తెలంగాణ మీడియా అకాడమీని సందర్శించిన జార్ఖండ్ జర్నలిస్టుల బృందం

Related image

పత్రికా ప్రకటన
తేదీ 5 .1 .2023
 తెలంగాణ ప్రభుత్వానికి
 జార్ఖండ్ జర్నలిస్టుల ప్రశంస 
_-----------------------------------
 జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు మీడియా అకాడమీ ద్వారా చేపడుతున్నదని అకాడమీ చైర్మన్
అల్లం నారాయణ తనను కలిసిన జార్ఖండ్ ప్రెస్ సలహా సమితి సభ్యులకు తెలియజేశారు. ఒకవైపు శిక్షణ మరోవైపు సంక్షేమాన్ని తెలంగాణ ప్రభుత్వం తమ అకాడమీ ద్వారా నెరవేరుస్తున్నదని వారికి తెలిపారు. జర్నలిస్టు సంక్షేమానికి శిక్షణకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను జార్ఖండ్ జర్నలిస్టులు ప్రశంసించారు 16 మంది సభ్యులతో కూడిన జార్ఖండ్ప్రె స్ సలహాసమితి గురువారం తెలంగాణ మీడియా అకాడమీ ని సందర్శించింది. ఈ సందర్భంగా జార్ఖండ్ జర్నలిస్టులు అడిగిన అనేక ప్రశ్నల కు సమాధానమిస్తూ అకాడమీ చైర్మన్ మాట్లాడారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట్ల జర్నలిస్టుల సంక్షేమ నిధి ఏర్పాటుకు శ్రీకారం చుట్టి, ఇప్పటివరకు గత ఆరు సంవత్సరాల లో ప్రభుత్వం తరఫున 42 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. తెలంగాణ మీడియా అకాడమీ ఈ డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దానిపై వచ్చిన వడ్డీతో ఇప్పటివరకు 456 మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు తో పాటు ప్రతినెల 3000 రూపాయల పెన్షన్ ఐదు సంవత్సరాల పాటు ఇస్తున్నదని అన్నారు. మరణించిన జర్నలిస్టుల పిల్లలకు చదువుకోవడానికి ఎల్కేజీ నుండి పదవ తరగతి వరకు నెలనెలా 1000 రూపాయలు ట్యూషన్ ఫీజు కోసం ఇస్తున్నదని. తీవ్ర అనారోగ్యం ప్రమాద బారిన పడిన జర్నలిస్టు పనిచేయలేని స్థితిలో ఉంటే 50వేల రూపాయల ఆర్ధిక సహాయం అకాడమీ అందజేస్తున్నదని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దాదాపు 20 వేల అక్రెడిటేషన్లు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆరోగ్య కార్డు ద్వారా కార్పొరేట్ దవాఖానాలలో చికిత్స సౌకర్యం జర్నలిస్టులకు కల్పిస్తున్నదని, అక్రెడిటెడ్ జర్నలిస్టులకు  బస్సు పాస్ ఐదు లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నదని నారాయణ అన్నారు.

     
తెలంగాణ మీడియా అకాడమీ సొంత భవన నిర్మాణం పూర్తయ్యే దశలో ఉన్నదని త్వరలో అకాడమీ తన కార్యక్రమాలు కొత్త మీడియా అకాడమీ భవనం ద్వారా చేపడుతుందని అన్నారు. ఈ సమావేశంలో ఆందోల్ శాసనసభ్యులు క్రాంతి కిరణ్జ ర్నలిస్టు నాయకుడు మారుతీ సాగర్, అకాడమీ సెక్రెటరీ నాగులపల్లి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. జార్ఖండ్ సలహాసమితి బృందంలో యు ఎన్ ఐ వినయ్ కుమార్ దైనిక్ భాస్కర్ ప్రదీప్ కుమార్ సింగ్ ట్రైబల్ టీవీ సురేంద్రలాల్ షోరూం ఏఐఆర్ అబ్దుల్ హమీద్ తదితరులు ఉన్నారు. మీడియా అకాడమీ కార్యకలాపాల నివేదికలు ప్రచురించిన పుస్తకాలను,బైలాస్ ను, జా ర్ఖండ్ జర్నలిస్టులు తీసుకుని వెళ్లారు.

More Press Releases