క్రిస్టియన్ స్మశాన వాటికలకు 68.32 ఎకరాల భూమి కేటాయింపు చారిత్రాత్మకం: క్రిస్టియన్ ప్రతినిధులు

Related image

  • స్వాతంత్ర్య అనంతరం తెలంగాణ ప్రభుత్వ ఔదార్యం

  • సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామన్న క్రిస్టియన్లు

  • సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతా భారీ సభకు 27న సన్నాహక సమావేశం

  • ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్ తో భేటీ అయిన బిషప్ లు, పాస్టర్ లు, క్రిస్టియన్ ప్రతినిధులు

గ్రేటర్ హైదరాబాద్ క్రిస్టియన్ లకు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలలోని వివిధ ప్రాంతాల్లో 68.32 ఎకరాల భూమిని స్మశాన వాటికల కోసం తెలంగాణ ప్రభుత్వం కేటాయించడం చారిత్రాత్మక విషయమని బిషప్ లు, పాస్టర్ లు, క్రిస్టియన్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తో వారు సోమవారం ఆయన నివాసంలో సమావేశమై సంతోషాన్ని పంచుకున్నారు.

స్వాతంత్ర్య అనంతరం అనేక సంవత్సరాల నుంచి తమ సమస్యలు ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, కానీ తెలంగాణా ప్రభుత్వం తమ పట్ల ఎంతో ఔదర్యాన్ని ప్రదర్శించి 68.32 ఎకరాల భూమిని కేటాయించిందని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కు వారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్ కు జీవితాంతం రుణ పడి ఉంటామని వారు స్పష్టంచేశారు. ఈ సందర్భంగా బిషప్ లు, పాస్టర్ లు, క్రిస్టియన్ సంఘాల ప్రతినిధులు బోయినపల్లి వినోద్ కుమార్ ను ఘనంగా సన్మానించారు.

సీఎం కేసీఆర్ కు ఆత్మీయ కృతజ్ఞతలు తెలిపేందుకు త్వరలో భారీ సభ నిర్వహించనున్నామని, అందుకోసం ఈనెల 27 న సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ స్మశాన వాటికల వేదిక అధ్యక్షుడు బిషప్ విల్సన్ సింగం, ప్రధాన కార్యదర్శి సాల్మన్ రాజ్ తెలిపారు. త్వరలోనే సీఎం కేసీఆర్ తో పెద్ద ఎత్తున క్రిస్టియన్ లు సమావేశం కానున్నట్లు వారు పేర్కొన్నారు.

More Press Releases