భారత దేశవ్యాప్తంగా మూడు నగరాలలో 150కు పైగా చేతక్‌ వాహనాల డెలివరీ

Related image

హైదరాబాద్‌, 15 ఫిబ్రవరి 2023 : ఎక్కువ మంది అభిమానించే చేతక్‌ బ్రాండ్‌, పూనె మరియు నాగ్‌పూర్‌లలో అమ్మకాల పరంగా ఘనవిజయం సాధించిన తరువాత మరో మారు రికార్డులను బద్దలుకొడుతూ తమ వినియోగదారులకు చేసిన వాగ్థానాన్ని నిలుపుకుంటూనే ఒకే రోజు హైదరాబాద్‌, ఔరంగాబాద్‌, అహ్మదాబాద్‌లలో 150కు పైగావాహనాలను డెలివరీ చేసి రికార్డు సృష్టించింది. ఈ మహోన్నత క్షణాలకు గుర్తుగా మరియు విద్యుతీకరించిన భవిష్యత్‌ లక్ష్యంతో , చేతక్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ ఒక ఉత్సాహపూరిత కార్యక్రమాన్ని నిర్వహించింది. దీనిద్వారా పరివర్తన మరియు హరిత భవిష్యత్‌ దిశగా మారేందుకు కట్టుబడిన నూతన స్కూటర్‌ యజమానులతో వేడుక చేసింది. 


ఈ కార్యక్రమాన్ని ‘సెలబ్రేట్‌ విత్‌ చేతక్‌’ శీర్షికన నిర్వహించారు. బహుళ నగరాలలో ఇవే తరహా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా , వాహనాలను పెద్ద సంఖ్యలో డెలివరీ చేసిన మైలురాయిని వేడుక చేస్తుంది. ఒక బ్రాండ్‌గా, చేతక్‌ విజయవంతంగా 50 కు పైగా నగరాలకు విస్తరించింది మరియు 35వేలకు పైగా విద్యుత్‌ స్కూటర్లు భారతీయ రోడ్ల పై తిరుగుతున్నాయి.ఇది స్పష్టంగా ఈవీల కోసం వినియోగదారు ల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను సూచిస్తుంది. చారిత్రాత్మకంగా దీని రాజీలేని శక్తి మరియు మన్నికైన ఫీచర్లకు సుప్రసిద్ధమైన చేతక్‌, స్థిరంగా హృదయాలను గెలుచుకుంటూనే ఉంది. చేతక్‌లో ఐపీ 67 రేటెడ్‌ హై –టెక్‌ లిథియం అయాన్‌ బ్యాటరీ ఉంది. దీనిని ఇళ్లలో సాధారణంగా కనిపించే 5 యాంప్‌ ఎలక్ట్రిక్‌ ఔట్‌లెట్‌ వినియోగించి చార్జ్‌ చేయవచ్చు. ఆన్‌బోర్డ్‌ ఇంటిలిజెంట్‌ బ్యాటరీ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐబీఎంఎస్‌) చార్జ్‌ మరియు డిశ్చార్జ్‌ను నిరంతరాయంగా
నియంత్రిస్తుంది. చేతక్‌ కోసం కనెక్టివిటీ సూట్‌లో ఓవర్‌ ద ఎయిర్‌ (ఓటీఏ) సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్‌, బ్లూటూత్‌, మ్యూజిక్‌ మార్పులు మరియు మరెన్నో ఉన్నాయి.


చేతక్‌ ను సొంతం చేసుకున్న ఒక నూతన యజమాని మాట్లాడుతూ ‘‘చేతక్‌ను సొంతం చేసుకోవడం పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ బ్రాండ్‌ ఎప్పుడూ కూడా సాటిలేని మన్నిక, విశ్వసనీయతను తరతరాలుగా భారతీయులకు అందిస్తుంది. ఈ నూతన విద్యుత్‌ వేరియంట్‌ నాకు మొబిలిటీ పరిష్కారాలను అందించడంతో పాటుగా ప్రయాణ ఖర్చును సైతం గణనీయంగా తగ్గిస్తుంది. అంతేకాదు హరిత విప్లవంలో నేను కూడా భాగమయ్యాయనన్న సంతృప్తిని సైతం అందిస్తుంది. చేతక్‌ యజమానిగా, ఈవీ రంగంలో భారతీయ వృద్ధి ప్రయాణంలో భాగం కావడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాను’’ అని అన్నారు.

