేమ పధకాలు అమలులో ముందున్న రాష్ట్రం ఆరోగ్య తెలంగాణగా రూపుదిద్దుకుంటున్నది.
-

More Press Releases