కన్హ శాంతి వనం వద్ద 6 రోజుల ధ్యాన్ యోగా కార్యక్రమం నిర్వహించనున్నఓషోధార నానక్ ధామ

Related image

హైదరాబాద్, 20 ఫిబ్రవరి, 2023: హైదరాబాద్ శివార్లలోని మల్లాపూర్ చేగూర్ గ్రామం వద్ద కన్హ శాంతి వ నం వద్ద ఓషోధార నానక్ ధామ్, ముర్తాల్ (ఓఎన్ డిఎం) చే 6 రోజుల యోగా, ధ్యానం కార్యక్రమం ‘ధ్యాన్ యోగ’ నిర్వహించబడుతోంది.

మాస్టర్ సమర్థ్ గురు సిద్ధార్థ్ ఔలియా మార్గదర్శకత్వంలో ఈ కార్యక్రమం నిర్వహించబడనుంది. కీర్తన్ సంధ్య, సమానత విగ్రహ సందర్శన (ముచ్చింతల్ వద్ద స్వామి రామానుజ విగ్రహం), దాజీ  (ప్రఖ్యాత ధ్యా న మరీ ముఖ్యంగా హార్ట్ ఫుల్ నెస్ గురువు కమలేశ్ పటేల్) తో సమావేశం ఉంటాయి.

ఫిబ్రవరి 20-25 వరకు జరిగే ఈ ధ్యాన యోగ (మెడిటేటివ్ లివింగ్) కార్యక్రమం అనేది రైట్ మైండ్ ఫుట్ నెస్ కార్యక్రమానికి సన్నద్ధ కార్యక్రమం. కన్హ శాంతి వనం  ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రాన్ని కలిగి ఉంది. కార్య క్రమంలో మొదటి మూడు రోజులు ఫిబ్రవరి 20-22 వరకు  జరిగే వాటిలో ఆనంద్ ప్రజ్ఞ (బ్లిస్ ఫుల్ లివింగ్) కూ డా ఉంటుంది. ఇది భగవాన్ బుద్ధ యొక్క అష్టాంగమార్గంపై ఆధారపడి ఉంటుంది. ఒత్తిడి, సంబంధాలు, విసుగు లాంటి వాటికి సంబంధించిన పలు సమస్యలను అది పరిష్కరిస్తుంది.

ఈ కార్యక్రమం చివరి మూడు రోజులు అంటే ఫిబ్రవరి 23-25 లలో యోగ ప్రజ్ఞ లేదా డివైన్ లివింగ్ ఉం టుంది. ఇది యోగా లోని వివిధ మార్గాలను బోధిస్తుంది. ఇందులో పాల్గొనే వారు దివ్యశబ్దం (ఓంకారం) వింటారు. ధ్యా నంలో సమాధి స్థితి టెక్నిక్స్, దివ్య స్మరణ గురించి తెలుసుకోగలుగుతారు.

ఇందులో పాల్గొనే వారు ధ్యానంతో పాటుగా యోగా కూడా నేర్చుకోగలుగుతారు. ఈ కార్యక్రమం వారు తమ ఒ త్తిడితో కూడుకున్న జీవితాన్ని నిర్వహించుకోవడంలో తోడ్పడుతుంది. ప్రశాంతంగా జీవించేందుకు సహకరి స్తుంది. కోరకున్న వారికి నియో- సన్యాస దీక్ష కూడా ఇస్తారు.

ఓఎన్ డీఎం అనేది ఆధ్యాత్మిక – శాస్త్రీయ సంస్థ. సనాతన ధర్మం యొక్క ఆధ్యాత్మికతను, శాస్త్రీయతను వెల్ల డించి, వివరించే మరియు వివిధ కార్యక్రమాల ద్వారా ప్రతీ ఒక్కరిని సంతోషంగా ఉంచే కార్యాచరణను ఈ సంస్థ చేపట్టింది.

      ఓషోధార అనేది ప్రయోగాత్మక, మార్మిక అభ్యసన కేంద్రం. సమర్థగురు మార్గదర్శకంలో ఇది నడుస్తోంది. ఆధ్యాత్మిక శాస్గ్రీయతను ప్రపంచానికి బహుకరించిన ఆధ్యాత్మిక ప్రవాహం ఇది ఒక్కటే. ఎవరూ ఊహించ ని విధంగా ఇది ఆధ్యాత్మికతను సైన్స్ కిందకు మార్చింది.

ఓషోధార అనేది ప్రపంచంలోని అత్యుత్తమ ఆధ్యాత్మికతను అందిస్తుంది. భారతదేశంతో పాటుగా ప్రపంచం లోని వైవిధ్యభరిత ఆధ్యాత్మికతల నుంచి అత్యుత్తమ విధానాల సమ్మేళన ఫలితం ఇది. జ్ఞాన యోగ, భక్తి యోగ, కర్మ యోగ మిళితంగా ఉంటుంది. ఈ మూడింటి సమ్మేళనమే ‘సహజ యోగ’గా పేరొందింది. ఈ స హజ యోగలో అత్యంత సులభమైన, అత్యుత్తమమైన ఆధ్యాత్మిక మార్గమే ఓషోధారలో అందించే ఆధ్యా త్మిక ఆచరణ పునాది.

ఓఎన్ డిఎం ప్రకారం, ఓషో ధార ఆధ్యాత్మికతకు సంబంధించి ఆచరణాత్మక రోడ్ మ్యాప్ ను అందిస్తుంది. సరైన మార్గదర్శకత్వంలో ఆధ్యాత్మికత మార్గంలో ముందుకు వెళ్లుతున్న కొద్దీ వివిధ స్థాయిల్లో నిర్దిష్ట ఆధ్యాత్మిక మైలురాళ్లను స్వయంగా అనుభూతి చెందేలా ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి.

ఓషోధార నానక్ ధామ్ గురించి: ఓషోధార అనేది, 20వ శతాబ్ది అతిగొప్ప ఆధ్యాత్మిక గురువుగా, మాస్టర్ ఆఫ్ మాస్టర్ గా పేరొందిన ఓషో యొక్క ఏకైక ‘లైవ్ ’ స్పిరిట్యువల్ స్ట్రీమ్. ఇక్కడ ‘లైవ్’ అనే పదం గురు శిష్య సంప్రదాయాన్ని సూచిస్తుంది. గురువు మార్గదర్శకత్వంలో శిష్యుడు ఆధ్యాత్మిక మార్గంలో పయనిం చడం ఓషోధార లో కీలకంగా ఉంటుంది. ఈ మార్మిక అభ్యసన కేంద్రం ‘ఆధ్యాత్మిక శాస్త్రవేత్త’గా అభివర్ణించే సమర్థగురు సిద్ధార్థ ఔలియా చే స్థాపించబడింది. ఓషోధార నానక్ ధామ్ అనేది హర్యానాలోని సోనాపట్ ముర్తాల్ కేంద్రంగా పని చేస్తోంది.


More Press Releases