ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం విస్తృత కార్యక్రమాలు - దేశానికే ఆదర్శం మన తెలంగాణ రాష్ట్రం

Related image

పత్రికా ప్రకటన

తేదిః21-11-2022

 ఆరోగ్య తెలంగాణ దిశగా ప్రభుత్వం విస్తృత కార్యక్రమాలు...
 అందరికీ ఆరోగ్యం..అందుబాటులో ఉచిత వైద్య సేవలు...
 దేశానికే ఆదర్శం మన తెలంగాణ రాష్ట్రం...
 వైద్య విద్య చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన ఘట్టం ఆవిష్కృతం...
 రాష్ట్రంలో 10 వేల సూపర్ స్పెషాలిటీ పడకల ఆసుపత్రి ఏర్పాటు దిశగా సర్కారు అడుగులు...
 2000 పడకల నిమ్స్ విస్తరణ ప్రాజెక్టుకు రూ. 1571 కోట్లతో పరిపాలన అనుమతులు...
 ఇప్పటికే నిమ్స్ లో 1800 పడకలు. 4 వేల పడకలతో నగరం నలువైపులా నాలుగు టిమ్స్, వరంగల్ లో 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మొత్తం 10,000 వేలకు చేరువగా సూపర్ స్పెషాలిటీ పడకలు...
 నిమ్స్ విస్తరణలో భాగంగా 2000 పడకలు. ఇందులో 500 ఐ సి యూ బెడ్స్, 42 విభాగాలు...
 అందుబాటులోకి రానున్న సూపర్ స్పెషాలిటీ నర్సింగ్, అనుబంధ హెల్త్ సైన్సెస్ ట్రైనింగ్...
 సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్య తెలంగాణ దిశగా మరో అడుగు... ఆరున్నర దశాబ్దాల్లో ఆరోగ్య రంగంలో సాద్యం కాని ఎన్నో రికార్డులను తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేళ్లలో సాధించింది. గౌరవ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి పాలనలో ఆరోగ్య తెలంగాణ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నది. ఒకవైపు వైద్య విద్య మరో వైపు నాణ్యమైన వైద్య సేవలను రాష్ట్ర ప్రజలకు చేరువ చేస్తున్నది. “ఆరోగ్య తెలంగాణ” రాష్ట్రాన్ని మన రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. రాష్ట్రంలోని మహిళలకు ఆశాకార్యకర్తలతో "ఏ షీల్డ్" టెస్ట్ కిట్ ద్వారా రక్తహీనత పరీక్షలు నిర్వహించి, రక్తహీనత గల వారికి మెడికల్, పారామెడికల్ సిబ్బందితో వైద్యసేవలను అందించడంతో పాటు న్యూట్రిషన్ ఆహారంపై అవగాహన కల్పించడం కోసం రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా
గర్బిణీ స్త్రీలకు ప్రసవం వరకు తరచు రక్తహీనత పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను అందించడం ఈ కార్యక్రమంలో ఒక భాగం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలలో, గ్రామాలలో హైరిస్క్ ఉన్న వారిని గుర్తించే కార్యక్రమాలు చేపట్టారు. వారికి మెరుగైన వైద్యసహాయం అందించడానికి ప్రధాన ఆసుపత్రులలో గైనకాలజిస్టు నిపుణులను నియమించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయా జిల్లాలోని ప్రాథమిక ఆసుపత్రులను హైరిస్క్ కేసులకు వైద్యసహాయం అందించేలా చర్యలు చేపట్టారు.

    అనీమియా ముక్త్ దిశగా రాష్ట్రం అద్బుత ప్రగతి: వైద్య శాఖ సిబ్బంది రాష్ట్ర వ్యాప్తంగా కిశోర, గర్బిణిల ఆరోగ్యపరిస్థితులపై మెడికల్, పారామెడికల్ సిబ్బందితో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనీమియా,రక్తహీనత లోపం ఉన్నవారికి అవసరమైన మందులు అందిస్తున్నారు. ఆయా జిల్లాలలో 14 నుండి 55 సంవత్సరాలలోపు వారికి రక్తహీనత పరీక్షలు నిర్వహిస్తున్నారు. కౌమారదశ బాలికలకు నెలసరిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అనీమియా విముక్తి జిల్లాలుగా తీర్చిదిద్దేలా కార్యక్రమాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ నిర్వహిస్తున్నది. అనీమియా ముక్త్ కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు పర్చడానికి అడ్మినిస్ట్రేటివ్ ప్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా హైదరాబాద్ డైరెక్టర్ డా. సుభోద్ బృందంతో వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. క్షేత్ర స్థాయిలో ఆయా జిల్లాలలో గర్బీణి స్త్రీలు, కిశోర బాలికల అరోగ్య పరిస్థితులు, వారికి అందిస్తున్న వైద్యసేవలపై వైద్య శాఖ ఉన్నతాధికారులు ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తున్నారు. రక్తహీనతపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ "ఏ షీల్డ్యా ప్" రూపొందించింది. ఆ యాప్ లో వైద్య శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు వివరాలను నమోదు చేస్తారు.

