కార్తీ, రాశీ ఖన్నా నటించిన యాక్షన్​ ఎంటర్​టైనర్​ సర్దార్​, ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో!

Related image

హైదరాబాద్, 22 ఫిబ్రవరి, 2023: తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో తిరుగులేని ఛానల్ జీ తెలుగు. సరికొత్త మలుపులు, అలరించే కాన్సెప్టులతో ఫిక్షన్, నాన్ ఫిక్షన్ షోలతోపాటు వారం వారం బ్లాక్బస్టర్సి నిమాలు అందిస్తూ ప్రేక్షకులను వినోదాన్ని పంచుతున్న జీ తెలుగు మరో సూపర్ హిట్  సినిమా సర్దార్తో మీ ముందుకు రాబోతోంది. హీరో కార్తీ డబుల్ రోల్లో మెప్పించిన యాక్షన్ ఎంటర్టైనర్స ర్దార్ ఫిబ్రవరి 26, ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు మీ జీ తెలుగులో ప్రసారం కానుంది. కార్తీ ద్విపాత్రాభి  నయంతో తమిళ మాతృకగా రూపొందిన సర్దార్ తెలుగులోనూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. 

సందేశాత్మక చిత్రంగా తెరకెక్కిన సర్దార్ నీటి ప్రాధాన్యం తెలిపే అంశంతో ముడిపడిన కథ. నీటి నిర్వహణను ప్రైవేటీకరణం చేయడం వల్ల జరిగే నష్టాలు ఏంటి? సమస్త జీవకోటికి ప్రాణాధారమైన నీటిని కొంతమంది స్వార్థపరులు తమ గుప్పెట్లో పెట్టుకుంటే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే అంశాన్ని ఓ గూఢచారి కథతో ముడిపెట్టి చూపించాడు దర్శకుడు పీఎస్ మిత్రన్. పైప్లైన్ పేరుతో భారతదేశ నీటిని తన గుప్పిట్లో పెట్టుకోవాలనుకున్న ఓ బడా వ్యాపారవేత్త ప్రయత్నాన్ని.. దేశద్రోహిగా అజ్ఞాతంలో జీవిస్తున్న ఓ వ్యక్తి ఎలా అడ్డుకున్నాడు అనేదే సర్దార్ కథ. యువకుడిగా, మధ్య వయస్కుడిగా డ్యుయల్ రోల్లో కార్తి నటనతోపాటు, రాశీ ఖన్నా, రజీశా విజయన్, చంకీ పాండే, లైలా నటించిన కీలక పాత్రలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, అద్భుతమైన బాక్గ్రౌండ్మ్యూ జిక్ మరియు కట్టిపడేసే స్క్రీన్ ప్లే ప్రేక్షకులకు ఒక థ్రిల్లింగ్ అనుభూతిని డం కలిగించడం ఖాయం.

ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు యాక్షన్ఎం టర్టైనర్ సర్దార్ జీ తెలుగు ప్రీమియర్గా ప్రసారం కానుంది. తప్పక వీక్షించండి, మీ అభిమాన ఛానల్జీ  తెలుగులో

More Press Releases