జి నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ విమెన్ ను సందర్శించిన గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము

Related image

హైదరాబాద్, డిసెంబర్ 29, 2022: కళాశాల రజతోత్సవం, భారతదేశ ఆజాదీ కా అమృత మహోత్సవ్ ను పురస్కరించుకొని జి నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజ్ ఫర్ విమెన్ (షేక్ పేట, హైదరాబాద్) విద్యార్థులను ఉద్దేశించి గౌరవనీయ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము  ప్రసంగించారు.
‘ప్రతి స్థాయిలోనూ మహిళా సాధికారికతను ప్రోత్సహించే సమాజం మాత్రమే అసలైన ఆధునిక, అభివృద్ధి చెందిన సమాజంగా భావించబడుతుంది’’ అని రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా అన్నారు.
రజతోత్సవాలకు  గౌరవనీయ తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్,  ఈశాన్య ప్రాంత అభివృద్ధి, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ శ్రీ జి. కిషన్ రెడ్డి,  GNITS చైర్మన్ పి. సుబ్బారెడ్డి; జి. పుల్లారెడ్డి ఛారిటీస్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ జి రాఘవరెడ్డి,  జిఎన్ఐటిఎస్ వైస్ చైర్‌పర్సన్ శ్రీమతి శ్రీవిద్యా రెడ్డి,  జిపిఆర్ ఛారిటీస్ ట్రస్ట్ ట్రస్టీ శ్రీ జి. ఏకాంబర రెడ్డి మరియు జిఎన్‌ఐటిఎస్ ప్రిన్సిపాల్ డా. రమేష్ రెడ్డి తదితరులు కూడా హాజరయ్యారు.
  

   
     ఈ సందర్భంగా శ్రీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, “25 సంవత్సరాల క్రితం STEM కోర్సులలోకి ఎక్కువ మంది మహిళలను తీసుకురావాలనే సమగ్ర దృక్పథంతో జి పుల్లారెడ్డి గారు తెలంగాణ, ఏపీ ప్రాంతంలో మొదటి మహిళా ఇంజనీరింగ్ కళాశాలను ప్రారంభించారు.   మా రజతోత్సవ వార్షికోత్సవం సందర్భంగా ఇప్పుడు గౌరవనీయులైన రెండవ మహిళా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారికి ఆతిథ్యం ఇవ్వడం మాకు గర్వకారణం. ఎక్కువ మంది మహిళలు అభివృద్ధి చెందకుండా నిరోధించే అడ్డంకులను ఛేదించే విషయంలో మనందరి పాత్ర ఉంటుంది. గౌరవనీయులైన రాష్ట్రపతితో పాటు మనమంతా మన వంతు కృషి చేసి, ప్రతి మహిళకు, అమ్మాయికి చరిత్ర సృష్టించే మంచి అవకాశం ఉందని భరోసా ఇద్దాం’’ అని అన్నారు.

శ్రీవిద్యా రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘‘సమాజంలోని వివిధ వర్గాలలో నాయకత్వ స్థానాల్లో ఎక్కువ మంది మహిళలు ఉండేలా మనం కట్టుబడి ఉండాలి. GNITSలో 18,000 మంది జీఎన్ఐటీయన్లు చాలా పటిష్ఠమైన పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌ ను కలిగి ఉన్నారు. వారు ఇప్పుడు పెద్ద కార్పొరేట్లు, పరిశోధన సంస్థలు, ప్రభుత్వ సంస్థలలో అత్యున్నత స్థానాల్లో ఉన్నారు మరియు వివిధ రంగాల్లో ప్రముఖ నిపుణులుగా ఉన్నారు. GNITS యొక్క ప్రతిభావంతులైన రీసెర్చ్ ఫ్యాకల్టీ సభ్యులు TIDE (వికలాంగులు మరియు వృద్ధుల కోసం సాంకేతికత ఇంటర్వెన్షన్స్) ప్రోగ్రామ్ మరియు డివైస్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (DDP) వంటి కార్యక్రమాల కింద భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంతో చురుకుగా కలసి పని చేస్తున్నారు. GNITS అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (AIC)ని స్థాపించడానికి భారత ప్రభుత్వం యొక్క అటల్ ఇన్నోవేషన్ మిషన్ కింద ఎంపిక చేయబడింది, ఇది STEM విభాగంలో మహిళల ద్వారా లోతైన సాంకేతిక ఆవిష్కరణలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెడుతుంది.గౌరవనీయమైన రాష్ట్రపతి కెరీర్ నుండి మేం స్ఫూర్తిని పొందుతున్నాం. ఆమె GNITS సందర్శన విజయవంతమైన, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడానికి దేశంలోని యువతకు స్ఫూర్తినిస్తుంది, ప్రేరేపిస్తుంది’’ అని అన్నారు. 

More Press Releases