నిట్‌ వరంగల్‌ క్యాంపస్‌ వద్ద ఈవీ లను అందుబాటులోకి తీసుకువచ్చిన హిటాచీ ఎనర్జీ

Related image

·       సాంకేతిక ప్రమాణాలను రూపొందించడం నుంచి విప్లవాత్మక కార్బన్‌ న్యూట్రల్‌ సాంకేతికతలను  అమలులోకి తీసుకువచ్చేంత వరకూ కార్బన్‌ –న్యూట్రల్‌ ఆశయాలకు సహకారం అందించడంలో చేసిన ప్రయత్నాలకు గుర్తింపుగా ప్రొఫెసర్‌ ఎన్‌ వీ రమణారావు నుంచి అల్యుమ్ని అవార్డు అందుకున్న ఎన్‌ వేణు.· 

      హిటాచీ ఎనర్జీ ఇండియా– సౌత్‌ ఆసియా  ఎండీ , సీఈఓ ఎన్‌ వేణు నుంచి 8 సీటర్‌  విద్యుత్‌ వాహనం అందుకున్న నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ వరంగల్‌ (నిట్‌–డబ్ల్యు) డైరెక్టర్‌, ఇన్‌ చార్జ్‌ ప్రొఫెసర్‌ ఎన్‌ వీ రమణారావు

వరంగల్‌, 28 నవంబర్‌ 2022 : సస్టెయినబల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ (ఎస్‌డీజీ) మరియు స్మార్ట్‌ మొబిలిటీ  లక్ష్యాలను చేరుకోవడంలో తమ ప్రయత్నాలను మరింత వేగవంతం చేసే దిశగా హిటాచీ ఎనర్జీ ఇప్పుడు నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ , వరంగల్‌ (నిట్‌–డబ్ల్యు) క్యాంపస్‌ వద్ద విద్యార్థులు, ఫ్యాకల్టీ కోసం విద్యుత్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనితో పాటుగా ఇనిస్టిట్యూట్‌ క్యాంపస్‌లో నాలుగు చార్జింగ్‌ స్టేషన్‌లను సైతం ఏర్పాటుచేసింది.

ఈ కార్యక్రమంలో  హిటాచీ ఎనర్జీ ఇండియా– సౌత్‌ ఆసియా  ఎండీ , సీఈఓ ఎన్‌ వేణు మాట్లాడుతూ ఈ వాహనాలను అందించడమన్నది  విద్యార్థులను సస్టెయినబిలిటీ, పర్యావరణ దిశగా మళ్లేందుకు స్ఫూర్తి కలిగించే ప్రయత్నమన్నారు. మనకున్నది ఒకే ఒక్క భూమి అంటూ పర్యావరణం కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

ప్రొఫెసర్‌ ఎన్‌ వీ రమణారావు మాట్లాడుతూ హిటాచీ ఎనర్జీ గత సంవత్సరం ఏర్పాటుచేసిన స్మార్ట్‌ గ్రిడ్‌ లేబరేటరీతో విద్యార్ధులు ప్రయోజనం పొందుతున్నారన్నారు. అదే రీతిలో ఇప్పుడు అందుబాటులోకి తీసుకువచ్చిన వాహనాలు విద్యార్ధులకు స్ఫూర్తి కలిగించగలవన్నారు. స్మార్ట్‌ ఎలక్ట్రిక్‌ గ్రిడ్‌ టెక్నాలజీ విద్య,నైపుణ్యాభివృద్ధి, పరిశోధన కోసం తెలంగాణాతో 2020లో హిటాచీ ఎనర్జీ  అవగాహన ఒప్పందం చేసుకుంది.

సాంకేతిక ప్రమాణాలను రూపొందించడం నుంచి విప్లవాత్మక కార్బన్‌ న్యూట్రల్‌ సాంకేతికతలను  అమలులోకి తీసుకువచ్చేంత వరకూ కార్బన్‌ –న్యూట్రల్‌ ఆశయాలకు సహకారం అందించడంలో చేసిన ప్రయత్నాలకు గుర్తింపుగా ప్రొఫెసర్‌ ఎన్‌ వీ రమణారావు నుంచి అల్యుమ్ని అవార్డు –2023 ను ఎన్‌ వేణు అందుకున్నారు.

      
అనంతరం ఎన్‌ వేణుతో కలిిసి హిటాచీఎనర్జీ ఇండియా ాఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ అకిలుర్‌ రెహ్మాన్‌ విద్యార్ధులతో ముచ్చటించడంతో పాటుగా  సైబర్‌ సెక్యూరిటీ, ఐఓటీ, మెషీన్‌ లెర్నింగ్‌ వంటి తాజా సాంకేతికతలపై చర్చించారు. త్వరలోనే విద్యార్థుల ప్రయోజనార్థం లెక్చర్‌ సిరీస్‌ ప్రారంభించనున్నట్లు వేణు వెల్లడించారు.
--

More Press Releases