మెడిక్స్‌తో భాగస్వామ్యం చేసుకుని తమ వినియోగదారుల కోసం ప్రత్యేకమైన క్రిటికల్ ఇల్‌నెస్ సంబంధిత సేవలను అందిస్తున్న టాటా ఏఐఏ లైఫ్
· వినియోగదారుల పట్ల ప్రేమ అనే ప్రధాన విలువతో ఈ కార్యక్రమం, వారి జీవిత ప్రయాణంలో మద్దతు అందించాలనే టాటా ఏఐఏ యొక్క నిబద్ధతను బలపరుస్తుంది.
· ట్రాన్‌శాక్షనల్ పేయర్ విధానాన్ని మించి వినూత్న పరిష్కారాలను అందించడం ద్వారా వినియోగదారులకు భాగస్వామిగా మారాలనే టాటా ఏఐఏ సంకల్పాన్ని ఇది మరింత ముందుకు తీసుకువెళ్తుంది
ముంబై, 01 డిసెంబర్ 2022 : భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న జీవిత భీమా కంపెనీలలో ఒకటైన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ (టాటా ఏఐఏ) ఇప్పుడు దాదాపు 300 మంది ఫిజీషియన్ల బృందంతో పాటుగా 4500 మందికి పైగా ఇండిపెండెంట్ వైద్య నిపుణులతో వైద్య నిర్వహణ పరిష్కారాలను అందిస్తున్న అంతర్జాతీయ కంపెనీ మెడిక్స్ తో భాగస్వామ్యం చేసుకుంది. ఈ భాగస్వామ్యంతో టాటా ఏఐఏ యొక్క వినియోగదారులు స్ధానిక మరియు అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన వైద్య నిపుణుల సలహాలతో అతి తీవ్రమైన అనారోగ్య సమస్యలను నిర్వహించుకోగలరు. ఈ సేవలను అర్హత కలిగిన జీవిత భీమా పాలసీలను టర్మ్, సేవింగ్స్, పెన్షన్ ప్లాన్ పాలసీదారులకు కాంప్లిమెంటరీగా అందిస్తారు.
ఈ భాగస్వామ్యం గురించి టాటా ఏఐఏ ఎండీ–సీఈఓ నవీన్ తహిల్యానీ మాట్లాడుతూ ‘‘ఇటీవలి కాలంలో హోలిస్టిక్ వెల్‌నెస్ అనేది అతి ముఖ్యమైన చర్చగా నిలుస్తుంది. మా వినియోగదారులు ఆరోగ్యంగా, సంతోషంగా, సుదీర్ఘకాలం జీవించాలని మేము కోరుకుంటాము. అందుకోసమే వారి ఆరోగ్య, సంక్షేమ ప్రయాణంలో భాగమవుతుంటాము. మెడిక్స్‌తో భాగస్వామ్యం ద్వారా మేము మా విలువ ప్రతిపాదనను మరింత వృద్ధి చేసుకోవాలనుకుంటున్నాము. మెడిక్స్‌తో భాగస్వామ్యంతో వినియోగదారులు వ్యక్తిగతీకరించిన సూచనలను అంతర్జాతీయ వైద్యనిపుణుల నుంచి సైతం పొందవచ్చు’’ అని అన్నారు.
ఈ భాగస్వామ్యం గురించి మెడిక్స్ ప్రెసిడెంట్, సీఈఓ సిఖాల్ అజ్మాన్ మాట్లాడుతూ ‘‘మెడిక్స్ వద్ద మేము విప్లవాత్మక వర్ట్యువల్ కేర్ అందిస్తుంటాము. అదే సమయంలో డిజిటల్ పరిష్కారాలను మానవ జోక్యంతో అందిస్తుంటాము. టాటా ఏఐఏ ఇండియా భాగస్వామ్యంతో రోగులు , ఆరోగ్య సంరక్షణ వ్యవస్ధల నడుమ అంతరాలు పూరించాలనే మా లక్ష్యంలో నూతన అధ్యాయం మొదలవుతుంది’’ అని అన్నారు.