ఈ సందర్భంగా చేతక్‌ టెక్నాలజీస్‌ లిమిటెడ్‌, అధ్యక్షుడు (అర్బనైట్‌ బిజినెస్‌) శ్రీ ఎరిక్‌ వాస్‌ మాట్లాడుతూ ‘‘శక్తివంతమైన వారసత్వం మరియు విప్లవాత్మక సాంకేతికతలతో, ఈవీ స్వీకరణ పరంగా పలు అవరోధాలను అధిగమించడంతో పాటుగా వినియోగదారులకు ప్రభావవంతమైన పరిష్కారాలను అందిస్తున్నాము. మూడు నగరాల్లో 150కు పైగా వాహనాలను డెలివరీ చేయడమనేది భారతీయుల హృదయాలలో చేతక్‌ ఏ విధంగా ప్రతిధ్వనిస్తున్నదీ వెల్లడిస్తుంది. విద్యుత్‌ మొబిలిటీని ప్రజాస్వామ్యీకరించడం ద్వారా మా చేతక్‌ కుటుంబాన్ని మరింత శక్తివంతం చేయనున్నాము’’ అని అన్నారు.


చేతక్‌ వాహనాలు ఈ దిగువ అత్యంత ఉత్సాహపూరితమైన ఫీచర్లు కలిగి ఉంది :

 నాలుగు గంటల్లో పూర్తిగా చార్జ్‌ (100%) అవుతుంది. ఒకసారి పూర్తిగా చార్జ్‌ అయితే 90కిలోమీటర్లు పైగా ఎకో మోడ్‌లో ప్రయాణిస్తుంది (ఏఐఎస్‌ 040 ప్రకారం ఐడీసీ కింద)
 మెటల్‌ బాడీతో ఉన్న ఒకే ఒక్క హై స్పీడ్‌ విద్యుత్‌ ద్వి చక్ర వాహనం. చూడగానే ఆకట్టుకునే విలాసవంతమైన ఫిట్టెడ్‌ ప్యానెల్స్‌. ఇతర సుప్రసిద్ధ ఫీచర్లులో ఐపీ 67 వాటర్‌ రెసిస్టెన్స్‌ రేటింగ్‌ మరియు బెల్ట్‌లెస్‌ సాలిడ్‌ గేర్‌డ్రైవ్‌
 మూడు రైడింగ్‌ మోడ్స్‌ (రివర్స్‌ మోడ్‌) దీనితో రైడర్‌ ట్రాఫిక్‌ను అతి సులభంగా నేవిగేట్‌ చేయవచ్చు.
 ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్‌తో పాటుగా ఇంటిగ్రేటెడ్‌ హార్శ్‌ షూ– ఆకృతి డీఆర్‌ఎల్‌లు , సీక్వెన్షియల్‌ ఎల్‌ఈడీ బ్లింకర్స్‌ అన్ని వేళలా సవారీ చేసేందుకు తోడ్పడుతుంది.
 చేతక్‌ యాప్‌, డాటాతో అనుసంధానించడం వల్ల యజమానులు అధీకృతం కాని యాక్సెస్‌ లేదా యాక్సిడెంట్‌ అయిన ఎడల నోటిఫికేషన్లు అందుకోగలరు. చేతక్‌ను ఎక్కువ మంది అభిమానించేందుకు ప్రధాన కారణం ఇది నిశ్శబ్దంగా ఉండటంతో పాటుగా స్వచ్ఛమైన, సౌకర్యవంతమైన సవారీని మెరుగైనప్పటికీ, ధృడమైన డిజైన్‌తో అందిస్తుంది. హరిత మరియు స్వచ్ఛమైన రేపటి కోసం నిర్మించబడిన ఈ విద్యుత్‌ స్కూటర్‌కు అతి తక్కువ నిర్వహణ అవసరం పడతుంది. దీని సర్వీస్‌ వ్యవధి 6 వేల కిలోమీటర్లు లేదా ఆరు నెలలు (ఏది ముందు అయితే అది) బ్యాటరీ వారెంటీ మూడు సంవత్సరాలు లేదా 50వేల కిలోమీటర్లు (ఏది ముందు అయితే అది) ఈ స్కూటర్‌ ధర 1,40,561 రూపాయలు (ఎక్స్‌ షోరూమ్‌ , పూనె). చేతక్‌ వాహనాలు నాలుగు ఆకర్షణీయమైన
రంగులు – ఇండిగో మెటాలిక్‌, వెలుట్టో రోస్సో, బ్రూక్లిన్‌ బ్లాక్‌ మరియు హాజెల్‌నట్‌లో లభిస్తుంది. చేతక్‌ డీలర్‌షిప్‌ల

వద్ద టెస్ట్‌ రైడ్స్‌ కోసం లభ్యమవుతాయి. వినియోగదారులు ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ను ఠీఠీఠీ.ఛిజ్ఛ్ట్చిజు.ఛిౌఝ వద్ద చేసుకోవడం ద్వారా సులభమైన, సౌకర్యవంతమైన అనుభవాలను పొందగలరు.

More Press Releases