అత్యుత్తమ ప్రీ-ఓన్డ్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్‌గా రెనో క్విడ్ (RENAULT KWID)కు గుర్తింపు
⮚ Renault KWID 4,25,000 సంతోషకరమైన కస్టమర్లతో భారతదేశంలో రెనాల్ట్ మోడళ్లలోకెల్లా నిజమైన గేమ్ ఛేంజర్‌గా ఉద్భవించింది.
న్యూఢిల్లీ/ హైదరాబాద్ , జనవరి 3, 2023: భారతదేశపు ప్రముఖ సంస్థ రెనాల్ట్ ఆటోస్ వారి రెనాల్ట్ క్విడ్ 2023 అత్యుత్తమ ప్రీ-ఓన్డ్ స్మాల్ హ్యాచ్‌బ్యాక్ కార్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకుంది. ప్రీ-ఓన్డ్ ఆటోమొబైల్ విభాగంలో ప్రముఖ ఆటోమోటివ్ పబ్లికేషన్ ఆటోకార్ ఇండియా సహకారంతో OLX ఆటోస్ ఈ అవార్డులు ప్రకటించింది.
రెనాల్ట్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ మరియు మార్కెటింగ్) సుధీర్ మల్హోత్రా మాట్లాడుతూ, "కొత్త కారు కొనుగోలుదారులలో మాత్రమే కాకుండా ప్రీ ఓన్డ్ కారు కొనాలనుకునే వినియోగదారులలో కూడా రెనాల్ట్ క్విడ్‌కు లభిస్తున్న ప్రజాదరణకు ఈ అవార్డు సాక్ష్యం. రెనాల్ట్ క్విడ్ అత్యంత పోటీ ఎంట్రీ లెవల్ కార్ల విభాగంలో తన సామర్థ్యాన్ని నిరూపించుకుంది, ఇది మంచి సామర్థ్యం, గొప్ప ఫీచర్లు, ఆకర్షణీయమైన ఎస్‌యూవీ ప్రేరేపిత డిజైన్, వినూత్న ఆధునిక లక్షణాలను కలిగి ఉంది. ఇది మాకు నిజమైన గేమ్ ఛేంజర్, దేశంలో మా అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది. మా కస్టమర్లు బ్రాండ్ పై ఉంచిన నమ్మకానికి మేము చాలా కృతజ్ఞులం మరియు రెనాల్ట్ క్విడ్‌ను ఉత్తమ ప్రీ-ఓన్డ్ బడ్జెట్ కారుగా గుర్తించినందుకు జ్యూరీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.’’ అని అన్నారు.
ఆకర్షణీయత, సృజనాత్మకత, సామర్థ్యం అనే స్తంభాలపై నిర్మించబడిన క్విడ్, భారతదేశంలో 4,25,000 కంటే ఎక్కువ మంది సంతోషకరమైన కస్టమర్లను కలిగి ఉంది, రెనాల్ట్ మోడళ్లలో నిజమైన గేమ్ చేంజర్ ఉత్పత్తిగా నిలిచింది. రెనాల్ట్ క్విడ్ తన సమకాలీన ఎస్‌యూవీ ప్రేరేపిత డిజైన్ లాంగ్వేజ్‌తో భారతదేశంలో ఎంట్రీ విభాగాన్ని పునర్నిర్వచించింది, అధిక గ్రౌండ్ క్లియరెన్స్, బెస్ట్ ఇన్ క్లాస్ ఫీచర్లు మరియు తక్కువ ఖర్చు అందిస్తుంది, అధిక స్థానికీకరణ స్థాయిలతో ఇది సాధ్యమైంది, బలమైన 'మేక్ ఇన్ ఇండియా'కు ఇది సాక్ష్యంగా నిలుస్తుంది. ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వీడియో ప్లేబ్యాక్, వాయిస్ రికగ్నిషన్ ఫీచర్లతో అత్యత్తమ స్థాయి 8 అంగుళాల టచ్ స్క్రీన్ మీడియానావ్ ఎవల్యూషన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను గొప్ప స్థాయికి తీసుకువెళుతుంది - ఇది డ్రైవర్ ప్రతిదీ హ్యాండ్స్ ఫ్రీ, వేగంగా, సులభంగా నియంత్రించడానికి సహాయపడుతుంది. సిల్వర్ స్ట్రీక్ ఎల్ఈడి డిఆర్ఎల్‌లు అద్భుతమైన ముద్ర వేస్తాయి, కారుకు ప్రీమియం అప్పీలును ఇస్తాయి.
ఇది ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాన్ని అందిస్తుంది, ఇది ఫస్ట్-ఇన్-క్లాస్ రివర్స్ పార్కింగ్ కెమెరా గైడ్‌లైన్స్ కలిగి ఉంది, ఇది ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ORVMతో పాటు కఠినమైన ప్రదేశాలలో కూడా పార్క్ చేయడానికి సహాయపడుతుంది. పనితీరు పరంగా, ఎఆర్ఎఐ టెస్టింగ్ సర్టిఫికేషన్ ప్రకారం 0.8 లీటర్ విభాగంలో క్విడ్ 0.8L 22.25 కిమీ/లీ ఉత్తమ ఇంధన సామర్థ్యాన్ని అందిస్తోంది. రెనాల్ట్ క్విడ్ నిర్వహణ వ్యయం కిలోమీటరుకు కేవలం 35 పైసలు మాత్రమే మరియు 2 సంవత్సరాలు/50,000 కిలోమీటర్ల(ఏది ముందైతే అది) సమగ్ర తయారీదారు వారంటీతో వస్తుంది, 5 సంవత్సరాల వరకు పొడిగించుకునే అవకాశం, నిర్వహణ అవసరాలను చూసుకోవడానికి ఈజీ-కేర్ ప్యాకేజీతో వస్తుంది,
వినియోగదారులు అసమాన బ్రాండ్ యాజమాన్య అనుభవాన్ని మరియు మనశ్శాంతిని ఆస్వాదించడానికి ఇది వీలు కల్పిస్తుంది.
రెనాల్ట్ క్విడ్ భారతీయ మార్కెట్ ప్రస్తుత భద్రతా అవసరాలన్నింటికీ అనుగుణంగా ఉంది మరియు ప్రయాణికులు, పాదచారులు ఇద్దరినీ రక్షించడంలో మేటి. ఇందులో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ఎబిఎస్ మరియు ఇబిడి, సీట్ బెల్ట్ రిమైండర్, ఓవర్ స్పీడ్ అలర్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు మరియు డ్రైవర్ సైడ్ పైరో & లోడ్ లిమిటర్‌తో కూడిన ప్రీ-టెన్షనర్