   
అడ్మినిస్ట్రేటివ్ ప్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అనీమియా ముక్త్ కార్యక్రమం పర్యవేక్షిస్తున్నారు
అనీమియా ముక్త్ కార్యక్రమం అమలు చర్యలు సమర్థవతంగా కొనసాగుతున్నాయి. కిశోరబాలికలు, తల్లులు, గర్బిణీ స్త్రీలకు క్షేత్రస్థాయిలొ అందిస్తున్న సేవలపై అధికారులు చేపట్టిన కార్యక్రమాల అమలు తీరు, పర్యవేక్షణపై అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా అధికారులు ఆయా జిల్లా కలెక్టర్లను అభినందించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పవచ్చు. స్వరాష్ట్రంలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ప్రతి ఒక్కరికీ అందాలనేది 
    మన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్. చిరకాల స్వప్నం. వైద్య విద్య కోసం విదేశాలకు వెళ్ళవలసిన అవసరం లేకుండా 33 జిల్లాల్లో ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటు దిశగా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఈ ఏడాది ప్రభుత్వ వైద్య కళాశాలలో అదనంగా 1150 సీట్లు సాధించి దేశ చరిత్రలోనే ఒక అడుగు ముందుకు వేసింది. 850 ఎంబిబిఎస్ సీట్ల స్థాయి నుంచి నేడు 2790 ఎంబిబిఎస్ సీట్లు పెంచుకోవడం మన రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దికి నిదర్శనం. సమాంతరంగా నర్సింగ్ కళాశాలలు, పారామెడికల్ కళాశాలలు ఏర్పాటుకు కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలో వైద్యవిద్య చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ దగిన ఘట్టమని, ప్రజా ప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం
వ్యక్తం చేశారు. 57 సంవత్సరాల సమైఖ్య పాలనలో తెలంగాణ ప్రాంతంలో కేవలం 3 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నవి. స్వరాష్ట్రంలో గత 8 సంవత్సరాలలో 12 ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రభుత్వం ప్రారంభించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిద్దిపేట, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, భద్రాద్రి

   కొత్తగూడెం, నాగర్ కర్నూల్, వనపర్తి, మంచిర్యాల, జగిత్యాల, సంగారెడ్డి, రామగుండం, మహబూబాబాద్ జిల్లాలలో వైద్య కళాశాలలో నేడు విద్య బోధన సదుపాయం ప్రజలకు కల్పించింది.

రాష్ట్రంలో నూతన వైద్య కళాశాలల ఏర్పాటుతో ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించవలసిన దుస్థితి తప్పింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిభ ఉన్న నిరుపేద విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి చదివే అవసరం లేకుండా స్వరాష్ట్రం లోనే వారి స్వప్నాలను సాకారం చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఎంబిబిఎస్, పీజీ, సూపర్స్పె షాలిటీ సీట్లు గణనీయంగా పెరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, మైనార్టి సంక్షేమ, రెసిడెన్షియల్ కళాశాల విద్యార్థులు ప్రభుత్వ వైద్య కళాశాలలో యం.బి.బి.యస్ సీట్లు పొందడం గమనించదగిన విజయం. ఆ విద్యార్థులు ప్రతిభతో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు
ఆదర్శంగా నిలుస్తున్నారు. గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు సైతం రాణిస్తూ అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. మెడికల్ కళాశాలల్లో సీట్లు అధిక సంఖ్యలో పొందుతున్నారు. రాష్ట్ర ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య,ఆరోగ్య సదుపాయాలు అందించి ఆరోగ్య తెలంగాణ రాష్ట్రంగా రూపుదిద్దేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నది.
---------------------------------------------------------------------------------------------------
శ్రీయుత కమిషనర్, సమాచార పౌర సంబంధాల శాఖ, హైదరాబాద్ వారిచే జారీ చేయనైనది.

More Press Releases