సర్వాయిపేట కోటను పర్యాటకంగా అభివృద్ది చేస్తాం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

Related image

బడుగు బలహీన వర్గాల వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 360 సంవత్సరాల క్రీతం ఖిలాషా పురం రాజ్యంగా రాజ్యస్థాపన చేసి తెలంగాణ ప్రాంతంలో సుమారు 32 కోటలను జయించిన మహాయోధుడు, సర్వాయి పేట ను కేంద్రంగా చేసుకోని రాజ్యవిస్తరణ చేసి అనేక కోటలు, చేరువులు నిర్మించిన గోప్ప పరిపాలన దక్షుడి చారిత్రక ప్రదేశాలు నేడు మైనింగ్ మాఫియా వల్ల విద్వంసానికి గురవుతున్నాయని వాటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని గౌడ ఐక్యవేదిక , సర్థార్ సర్వాయి పాపన్నగౌడ్  ఐక్య వేదిక నాయకుల తో పాటు రాష్ట్ర గౌడ 9 ఐక్యసంఘాల నాయకులు రాష్ట్ర అబ్కారి, క్రీడా, పురావస్తూ శాఖ, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ను సచివాలయంలో కలసి సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన చారిత్రక కోట నేడు కరీంనగర్ జిల్లా లోని సైదాపూర్ మండలం సర్వాయిపేటలోని చారిత్రక కోటను మైనింగ్ మాఫియా నుండి సంరక్షించాలని కోరారు.

గౌడ ఐక్య సంఘాల నాయకుల విజ్జ్ఞప్తి మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తక్షణం స్పందించారు. సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన చారిత్రక కోటలు, చెరువులు, చారిత్రక ప్రాంతాల సంరక్షణకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే చర్యలు చేపట్టారని అందులో భాగంగా సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన కోటలు ఖిలాషాపురం, జాఫర్ ఘడ్, భువనగిరి కోటల సంరక్షణకు తెలంగాణ రాష్ట్రం ఎర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ మంత్రిగా కోట్లాది రూపాయలను కేటాయించి, అనేక చారిత్రక ప్రాంతాల సంరక్షణకు చర్యలు చేపట్టారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గౌడ ఐక్య సంఘాల నాయకులకు తెలిపారు. పర్యాటకంగా అభివృద్ది చేస్తున్నామన్నారు. ఇప్పటికే  చారిత్రక ప్రాంతాల  అభివృద్దిపై సమీక్షలు నిర్వహించామని పేర్కోన్నారు.

గతంలో కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం సర్వాయిపేటలోని సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ చారిత్రక కోటపై మైనింగ్ జరపటాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు అప్పటి పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్, నాటి ఆర్థిక శాఖ మంత్రి, ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, శాసన సభ్యులు సతీష్ బాబులు వెంటనే స్పందించి 2014లో మైనింగ్ అనుమతులను రద్దుచేయించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు గౌడ ఐక్యసంఘాల నాయకులు వివరించారు. ఇప్పుడు మైనింగ్ మాఫియాకు చెందిన కోంత మంది స్వార్థపరులు, మైనింగ్ యజమానులు అధికారులతో చేతులు కలిపి మైనింగ్ అనుమతులు తీసుకవచ్చి పాపన్న నిర్మించిన కోట పై మైనింగ్ చేయాలని చూస్తున్నారని వివరించారు. అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా మండలంలోని పలు గ్రామాల ప్రజలు , స్థానిక ప్రజాప్రతినిధులు వ్యతిరేకిస్తున్నా మైనింగ్ శాఖ అధికారులతో చేతులు కలిపి తెలంగాణ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు తెలిపారు గౌడ ఐక్య సంఘాల నాయకులు.

కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలం సర్వాయి పేట లోని సర్థార్ సర్వాయి పాపన్న గౌడ్ నిర్మించిన కోట , చెరువులు, కోనేరు, ముఖద్వారం, భూ సోరంగ మార్గం, కోటల సముదాయాన్ని మైనింగ్ పేరుతో విద్వాంసం చేయాలని కోంత మంది క్వారీ యజమానులు అక్రమంగా అనుమతి పోంది మైనింగ్ చేస్తున్నాదానిపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించి మైనింగ్ శాఖ అధికారులతో మాట్లాడి సర్థార్ సర్వాయి పాపన్న కోటల సంరక్షణకు చర్యలు తీసుకోని మైనింగ్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర సంస్కృతి , సాంప్రదాయాలతో పాటు చారిత్రక వైభవాన్ని కాపాడాలని కోరారు. ఐక్య సంఘాల నాయకుల వినతి పత్రం పై స్పందించారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి సమస్యను వెంటనే పరిష్కారం అయ్యేలా చూస్తామని సానుకూలంగా స్పందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అదేశాల మేరకు కరీంనగర్ లోని సైదాపూర్ మండలం సర్వాయిపేట కోట , చెరువుల సముదాయం, ముఖద్వారం, చారిత్రక కోటలను రాష్ట్ర పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేస్తామని ఐక్య వేదిక నాయకులకు హామినిచ్చారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

రాష్ట్ర అబ్కారి, క్రీడా, పురావస్తూ , పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ కు సచివాలయంలో వినతి పత్రం అందజేసిన ఐక్య సంఘాలు నాయకులు అంబాల నారాయణ గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర అద్యక్షులు, పెంటయ్య గౌడ్, సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం గౌరవ అద్యక్షులు, కలర్ సత్తన్న, సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం అద్యక్షులు, రవిగారి ప్రసాద్ గౌడ్, మోకు దెబ్బ రాష్ట్ర ఉపాద్యక్షులు, బబ్బూరి బిక్షపతి గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర ఉపాద్యాక్షులు, సింగం సత్తయ్య గౌడ్, సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం, బూడిద నర్సయ్య గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి జనగామ జిల్లా అద్యక్షులు, తాళ్లపల్లి వీరాస్వామి గౌడ్, గౌడ ఐక్య సాధన సమితి జనగామ జిల్లా ఉపాద్యాక్షులు, కోండాపురం బాలారాజ్ గౌడ్, మోకు దెబ్బ రాష్ట్ర కార్యదర్శిలు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను కలసిన వారిలో ఉన్నారు.

More Press Releases